ETV Bharat / entertainment

చిరు 'విశ్వంభర' అప్డేట్!- డ్యుయల్ రోల్​లో ఆ ఇద్దరు?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 10:48 AM IST

Vishwambhara Dual Role:మెగాస్టార్ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'విశ్వంభర'లో ఇద్దరు యాక్టర్లు డ్యుల్ రోల్ చేయనున్నాట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ నటులు ఎవరంటే?

Vishwambhara Dual Role
Vishwambhara Dual Role

Vishwambhara Dual Role: మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ మల్లిడి కాంబోలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఈ సినిమాలో హీరో చిరంజీవి సరసన గ్లామరస్ బ్యూటీ త్రిష క్రిష్ణన్ నటించనుంది. అయితే ఆదివారం విశ్వంభర సెట్స్​లో హీరోయిన్ త్రిష జాయిన్ కానుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే విశ్వంభరలో హీరోయిన్ త్రిష డ్యుయల్ రోల్​లో నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో దర్శకుడు వశిష్ఠ హీరో మెగాస్టార్​ను కూడా రెండు పాత్రల్లో చూపించనున్నారా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, దీనిపై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మరోవైపు చిరంజీవి కూడా రెగ్యులర్ షూటింగ్​లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో విశ్వంభర షుటింగ్ జరుగుతోంది.

డ్యుయల్ రోల్ నిజమే! అయితే మూవీటీమ్​ ఇటీవల సినిమాలో నటించేందుకు ఇద్దరు కవల పిల్లలు కావాలంటూ కాస్టింగ్ కాల్ ఇచ్చింది. 'మేం ఇద్దరు కవల పిల్లల గురించి వెతుకుతున్నాం. 5సంవత్సరాల వయసున్న మగ కవల పిల్లలు కావాలి' అని ట్విట్టర్​లో పోస్ట్ షేర్ చేశారు. ఆడిషన్ వీడియోలు పంపాల్సిన మెయిల్ ఐడీతో పాటు, సంప్రదించాల్సిన కాంటాక్ట్​ నెంబర్ కూడా ఇచ్చారు. దీంతో విశ్వంభరలో చిరూ డ్యుయల్ రోల్ కన్ఫార్మ్ అని ఫ్యాన్స్ అప్పుడే ఒక అంచనాకు వచ్చేశారు. ఇక తాజాగా హీరోయిన్ త్రిష కూడా డ్యుయల్ రోల్ అని ప్రచారం జరగ్గానే, అది నిజమేనంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమాలో జూనియర్ చిరంజీవిని చూపించాలి కాబట్టి కవల పిల్లల్ని వెతుకుతున్నారు అని కూడా అంటున్నారు.

ఇక ఈ సినిమాను సోషియో ఫాంటసీ జానర్​లో తెరకెక్కుతోంది. దర్శకుడు వశిష్ఠ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లే విధంగా రూపొందిస్తున్నారట. మూవీలో చిరు, త్రిషతోపాటు యంగ్ హీరోయిన్లు . ఇషా చావ్లా, సురభి కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై రూపొందుతోంది. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా, చోట కె నాయుడు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఇక 2025 జనవరి 10న సినిమాను గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

'విశ్వంభర' కోసం ఆ ఇద్దరు బ్యూటీలు - లిస్ట్ చాలా పెద్దదే!

'విశ్వంభర' ప్రపంచంలోకి చిరు ఎంట్రీ - రిలీజ్ ఎప్పుడంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.