ETV Bharat / health

ఈ పోపు దినుసుతో మీ గుండె పదిలం- రోజూ పరగడుపున తింటే సరి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 7:47 AM IST

Updated : Feb 22, 2024, 12:19 PM IST

Fenugreek Seeds Benefits In Telugu
Fenugreek Seeds Benefits In Telugu

Fenugreek Seeds Benefits In Telugu : అధిక కొలెస్ట్రాల్​ అనేది ఈ రోజుల్లో చాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని ఈ సమస్య వేధిస్తోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, నాన్​-వెజ్​ అధికంగా తినటం తదితర కారణాలు కొలెస్ట్రాల్​ పెరిగేందుకు కారణం అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ చిన్న చిట్కాతో మీ ఒంట్లోని చెడు కొలెస్ట్రాల్​ను సులువుగా తగ్గించుకోవచ్చు.

Fenugreek Seeds Benefits In Telugu : ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బు సమస్య సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన వారిలో మాత్రమే కన్పించే ఈ గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి. అయితే గుండె జబ్బులకు ప్రధాన కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ పేరుకుపోవడం. ఈ బ్యాడ్​ కొలెస్ట్రాల్​ మన శరీరంలోని రక్తంలో అధికంగా పేరుకుపోయి ఒక్కోసారి హార్ట్​ ఎటాక్​లకు కూడా దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో మన ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఓ పోపు దినుసు ద్వారా అధిక కొలెస్ట్రాల్​ సమస్యకు చెక్​ పెట్టవచ్చు. ఆ పదార్థమే మెంతులు. నీటిలో నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడుపున తినటం ద్వారా చాలా వరకు చెడు కొలెస్ట్రాల్​ను కరిగించుకోవచ్చు. మరి మెంతులు తినటం వల్ల కొవ్వు కరగడమే గాక కలిగే ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడుపున తినటం వల్ల కలిగే ఆరు ప్రయోజనాలు.

ఫైబర్​ను రిలీజ్​ చేస్తుంది
నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడుపున తినటం ద్వారా మీ జీర్ణవ్యవస్థలో ఫైబర్​ కంటెంట్​ విడుదల అవుతుంది. తద్వారా మీ బాడీలోని అదనపు కొలెస్ట్రాల్​ కరిగిపోతుంది. ఇలా చేయడం వల్ల చెడు కొవ్వు మీ రక్తంలోకి చేరకుండా ఉంటుంది.

ట్రెగ్లిజరైడ్లను తగ్గిస్తుంది
శరీరంలో ట్రైగ్లిజరైడ్లు అనే హానికరమెన కొవ్వు ఉంటుంది. చెడు కొవ్వుతో పాటు ఇది కూడా ప్రమాదకరమే. ఈ రకమైన కొవ్వు రక్తంలో అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు సులువుగా ఎటాక్​ చేస్తాయి. ఉదయాన్నే నానబెట్టిన మెంతులను తినటం ద్వారా ఈ డేంజరస్​ ట్రెగ్లిజరైడ్లను రక్తంలోనే కరిగించుకోవచ్చు. దీంతో మీ గుండె పదిలంగా ఉంటుంది.

LDL కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుంది
చెడు కొలెస్ట్రాల్​గా చెప్పే LDL కొలెస్ట్రాల్​ను​ మెంతులతో సులువుగా కరిగించుకోవచ్చు. మెంతుల్లో ఉండే సపోనిన్స్​ అనే పదార్థం శరీరంలోని బ్యాడ్​ కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుంది.

HDL కొలెస్ట్రాల్​ను పెంచుతుంది
మంచి కొవ్వుగా చెప్పే HDL కొలెస్ట్రాల్​ను నానబబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడుపున తినడం ద్వారా పెంచుకోవచ్చు. ఈ రకం కొలెస్ట్రాల్​ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బరువును కంట్రోల్​ చేస్తుంది
నీళ్లలో నానబెట్టిన మెంతులను తినటం ద్వారా అధిక బరువు సమస్యతో బాధపడే వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది గనుక మీ బాడీ వెయిట్​ను సహజంగా, క్రమంగా తగ్గించుకోవచ్చు.

వాపు సమస్యలను తగ్గిస్తుంది
మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్​లు పుష్కలంగా లభిస్తాయి. యాంటీ ఇన్​ఫ్లమేటరీ ప్రాపర్టీలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వచ్చే వాపు సమస్యలను తగ్గిస్తాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల మేరకే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.

హ్యాంగోవరా? ఈ ఆయుర్వేద సూపర్​ టిప్స్​తో చెక్ పెట్టండిలా!

ఈజీగా బరువు తగ్గాలా? ఉదయం పూట ఈ టిప్స్​ పాటిస్తే అంతా సెట్​!

Last Updated :Feb 22, 2024, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.