ETV Bharat / health

ఈజీగా బరువు తగ్గాలా? ఉదయం పూట ఈ టిప్స్​ పాటిస్తే అంతా సెట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 6:49 PM IST

Weight Loss Tips In The Morning : ఈ రోజుల్లో అధిక బరువు అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రధానమైన సమస్య. మరి మీరు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. వెయిట్​లాస్​ కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా తదితర విషయాలు ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Weight Loss Tips In The Morning
Weight Loss Tips In The Morning

Weight Loss Tips In The Morning : బరువు తగ్గాలని డైటింగ్, వ్యాయామం, వాకింగ్ అంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే బరువు తగ్గడానికి ఉదయాన్నే చిన్న ప్రయత్నాలు మొదలు పెట్టడం మంచిదని అంటున్నారు నిపుణులు. ఉదయం లేచిన వెంటనే బరువు చూసుకోవడం, నీరు తాగటం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మీ బరువుని తగ్గించడానికి ఉపయోగపడతాయి అంటున్నారు. మరి వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా?

బరువు తగ్గేందుకు చేయాల్సిన పనులు ఇవే!
ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే బరువు చూసుకోండి. అప్పటికి మీ కడుపు ఖాళీగా ఉంటుంది కనుక మీ సరైన బరువుని తెలుసుకోగలరు. మధ్యాహ్నం, సాయంత్రం చూసుకుంటే అప్పటికి మీరు ఏదో ఒకటి తిని, తాగి ఉంటారు కాబట్టి వాటి బరువు కూడా మీ బరువుతో కలిపి చూపిస్తుంది.

నీరు ఎక్కువగా తాగండి.
టిఫిన్ తినడానికి ముందు ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. నీటిలో క్యాలరీలు ఉండవు కానీ కడుపు నిండుతుంది, ఆకలి తగ్గుతుంది. దీని వల్ల టిఫిన్ ఎక్కువగా తినకుండా ఉంటాము. నీటితో జీవ క్రియల వేగం సైతం మెరుగవుతుంది. ఇది మీ క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది. వయసులో ఉన్నవారు ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

  1. అల్పాహారం : శరీరం శక్తి కోసం కొవ్వుని ఖర్చు చేస్తుంది, ఇలా చేయడం ద్వారా అదనపు కొవ్వు త్వరగా కరిగే అవకాశం ఉంటుంది. అల్పాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇది త్వరగా ఆకలి కలిగించకుండా చూస్తుంది. అల్పాహారంలో మినుములు, పెసర, వేరుశనగ, గుడ్డు, పెరుగు లాంటివి ఉండేలా చూసుకోండి.
  2. ఆహార జాబితా : ఆరోజంతా ఏమేం తింటామో ఉదయాన్నే జాబితా సిద్ధం చేసుకోండి. దీని వల్ల తక్కువ కెలరీలు ఉండే ఆహారాన్ని ముందే నిర్ణయించుకోవచ్చు. ఎక్కువ కెలోరీలు ఉండే పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్​ను తినకుండా జాగ్రత్త పడండి
  3. ఎండలో కాసేపు గడపండి : ఉదయం వేళల్లో ఎండలో గడిపేవారి శరీర బరువు నియంత్రణలో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ఉదయం వేళల్లో ఎండలో నిలబడటం, వ్యాయామం లాంటివి చేయండి.
  4. ఆహరం ఇలా తీసుకోండి : అల్పాహారాన్ని త్వరత్వరగా కాకుండా నెమ్మదిగా దాని రుచిని, వాసనను ఆస్వాదిస్తూ తినండి. ఇలా తినడం వల్ల ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో మనకి అర్ధమవుతుంది. తద్వారా అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే మనం తింటాం. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
  5. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేవాటిని తీసుకోండి : మధ్యాహ్న భోజనంలో సమతుల్య ఆహారంతో పాటు పండ్లను కూడా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఆహారంతో ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకుంటే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉందనే భావన కలిగిస్తాయి. తద్వారా వెంటనే ఆకలి వేయదు. ఉదయం లేచిన వెంటనే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లైతే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ ఫుడ్స్​ తింటున్నారా? - అయితే మైగ్రేన్‌ ముప్పు పొంచి ఉన్నట్టే!

వేకువజామునే గుండెపోటు ముప్పు- సోమవారాల్లో మరింత అధికం- కారణం ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.