ETV Bharat / entertainment

మ్యూజిక్​ నేర్చుకోకుండా రూ.200కోట్ల సంపాదన!- ఎవరబ్బా ఆ సింగర్​? - SINGER who has 200cr networth

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 4:26 PM IST

Updated : Mar 21, 2024, 5:16 PM IST

Singer Who Has Rs.200 Cr Networth : ఆయన సంగీతంలో ఓనమాలు నేర్చుకోలేదు. కానీ దిగ్గర సింగర్లకు సమానంగా పాడుతూ ఎంతో మంది మ్యూజిక్ లవర్స్​ ఫేవరట్ అయ్యారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇప్పుడు రూ. 200 కోట్ల నెట్​వర్త్​ ఉన్న ప్రముఖుల్లో ఒకరయ్యారు. ఇంతకీ ఆయన ఎవరంటే ?

Singer With No Music Background
Singer With No Music Background

Singer Who Has Rs.200 Cr Networth : సినిమాల్లో హీరో, హీరోయిన్లు ఎంత ముఖ్యమో అందులోని సాంగ్స్​ కూడా అంతే ముఖ్యం. ఇక పాటకు అనుగుణంగా వాయిస్​లకు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటుంటారు మేకర్స్​. ఆ సాంగ్​ను ఎవరి చేత పాడిస్తే బెటర్ అవుట్​పుట్ వస్తుందన్న ఆలోచనతో ఉంటారు. అందుకోసమని నిష్ణాతులను ఎంచుకుంటుంటారు. ఇప్పటికే మనం ఎంతో మంది స్టార్ సింగర్స్​ను చూసుంటాం. అందులో కొంత మంది సంప్రదాయ సంగీతం నేర్చుకుని ఈ ఫీల్డ్​లోకి వచ్చుంటారు. లేకుంటే ఎవరైనా ప్రొఫెషనల్ దగ్గర కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుంటారు. అయితే ఎటువంటి సంగీతం నేర్చుకోకుండా.. ఏ మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కూడా ఓ సింగర్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఆయనెవరంటే ?

అయితే పైన మనం మాట్లాడుకున్న వ్యక్తి ఇండియన్ సింగర్ కాదు. ఆయన పాకిస్థాన్ లోని వజీరాబాద్‌లో ఉండే పంజాబీ ఫ్యామిలీలో 1983లో పుట్టిన అతీఫ్ అస్లామ్. రావల్పిండి ప్రాడెక్ట్ అయిన ఈ స్టార్ ఇప్పుడు బీటౌన్​తో పాటు సౌత్​ను తన సంగీత సాగరంలో ముంచి తేల్చుతున్నారు. అయతే ఆయన ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. తన టీనేజ్ డేస్​ను ఆయన రెస్టారెంట్లలో గడిపారు. అక్కడ పాటలు పాడి అందరిని అలరించారు.

అలా చిన్న చిన్న పెర్ఫామెన్స్​లు ఇస్తున్నప్పుడు అక్కడ ఆయనకు గోహర్ ముంతాజ్ అనే మరో మ్యూజిషియన్ పరిచమయ్యారు. ఇక ఈ ఇద్దరూ కలిసి 'జల్' అనే బ్యాండ్​ను ప్రారంభించారు. ఈ పేరుతో మ్యూజికల్ షో స్​ను చేసేవారు. 2003లో 'ఆదత్' అంటూ వచ్చిన వైరల్ సాంగ్ కూడా వీరిద్దరూ కలిసి ఆలపించిందే. ఆ తర్వాతి 2004లో అతీఫ్ సోలోగా రూపొందించిన ఆల్బమ్ 'జల్ పరీ' విడుదలైంది. దాని తర్వాత అతీఫ్ అస్లామ్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

2005 - అతీఫ్​ కెరీర్​ను మలుపు తిప్పిన ఏడాది. 'జెహర్' అనే సినిమాలోని 'వో లమ్హే' అంటూ అతీఫ్​ ఆలపించిన సాంగ్​ సూపర్ హిట్​ అయ్యింది. ఆ హిట్​ అతీఫ్​ పేరు బాలీవుడ్​లో మారుమోగిపోయింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఆయన హిందీలో హిట్ ఆల్బమ్స్​ను అందించారు. తన గాత్రంతో ఎన్నో మరపురాని సాంగ్స్​ను మ్యూజిక్​ లవర్స్ ప్లే లిస్ట్​లో చేర్చారు. ప్రస్తుతం ఆసియాలోని ఫేమస్ సింగర్లలో అతీఫ్ కూడా ఒకరు. కొన్ని మీడియా కథనాలను ప్రకారం ఆయన ఆర్థికంగానూ బాగా పుంజుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.180 నుంచి 200 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాక్సాఫీస్​కు రూ.500 కోట్లు తెచ్చిపెట్టిన తొలి సినిమా ఏదంటే ? - First Indian Movie With 500 Cr Mark

50 సెకెన్లకు రూ. ఐదు కోట్లు - ఈ హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా

Last Updated : Mar 21, 2024, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.