ETV Bharat / entertainment

సినీ తారలు మెచ్చిన చిత్రాలు ఏవంటే? - Celebrities Favourite Movies

author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 7:35 AM IST

Updated : May 5, 2024, 8:45 AM IST

Tollywood Celebrities Favourite Movie
Tollywood Celebrities Favourite Movie(Source : ETV Bharat Archive)

Tollywood Celebrities Favourite Movie : పలు ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీలు తమ ఫేవరట్ సినిమాలు గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకన్నారు. ఈ నేపథ్యంలో మన సినీ తారలు మెచ్చిన చిత్రాలు ఏవో ఓ లుక్కేద్దామా.

Tollywood Celebrities Favourite Movie : తమ ఫేవరట్ సినిమాల గురించి మూవీ లవర్స్ చెప్తుంటే ఎన్నో సార్లు వినుంటాం. కానీ నటీనటులు తమకు ఇష్టమైన సినిమాల గురించి చెప్ప్తే వినింది మాత్రం అరుదు. మరీ మన స్టార్స్​ మెచ్చిన సినిమాలు ఏవో ఓ లుక్కేద్దామా.

నాకు అలా చేయడం ఇష్టం లేదు - మహేశ్‌ బాబు
'అల్లూరి సీతారామరాజు' నా ఆల్‌టైమ్​ ఫేవరెట్‌ మూవీ. నాన్న నటించిన సినిమా కావడం, అలాగే దాన్ని ఆ రోజుల్లోనే ఎంతో అద్భుతంగా చిత్రీకరించడమే అందుకు కారణం. ఆ మూవీని ఎన్నిసార్లు చూసినా నాకు బోర్‌ కొట్టదు నాకు. చాలామంది నన్ను ఆ పాత్రను చేయమని సూచిస్తుంటారు. కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే నాన్నలా నేను ఆ పాత్రకు సరైన న్యాయం చేయలేనని నా నమ్మకం. ఎక్స్​పెరిమెంట్స్ వల్ల ఓ ఓ మంచి సినిమాను చెడగొట్టడం కన్నా తీరిక దొరికినప్పుడల్లా దాన్ని చూడటం మంచిదని నా అభిప్రాయం. .

ఆ సీన్​ నేను కూడా చెయ్యాలనిపిస్తోంది - విజయ్‌ దేవరకొండ
నేను హాస్టల్‌ నుంచి వచ్చిన 'గ్లాడియేటర్‌', 'పోకిరి' సినిమాలు చూశాను. ముఖ్యంగా 'గ్లాడియేటర్‌' సీడీని తెప్పించుకుని మరీ చూశాను. అయితే ఆ సినిమా, అందులోని పాత్రలు కూడా నాకు పెద్దగా అర్థం కాలేదు కానీ దాన్ని తెరకెక్కించిన తీరు మాత్రం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ తర్వాత థియేటర్​లో 'పోకిరి' సినిమా చూడటం నాకు ఇప్పటికీ గుర్తుంది. అందులో హీరో మహేశ్‌ బాబు పరుగెత్తుతూ ఎండుమిర్చి, కూరగాయల మధ్య ఎగురుతున్న సీన్​ ఎంత అద్భుతంగా ఉంటుందో. దాన్ని చూశాక హీరో అంటే ఇలాగే ఉండాలని నాకు అనిపించింది. అంతేనా, నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అటువంటి సీన్​కు ఒక్క సారైనా రీక్రియేట్ చేయాలనేదే నా కోరిక. అందుకే నా డైరెక్టర్లను అప్పుడప్పుడూ ఆ సీన్‌ను పెట్టే ఛాన్స్‌ ఉంటే చూడండి అంటూ ఇప్పటికీ అడుగుతుంటాను.

ఆ సినిమాను వందసార్లు చూసి ఉంటాను - త్రిష
నేను ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఏదైనా ఉంది అంటే అది 'వర్షం'. దాదాపు వంద రోజుల పాటు నేను వర్షంలో తడుస్తూనే ఉండి ఆ సినిమాను చేయాల్సి వచ్చింది. దీంతో నాకు వర్షమన్నా, నీళ్లు అన్నా ఓ ఫోబియా ఏర్పడింది. కానీ నా కష్టం వృథా పోలేదు. ఆ సినిమా నాకు మంచి పేరును తెచ్చిపెట్టడంతో పాటు తెలుగులోనూ మంచి ఆఫర్లను వచ్చేలా చేసింది. నన్ను ఓ స్టార్‌ హీరోయిన్‌ను కూడా చేసింది. అందుకే నాకు 'వర్షం' ఇప్పటికీ నచ్చుతుంది. ఫ్రీ టైమ్​లో ఆ సినిమాను చూడాలనీ అనిపిస్తుంది. ఇక ఆ 'వర్షం' తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో 'ది ఇంగ్లిష్‌ పేషెంట్‌'. ఆ మూవీని వంద సార్లకు పైగా చూసుంటాన.

అటువంటి జానర్ సినిమాలో నటించాలి - కీర్తి సురేశ్​
నేను ఎక్కువసార్లు చూసిన సినిమాల్లో 'టైటానిక్‌' ఒకటి. అది ఓ అద్భుతమైన ప్రేమకావ్యం. అందులోని హీరో హీరోయిన్లు షిప్‌ అంచున నిల్చునే సీన్​ నాకు ఎన్ని సార్లు చూసినా నాకు కొత్తగానే అనిపిస్తుంది. ఇక నేను ఆ సినిమాను చూసి కాస్త ఎమోషనల్‌ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అప్పట్లో ఓ సారి స్పెయిన్‌కు వెళ్లినప్పుడు, ఓ కార్​ ముందు నేను అదే సీన్​ను రీక్రియేట్ చేశాను. ఎప్పటికైనా అటువంటి సినిమాలో నటించాలనదే నా కోరిక.

లవ్ స్టోరీస్​ బాగుంటాయి - ప్రభాస్‌
ఆన్​స్క్రీన్​పై నేను ఎక్కువ యాక్షన్‌ సినిమాలు చేసినప్పటికీ, నాకు మాత్రం లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. అందుకే షూటింగ్‌లు లేని సమయంలో లవ్‌ స్టోరీస్‌ను ఎక్కువగా చూస్తుంటాను. కానీ అన్నింట్లో కల్లా నాకు మణిరత్నం తెరకెక్కించిన 'గీతాంజలి' సినిమా అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. అందులోని ప్రకాశ్‌ - గీతాంజలి పాత్రలు, వాటిని రూపొందించిన తీరు వావ్‌ అనిపిస్తుంటుంది. ఇక నేను ఎక్కువసార్లు చూసిన సినిమా 'షోలే'.

రైతుల క్రౌడ్ ఫండింగ్​తో రూ.12 లక్షల బడ్జెట్ సినిమా - కట్ చేస్తే రూ. 52వేల కోట్లు! - Farmers Croud Funding Movie

ఈ సినిమాల రిజల్ట్ ప్లాప్​- కానీ థియేటర్లో మాత్రం 100 డేస్! - Flops Movies 100 Days In Theatre

Last Updated :May 5, 2024, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.