ETV Bharat / entertainment

తమన్నాతో పెళ్లి - వైరల్​గా మారిన విజయ్​ వర్మ ఆన్సర్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 12:13 PM IST

Vijay Varma Tamannaah Bhatia Marriage : తమన్నాతో పెళ్లిపై మరోసారి స్పందించారు నటుడు విజయ్ వర్మ. ప్రస్తుతం ఆయన చెప్పిన సమాధానం నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది.

తమన్నాతో పెళ్లి - వైరల్​గా మారిన విజయ్​ వర్మ ఆన్సర్​!
తమన్నాతో పెళ్లి - వైరల్​గా మారిన విజయ్​ వర్మ ఆన్సర్​!

Vijay Varma Tamannaah Bhatia Marriage : సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా, స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది తమన్నా భాటియా. అయితే ఈ ముద్దుగుమ్మ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట అఫీషియల్​గా కూడా చెప్పారు. కానీ ఎప్పుడు చేసుకుంటారనేది చెప్పలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి విజయ్ వర్మ పెళ్లిపై స్పందించారు. చమత్కారంగా సమాధానమిచ్చి తప్పించుకున్నారు.

విజయ్ వర్మ సోషల్ మీడియా ఇన్​స్టా గ్రామ్‌లో ఆస్క్​ మి సెషన్​లో పాల్గొన్నారు. ఇందులో ఓ వ్యక్తి కబ్ షాదీ కర్రే (పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు) అని అడిగారు. అందుకు విజయ్ వర్మ తెలివిగా సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఆ యూజర్​ ఆయన మేనకోడలే. "నా కోడలు ఇప్పుడు అమ్మలా ప్రశ్నలు అడుగుతోంది. పైగా నాకు ఈ ప్రశ్న హైదరాబాదీ యాసలో వినిపిస్తోంది" అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు విజయ్ వర్మ. ప్రస్తుతం ఈ ఆన్సర్​ సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏదేమైనా తన పెళ్లిపై ఎన్నిసార్లు ప్రశ్నలు ఎదురవుతున్నా సరైన సమాధానం చెప్పకుండా మరో సారి తప్పించుకున్నారు విజయ్ వర్మ. దీంతో ఫ్యాన్స్​కు మరోసారి ఆశ్చర్యార్థకమైన సమాధానమే లభించింది. ఇక మరో యూజర్​ 'భాయ్ మీరు జిమ్‌కు వెళ్తారా?' అని అడగగా - 'ఏదైన సినిమా కోసం అవసరమైతే జిమ్‌కు వెళ్తాను. లేదంటే యోగా చేయడానికి ఇష్టపడతాను' అని రిప్లై ఇచ్చారు విజయ్ వర్మ.

కాగా, విజయ్ వర్మ మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రంతో విలన్‌గా పరిచయం అయ్యారు. హిందీలో చాలా వరకు హిట్ సిరీసుల్లో నటించారు. రీసెంట్​గా 'లస్ట్ స్టోరీస్ 2'లో ఘాటు రొమాన్స్ కూడా చేశారు. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 43వ చిత్రంలో కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉల్ జలూల్ ఇష్క్‌ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు తమన్నా అరుణమని 2, వేద, స్త్రీ 2, భోలే చూడియన్, పోన్ ఒండ్రు కందెన చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఓ కామెడీ వెబ్ సిరీస్ చేస్తోంది.

ఓటీటీలోకి వచ్చేసిన అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ - స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

'బిగ్​బాస్​లో సపోర్ట్ చేశారుగా- ఇప్పడేమైంది?' సోహైల్ కంటతడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.