ETV Bharat / health

చంకలో ఎర్రటి దద్దుర్లు ఇబ్బందిపెడుతున్నాయా? - అయితే కారణాలు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 11:24 AM IST

Armpit Rashes Causes : కొందరికి కాలంతో సంబంధం లేకుండా చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తుంటాయి. ముఖ్యంగా చంకల్లో ఎర్రటి దద్దుర్లతో ఇబ్బందిపడుతుంటారు. వీటికి కారణం వేడి అనుకుంటారు. కానీ.. ఈ పరిస్థితికి వేరే కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Armpit Rashes Causes
Armpit Rashes

Causes for Armpit Rashes : చంకల్లో ఎర్రగా దద్దుర్లు రావడానికి అనేక కారణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి.. ఆ కారణాలేంటి? వాటిని ఎలా తగ్గించుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రింగ్​ వార్మ్ ఇన్ఫెక్షన్ : రింగ్‌వార్మ్ అనేది డేర్మటోఫైట్ అనే ఒక ఫంగస్ వల్ల వచ్చే ఇన్​ఫెక్షన్. ఇది ఒక వృత్తాకార లేదా ఓవల్ ఆకారంలో ఉన్న దద్దురు. అందుకే దీనిని రింగ్‌వార్మ్ అంటారు. ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం చెమట పట్టడమే. అందువల్ల అక్కడ చెమటను మేనేజ్ చేసే చర్యలు చేపట్టాలి.

సెబోరిక్ డెర్మటైటిస్ : ఈ సమస్య వచ్చిన వారిలో చర్మం ఎర్రగా మారి దురదగా ఉంటుంది. తరచుగా హార్మోన్లలో మార్పులు, చల్లని వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుందంటున్నారు. ఇది ఎక్కువగా ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వచ్చే ఛాన్స్ ఉంటుంది.

పేరెంట్స్‌లో అలర్జీలుంటే అవి పుట్టే పిల్లలకు వస్తాయా?

మిలియారియా : ఇది ఎక్రైన్ చెమట నాళాలు అడ్డుపడటం లేదా వాపు వల్ల వచ్చే సాధారణ చర్మ సమస్య. మిలియారియా తరచుగా వేడి, తేమ లేదా ఉష్ణమండల వాతావరణంలో కనిపిస్తుంది. దీనినే హీట్ రాష్ లేదా ప్రిక్లీ హీట్ అని కూడా అంటారు. చంకల్లో ఎర్రటి దద్దుర్లు రావడానికి ఇదీ ఓ కారణమంటున్నారు నిపుణులు.

చీము గడ్డలు(Hidradenitis suppurativa) : ఇది మీ చర్మంలో లోతుల్లో గడ్డలను కలిగించే పరిస్థితి. ఈ గడ్డలు సాధారణంగా చర్మం శరీర భాగాలు కలిసిన చోట అంటే.. చంకలు, గజ్జల్లో ఎక్కువగా వస్తుంటాయి. ఇది ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.

ఇవి కూడా కారకాలే..

చంకల్లో చెమట తగ్గించుకోవడానికి చాలా మంది డియోడరెంట్లు, టాల్కమ్ పౌడర్ వంటివి వాడుతుంటారు. ఇవి పడకపోతే కూడా రాష్ రావొచ్చు. ఇంకా ఏవైనా కీటకాలు కుట్టడం, మందులు వాడడం కూడా కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

చంకలో దద్దుర్లు తగ్గించుకోవడానికి ఉత్తమ చిట్కాలు..

ముందుగా మీరు అండర్ ఆర్మ్ రాషెస్​తో ఇబ్బందిపడుతున్నట్లయితే మొదట చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించి అందుకు గల కారణాన్ని తెలుసుకోవాలి. ఆ సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినట్లయితే యాంటీ ఫంగల్ క్రీమ్‌లు యూజ్ చేయడం ప్రారంభించాలి. ఇక అదే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అయితే యాంటీబయాటిక్స్ వాడాలి. కొన్నిసార్లు మీ డియోడరెంట్‌ని మార్చడం వంటి సాధారణ పని వల్ల కూడా చంకలో దద్దుర్లు పోగొట్టుకోవచ్చు. వీటితోపాటు మీరు మేము చెప్పే ఈ టిప్స్ ద్వారా కూడా ఈజీగా చంకల్లో ఎర్రటి దద్దుర్లు తగ్గించుకోవచ్చు. అవేంటంటే..

  • సువాసన లేని వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఆర్మ్​పిట్ రాషెస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం.
  • ఎప్పుడూ సరిగ్గా సరిపోయే బట్టలు లేదా కొంచం వదులుగా ఉండే దుస్తులను ధరించండి. అంతేకానీ టైట్​గా ఉండేవి వేసుకోకండి.
  • ఇక మీరు తప్పక చేయాల్సిన మరో పని ఏంటంటే.. బట్టలు, దుప్పట్లు, టవల్స్​ను తరచుగా ఉతుక్కోవాలి.
  • మట్టిలో పనిచేసినప్పుడు, జంతువులు, మొక్కలను ముట్టుకున్నప్పుడు తప్పనిసరిగా మీ చేతులను క్లీన్ చేసుకోవాలి.
  • ఈ టిప్స్ ఫాలో అవుతూ చర్మనిపుణులు సూచించిన మందులు వాడారంటే చంకల్లో దద్దుర్లు ఈజీగా తగ్గిపోతాయి.

మాయిశ్చరైజర్​తో చర్మం జిడ్డుగా మారుతోందా?.. ఈ నిపుణుల సలహాలు మీకోసమే!

Tomatoes for Skin problems: మీ ముఖంపై చర్మ సమస్యలా.. అయితే ఇంట్లోనే నివారించుకోండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.