ETV Bharat / entertainment

SSMB29 : మహేశ్‌, రాజమౌళి సినిమా - ఆ ఐదు పనులు పూర్తైతేనే మూవీ షురూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 6:38 AM IST

SSMB29 : మహేశ్‌, రాజమౌళి సినిమా -  ఆ ఐదు పనులు పూర్తైతేనే సినిమా షురూ!
SSMB29 : మహేశ్‌, రాజమౌళి సినిమా - ఆ ఐదు పనులు పూర్తైతేనే సినిమా షురూ!

SSMB29 Mahesh babu SS Rajamouli : మహేశ్ - రాజమౌళి సినిమాకు సంబంధించి మరికొన్ని కొత్త ఇంట్రెస్టింగ్​ వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ వర్క్ షాప్ ఎప్పుడు మొదలవుతుంది? రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? మూవీ ఓపెనింగ్​కు చీఫ్ గెస్ట్ ఎవరు? సినిమాలో సితార నటిస్తుందా? లేదా? మహేశ్​కు రాజమౌళి ఏమని కండిషన్ పెట్టారు? ఇంకా పలు విషయాల గురించి వార్తలు వస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

SSMB29 Mahesh babu SS Rajamouli : సూపర్ స్టార్ మహేశ్‌బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్​ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ కంప్లీట్ చేసుకుని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే తాజాగా మరికొన్ని విషయాలు నెట్టింట్లో ట్రెండ్‌ అవుతున్నాయి.

బిగ్‌ ప్రెస్‌మీట్‌ : మహేశ్‌ బాబుతో సినిమా ఉంటుందని జక్కన్న ప్రకటించారు కానీ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల గురించి అఫీషియల్​గా ఒక్క అప్డేట్​ కూడా ఇవ్వలేదు. ఆయన తన గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి డీటెయిల్స్​ను చెబుతారా? లేదా? అన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈ సారి రాజమౌళి కాస్త పెద్దగానే ప్లాన్‌ చేస్తున్నారట. లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాకు ఒకేసారి చెప్పాలని అనుకుంటున్నారట.

మొదలయ్యేది ఎప్పుడంటే? : సినిమా యాక్షన్‌ అడ్వెంచర్‌ అవ్వడం వల్ల ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్స్​ కోసం ఎక్కువ సమయం పడుతోందట. ప్రస్తుతం సినిమా కథకు తగ్గట్టుగా పాత్రలు, వాటి స్కెచ్‌లను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అలానే సెట్స్‌ డిజైన్​ కూడా చేస్తున్నారట. సినిమాకు కొత్త టెక్నాలజీని ఎలా అడాప్ట్‌ చేయాలి? అన్నదానిపై కూడా చర్చ నడుస్తోందట.

ప్రమోషన్స్‌ కోసం : సోషల్‌మీడియా టీమ్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన థీమ్స్‌, లోగోలను రెడీ చేస్తున్నారట. ఈ పనులన్నీ ఓ కొలిక్కి వస్తే కానీ సినిమాను అనౌన్స్​ చేస్తారట. తెలుగు సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌ 9న సినిమాను అఫీషియల్​గా అనౌన్స్​ చేయాలని మొదట అనుకున్నారట. కానీ ప్రీ ప్రొడక్షన్​ కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున మహేశ్‌ పుట్టినరోజు ఆగస్టు 9న మొదలుపెడతరాని తెలుస్తోంది.

లుక్‌ బయటకు రాకుండా కండిషన్ : రాజమౌళి సినిమా కోసం మహేశ్ సరికొత్తగా సిద్ధమవుతున్నారు. గడ్డం పెంచి, పొడవాటి జుట్టుతో మూవీలో కనిపించనున్నారని టాక్‌. అదే సమయంలో శారీరకంగా దృఢంగా కనిపించేందుకు కసరత్తులు కూడా చేస్తున్నారు. అయితే మహేశ్‌ పలు సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు వాటికి సంబంధించిన షూట్స్ ఏమైనా ఉంటే మూవీ ప్రారంభం అయ్యేలోపు పూర్తి చేసుకోవాలని జక్కన్న సూచించారట. కొత్త లుక్ ఎవరికీ తెలీకుండా ఉండేందుకు బయటకు రావొద్దని అన్నారట.

త్వరలోనే సినిమాకు సంబంధించి నటీనటులు, టెక్నికల్‌ టీమ్‌తో వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వర్క్ షాప్స్​లో మహేశ్​తో పాటు సితార కూడా పాల్గొంటుందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీంతో ఈ సినిమాలో సితార కూడా నటిస్తుందా? అనే హింట్ లీకై వైరల్‌ అవుతోంది.

అతిథిగా జేమ్స్ కామెరూన్ : ఈ మూవీ ఓపెనింగ్​కు ముఖ్య అతిథిగా ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ రాబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన జేమ్స్ కామెరాన్ - రాజమౌళి వర్క్​కు ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండూ మూడు సార్లు ఆయన జక్కన్నను ప్రశంసించారు.

సాయి పల్లవితో మళ్లీ నటించకపోవడానికి కారణం అదే: వరుణ్ తేజ్

ఆ సినిమాపై 34 కేసులు, నటికి వేధింపులు - దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ మూవీ ఏదంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.