ETV Bharat / entertainment

మిల్క్​ బ్యూటీకి కోపం వస్తే ఏం చేస్తుందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 2:10 PM IST

Tamannaah Bhatia Angry : సాధారణంగా కోపం వస్తే చాలా మంది ఇంకొకరిపై చికాకు, కోపం చూపిస్తుంటారు. కానీ హీరోయిన్​ తమన్నా అలా చేయదట. మరి తనేం చేస్తుందో సమాచారం తెలిసింది. దాని గురించే ఈ కథనం.

Tamannaah Bhatia Angry
Tamannaah Bhatia Angry

Tamannaah Bhatia Angry : తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది నటి తమన్నా. అభిమానులు ఈమెను ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తారు. రీసెంట్​గానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలా దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది.

తొలిసారి ఈమె 2005లో హిందీ సినిమా 'చాంద్‌ సా రోషన్‌ చెహ్రా'తో తెరంగేట్రం చేసింది. అదే ఏడాది 'శ్రీ' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తోంది. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్స్ కూడా చేస్తోంది. ప్రస్తుతం తమన్నా నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. 'అరణ్మనై 4', 'స్త్రీ 2', 'వేద', 'ఓదెల 2' వంటి సినిమాలు ఉన్నాయి.

అలా త‌న‌దైన యాక్టింగ్, గ్లామ‌ర్​తో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న ఈ మిల్కీ భామ పర్సనల్ లైఫ్​ను బాగానే బ్యాలెన్స్ చేస్తోంది. బాలీవుడ్​లో సెటిల్ అయిన తెలుగోడు విజ‌య్ వ‌ర్మతో రిలేషన్​షిప్ మెయిన్​టెయిన్​ చేస్తోంది. కానీ పెళ్లి గురించి చెప్పట్లేదు. బహిరంగంగానే తిరుగుతున్నారు. షూటింగ్స్​లో కాస్త గ్యాప్ దొరికినా వెకేష‌న్స్‌, పార్టీలంటూ ఫుల్‌గా చిల్ కొడుతున్నారు.అయితే తాజాగా త‌మ‌న్నాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట కథనాల్లో కనిపించింది.

అందులో ఏముందంటే :
త‌మ‌న్నా జనరల్​గా చాలా కూల్​గా కనిపిస్తుంది. ఇత‌రుల‌పై కోప్ప‌డిన సంద‌ర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. పబ్లిక్​లో పక్కాగా న‌వ్వుతూనే క‌నిపిస్తుంది. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే త‌మ‌న్నాకు కోపం బానే ఎక్కువట. అందుకే కోపం రాగానే వెంటనే ఓ గదిలోకి వెళ్లి ఒంట‌రిగా కూర్చుంటుంద‌ట‌. కాసేపు ఎవ్వ‌రితోనూ అస్సలు మాట్లాడ‌ద‌ట‌. అనంతరం కూల్ వాట‌ర్​తో ష‌వ‌ర్ చేసి ప్ర‌శాంతంగా త‌న కోపానికి చల్లార్చుకుంటుందని సమాచారం. ఇక కోపానికి గల కార‌ణాన్ని ఆలోచిస్తుంద‌ట‌. ఎవ‌రి వ‌ల్ల కోపం వచ్చిందో వారితోనే డిస్క‌స్ చేసి సమస్యను క్లియర్ చేస్తుందట. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఈ విషయం బయట కథనాల్లో రాసి ఉంది.

తమన్నాతో పెళ్లి - వైరల్​గా మారిన విజయ్​ వర్మ ఆన్సర్​!

2024లో పెళ్లిపీటలెక్కబోయే టాలీవుడ్​ హీరోయిన్లు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.