ETV Bharat / health

గర్భాశయ క్యాన్సర్‌ - ఆ వయసులోకి అడుగు పెట్టగానే ఈ టెస్ట్ చేయించుకోవాలట!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 2:06 PM IST

Cervical Cancer Pap Test : మారుతున్న జీవనశైలితో రోగాలు విజృంభిస్తున్నాయి. రకరకాల క్యాన్సర్లు దండెత్తుతున్నాయి. మహిళల విషయానికి వస్తే.. రొమ్ము క్యాన్సర్‌ తర్వాత అత్యంత ప్రమాదకర స్థాయిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఉందని నిపుణులంటున్నారు. దీని నివారణ కోసం మహిళలు ఓ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.

Cervical Cancer Pap Test
Cervical Cancer Pap Test

Cervical Cancer Pap Test : మహిళల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముందు వరసలో ఉంటుంది. చాలా మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ పట్ల కొంత అవగాహన ఉన్నప్పటికీ.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ మాత్రం మెజారిటీ జనాలకు తెలియదు. దీన్నే సర్వైకల్ క్యాన్సర్ అని కూడా ఉంటారు. ప్రారంభ దశలోనే దీన్ని గుర్తించలేకపోవడం వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ వ్యాధి బారిన పడకుండా మహిళలు టీకాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత సర్వైకల్‌ క్యాన్సర్‌ను గుర్తించడానికి 'పాప్‌ టెస్ట్‌' చేసుకోవాలని చెబుతున్నారు. అసలు ఏంటి ఈ పరీక్ష? ఎంత వయసు వచ్చిన తర్వాత చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఎలా వస్తుంది ?
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువమంది భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొనడం, గర్భ నిరోధక మాత్రలు వాడటంతోపాటు వంశపారం పర్యంగానూ ఇది ఎక్కువగా వస్తుందట. అలాగే కొన్ని ఇతర కారణాల వల్ల కూడా వస్తుందని అంటున్నారు. ఒక్కసారి ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్యాన్సర్‌గా అభివృద్ధి చెందడానికి 15-20 ఏళ్లు పడుతుందని అంటున్నారు. అందుకే మహిళలు ఈ క్యాన్సర్‌ను గుర్తించడానికి 21 ఏళ్లు దాటాక 'పాప్‌ స్మియర్‌ టెస్ట్‌' చేయించుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.

సర్వైకల్ క్యాన్సర్‌ లక్షణాలు..

  • పీరియడ్స్‌ టైంలో అధికంగా రక్తస్రావం కావడం
  • మెనోపాజ్ తర్వాత సెక్స్‌లో పాల్గొంటే.. సంభోగం తర్వాత రక్తస్రావం కావడం
  • పొత్తి కడుపులో నొప్పి
  • సెక్స్‌లో పాల్గొన్నప్పుడు.. ఆ తర్వాత యోని దగ్గర నొప్పి, మంట రావడం
  • దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జి
  • పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం.. అలాగే ఆ సమయంలో నొప్పిగా అనిపించడం
  • తరచూ కడుపుబ్బరంగా ఉండటం
  • అలసట, నీరసం, విరేచనాలు

అనుమానించాలి..
పైన తెలిపిన లక్షణాలలో ఏవైనా కనిపిస్తే సర్వైకల్‌ క్యాన్సర్‌గా అనుమానించి.. దానిని నిర్ధారించడానికి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ఫస్ట్‌ పాప్ స్మియర్ టెస్టు చేస్తారు. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలను సేకరిస్తారు. తర్వాత వాటిని పరీక్షించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తిస్తారు. ఇంకా పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తించొచ్చని చెబుతున్నారు.

క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే ఎలా ?
మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడకూడదంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని నిపుణుంటున్నారు. అసురక్షిత లైంగిక చర్యల్లో పాల్గొనడం, గర్భ నిరోధక మాత్రలు మిగడం వంటివి చేయకూడదు. అలాగే 9 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు హెచ్‌పీవీ వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.

పీరియడ్స్‌ నొప్పులా? - ఈ యోగాసనాలతో రిలీఫ్ పొందండి!

Alert : మీ బాడీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - ఆ వ్యాధితో బాధపడుతున్నట్టే!

గర్భిణుల్లో దంత సమస్యలు - బిడ్డకూ ఎఫెక్ట్ - ఎలా నివారించాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.