ETV Bharat / health

తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సీడ్స్​ ట్రై చేస్తే నల్లగా మారడం పక్కా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 10:40 AM IST

Tips for White Hair to Black : అందంగా కనిపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే జుట్టును నల్లగా మార్చడానికి ఎన్నో కెమికల్స్​తో కూడిన కలర్స్ వాడుతుంటారు. కానీ ఇవేవి అవసరం లేకుండా ఇంట్లో దొరికే కలోంజి విత్తనాలు అద్భుతమైన రిజల్ట్స్​ అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో..

Tips for White Hair to Black by Kalonji Seeds
Tips for White Hair to Black by Kalonji Seeds

Tips for White Hair to Black by Kalonji Seeds: తెల్లజుట్టు.. ఇప్పట్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడంతో చాలా మంది యువత వీటిని కవర్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. జీవన శైలి విధానాలు, ఆహారపు అలవాట్లు కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణమవుతున్నాయి. అయితే తెల్ల జుట్టును అలాగే వదిలేయానూ లేరు, ఇటు రసాయనాలతో కూడిన హెయిర్ డైలు, షాంపూలు వాడలేరు. మరి ఈ సమస్యకు పరిష్కారం అంటే ఓ మార్గం ఉంది. అవును మీరు విన్నది నిజమే. తెల్లజుట్టును నల్లగా మార్చడంలో కలోంజి విత్తనాలు అద్భుతంగా సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. వీటినే నల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఇవి నల్ల నువ్వులను పోలి ఉంటాయి. ఈ కలోంజి విత్తనాలను ఉపయోగించి ఇంట్లోనే రకరకాల హెయిర్ డైలు తయారు చేసుకుని వాడితే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సూపర్​ పోషకాలు: కలోంజి విత్తనాలలో ప్రొటీన్​, ఫైబర్​, ఐరన్​, కాపర్​, జింక్​ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి. వీటిని జుట్టుకు ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యంగా, నల్లగా నిగనిగలాడుతుంది. జుట్టు చిట్లడం, రాలడం కూడా తగ్గుతుంది. మరి కలోంజి విత్తనాలతో ప్రిపేర్​ చేసే వివిధ రకాలు హెయిర్​ డై లు ఇప్పుడు చూద్దాం..

కలోంజి విత్తనాలు, కాఫీ పొడి:

  • స్టవ్​ మీద బాండీ పెట్టి అందులో ఒక కప్పు కలోంజి విత్తనాలు వేసి సన్నని మంట మీద బాగా వేయించాలి. ఈ విత్తనాలు వేగిన తరువాత వాటిని పక్కన పెట్టుకుని చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి.
  • ఈ పొడిలో 2 టీస్పూన్ల కాఫీ పొడి, 2 టీ స్పూన్ల ఆవాల నూనె వేసి బాగా మిక్స్ చెయ్యాలి అంతే హెయిర్​ డై రెడీ.
  • దీనిని జుట్టుకు మూలాల నుంచి బాగా పట్టించి మసాజ్ చెయ్యాలి.
  • సుమారు 2 గంటల వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత గాఢత లేని షాంపూతో తల స్నానం చెయ్యాలి.
  • దీనివల్ల క్రమంగా జుట్టు నల్లగా మారుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

నల్ల జీలకర్ర, పెరుగు:

  • న‌ల్ల జీల‌క‌ర్ర‌ను తీసుకుని డ్రై రోస్ట్ చేసి.. ఆ త‌ర్వాత మెత్త‌గా పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల న‌ల్ల జీల‌క‌ర్ర పొడి, రెండున్న‌ర స్పూన్ల పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, జుట్టుకు అప్లై చేయాలి.
  • గంట లేదా రెండు గంట‌ల పాటు ఆర‌నిచ్చి అనంత‌రం గాఢత లేని షాంపూతో హెడ్ బాత్ చేయాలి.
  • ఇలా వారంలో రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు స‌మ‌స్య దూరం అవుతుంది.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్రైకాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కలోంజి విత్తనాలు తెల్లజుట్టును నల్లగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడతాయని కనుగొన్నారు.

జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్​లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో కలోంజి విత్తనాల నుంచి తీసిన నూనె జుట్టు రంగును ముదురు చేయడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.

ఉప్పు నీటితో తలస్నానం చేస్తున్నారా? - తెల్ల వెంట్రుకలను పిలిచినట్టే!

ఉల్లిపాయ రసం - ఇలా వాడితే జుట్టు రాలడం తగ్గిపోతుంది!

మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలా? - బ్లాక్ టీని ఇలా వాడితే రిజల్ట్ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.