ETV Bharat / health

మగాళ్లలో జుట్టు రాలే సమస్య - మీకు తల స్నానం చేయడం రాకనే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 10:19 AM IST

Hair Washing Mistakes : చాలా మంది మగాళ్లలో జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్య ఎందుకు వస్తోందో తెలియక తెగ బాధపడుతుంటారు. కొందరిలో జుట్టు రాలడానికి విటమిన్ లోపాలు కారణం కాగా.. మరికొందరిలో మాత్రం సొంత తప్పులే కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ మిస్టేక్స్‌ ఏంటో ఒకసారి చూద్దాం.

Hair Washing Mistakes
Hair Washing Mistakes

Hair Washing Mistakes : స్నానం చేస్తున్నప్పుడు.. దువ్వెనతో దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు రాలిపోతుంటే మనసంతా ఎంతో బాధగా ఉంటుంది. నాకే ఎందుకిలా జుట్టు రాలిపోతోందని కుంగిపోతుంటారు. హెయిర్‌ ఫాల్‌కు కారణం తలకు నూనె సరిగా రాయడం లేదనో విటమిన్ల లోపం వల్లనో కావచ్చని మెజారిటీ జనాలు అభిప్రాయపడుతుంటారు. అయితే.. తలస్నానం చేసేటప్పుడు చేసే పొరపాట్లు వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. మరి.. మీరు ఆ మిస్టేక్స్ చేస్తున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి.

ఎక్కువ సేపు తలస్నానం చేయడం :
కొంత మందికి ఎక్కువ సేపు తలస్నానం చేస్తుంటారు. కానీ.. ఇలా చేయడం వల్ల హెయిర్‌లోని నేచురల్ ఆయిల్ అంతా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు జుట్టు నీటిలో నానడం వల్ల జుట్టులోని సహజ నూనె గుణాలు తొలగిపోయి పొడిగా మారుతుందని చెబుతున్నారు. అందుకే ఎక్కువ సేపు తలస్నానం చేయకూడదని సూచిస్తున్నారు.

వేడి నీటిని ఉపయోగించడం :
కొంత మందికి వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్‌గా అనిపించవచ్చు. దీంతో తరచూ హాట్‌ వాటర్‌తో తలస్నానం చేస్తారు. అయితే, ఇలా దీర్ఘకాలికంగా వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల పురుషులలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుందట. అలాగే.. హెయిర్‌ పొడిగా మారి దురద కూడా వెంటాడుతుందని అంటున్నారు. అందుకే గోరువెచ్చని నీళ్లతో లేదా చల్లటి నీళ్లతో తలస్నానం చేయాలని సూచిస్తున్నారు.

పరిశోధన వివరాలు :
2016లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎస్థటిక్ డెర్మటాలజీ' జర్నల్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఒక అధ్యయనంలో వేడి నీళ్లతో స్నానం చేయడం, జుట్టు రాలడం మధ్య సంబంధాన్ని పరిశీలించారు. ఈ అధ్యయనంలో 100 మంది పురుషులు పాల్గొన్నారు. వారిని రెండు గ్రూపులుగా చేశారు. అందులో 50 మంది 6 నెలలపాటు వేడి నీళ్లతో తలస్నానం చేశారు. మిగతా 50 మంది చల్లనీటితో తలస్నానం చేశారు. అయితే, వేడి నీళ్లతో తలస్నానం చేసిన పురుషులలో జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట.

కండీషనర్‌ను వాడకపోవడం :
మనలో చాలా మంది షాంపూతో తలస్నానం చేసిన తర్వాత టవల్‌తో తుడుచుకుని జుట్టును వదిలేస్తుంటారు. కండీషనర్‌ వంటి వాటిని అస్సలే యూజ్‌ చేయరు! ఇదే అందరూ చేసే పెద్ద పొరపాటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల జుట్టు తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుందని తెలియజేస్తున్నారు. అందుకే షాంపూతో స్నానం చేసిన తర్వాత కచ్చితంగా కండీషనర్‌ను ఉపయోగించాలి.

తడిగా ఉన్న జుట్టును బ్రష్‌తో దువ్వుకోవడం :
తలస్నానం చేసిన తర్వాత తడిగా ఉన్న జుట్టును బ్రష్‌తో దువ్వుకోవడం వల్ల కూడా జుట్టు చిట్లిపోతుందని నిపుణులంటున్నారు. అందుకే తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఎండిపోయే వరకు బ్రష్‌ను ఉపయోగించకూడదని సూచిస్తున్నారు. ఇలా తలస్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల జుట్టు హెల్దీగా ఉంటుందని నిపుణులంటున్నారు.

జుట్టు సమస్యలన్నీ క్లియర్ - ఈ నేచురల్ ఆయిల్స్​ గురించి తెలుసా?

తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సీడ్స్​ ట్రై చేస్తే నల్లగా మారడం పక్కా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా? కొబ్బరి నూనె, కరివేపాకుతో సమస్యకు చెక్​- అదెలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.