ETV Bharat / entertainment

గుడ్ న్యూస్ చెప్పిన నితిన్​ బ్యూటీ - ఫ్యాన్స్​ హంగామా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 5:28 PM IST

Updated : Feb 8, 2024, 5:57 PM IST

Yami Gautam Pregnant
Yami Gautam Pregnant

Yami Gautam Pregnant : బీటౌన్​ నటి యామీ గౌతమ్​ తన ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్​ చెప్పింది. తను తల్లి కానున్నట్లు వెల్లడించింది.

Yami Gautam Pregnant : బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు యాడ్​ షూట్స్​ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది, నెమ్మదిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఉల్లాసా ఉత్సాహా' అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసిన యామీ, 'నువ్విలా' అనే సినిమాతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి ఆ తర్వాత 'గౌరవం', 'యుద్ధం', 'కొరియర్ బాయ్ కల్యాణ్​' సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత బీటౌన్​ వైపుకు అడుగులేసింది. 'కాబిల్​', 'సర్కార్​ 3', 'ఉరి', 'బాలా', 'భూత్​ పోలీస్​' లాంటి సినిమాల్లో మెరిసి బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది.

బీటౌన్​లో సక్సెస్​ఫుల్ స్టార్​గా కొనసాగుతున్న సమయంలో ఆదిత్య ధర్ అనే డైరెక్టర్​తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కూడా తన కెరీర్​తో పాటు పర్సనల్​ లైఫ్​ను బ్యాలెన్స్​ చేస్తూ సక్సెస్​ఫుల్​గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

అయితే తాజాగా యామీ తన ఫ్యాన్స్​ కోసం గుడ్ న్యూస్​ చెప్పింది. ఆమె ప్రెగ్నెంట్​గా ఉన్నట్లు తాజాగా వెల్లడించింది. 'ఆర్టికల్​ 370' అనే మూవీ ట్రైలర్ లాంఛ్​ ఈవెంట్​లో తన భర్తతో కలిసి ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో ఫ్యాన్స్​ ఆనందంలో మునిగిపోయారు. కాబోయే తల్లిదండ్రులకు నెట్టింట విషెస్ చెప్తున్నారు.

Article 370 Movie Trailer : ఇక ఆర్టికల్ 370 సినిమా విషయానికి వస్తే - ఇందులో యామీ గౌతమ్ ఓ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌ రోల్​లో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కశ్మీర్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఘర్షణలు, అవినీతిపై యామీ పోరాడుతుంటుంది. అయితే కశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్ 370 ప్రత్యేక స్టేటస్ వల్ల ఆమె విధులకు ఆటంకం ఏర్పడుతుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ నెలకొన్న గొడవలను అరికట్టేందుకు కూడా ఈ అధికరణ ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఆర్టికల్ 370 అధికరణను ప్రభుత్వం ఎత్తేయాలని నిర్ణయించే క్రమంలో జరిగిన ప్రక్రియను కూడా మేకర్స్​ ట్రైలర్​లో చూపించారు. ఇక యామీతో పాటు ఈ సినిమాలో 'రామాయణ్​' సీరియల్​ ఫేమ్​ సీనియర్ నటుడు అరుణ్​ గోవిల్, ప్రియమణి, వైభవ్​ తత్వవాది కీలక పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గ్లామర్​ క్వీన్​ 'యామీ'.. బుల్లితెర నుంచి వెండితెర స్టార్​గా

Valentine's day 2022: సినిమా కలిపింది వాళ్లిద్దరినీ!

Last Updated :Feb 8, 2024, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.