ETV Bharat / entertainment

RC 16కి ముహూర్తం ఫిక్స్​ - ఆ స్టార్ హీరో టైటిల్​తో సినిమా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 1:47 PM IST

Updated : Mar 15, 2024, 2:40 PM IST

RC 16 Movie
RC 16 Movie

RC 16 Movie : గ్లోబల్​ స్టార్ రామ్ చరణ్​, 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్​లో రానున్న మూవీ త్వరలో సెట్స్​పైకి వెళ్లనుందట. ఆ విశేషాలు మీ కోసం.

RC 16 Movie : గ్లోబల్​ స్టార్ రామ్ చరణ్​ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో ఓ సినిమా చేయనున్నారు. ఆర్​సీ 16 అనే వర్కింగ్ టైటిల్​తో ప్రస్తుతం ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాలో 'దేవర' హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ సాలిడ్ అప్​డేట్​ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుందట. దీనికి సంబంధించిన సన్నాహాల్లో మేకర్స్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 20న పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సిినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో త్వరలోనే సినిమా షూట్ ప్రారంభమవ్వనుంది.

ఆ టైటిల్​తో మూవీ షురూ!
RC 16 Title : మరోవైపు ఈ మూవీకి 'పెద్ది' అనే టైటిల్​ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే టైటిల్‌ను జూనియర్ ఎన్​టీఆర్ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్‌ చేశారని, దాన్నే ఇప్పుడు రామ్ చరణ్‌ సినిమాకు పెడుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

RC 16 Cast : ఇక ఆర్​సీ 16 సినిమా విషయానికి వస్తే, ఇందులో రామ్​ చరణ్​, జాన్వీ కపూర్​తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాయి. అయితే స్పోర్ట్స్‌ డ్రామా బ్యాక్​డ్రాప్​తో పాటు గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగనుందని టాక్ నడుస్తోంది. ఇందులో రామ్‌ చరణ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అలానే ఆయన ఓ వికలాంగుడి పాత్రలోనూ కనిపిస్తారని సమాచారం.

RC16 హీరోయిన్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసింది - చరణ్ సరసన ఎవరంటే?

'గేమ్ ఛేంజర్' అప్​డేట్​ - 'జరగండి' అంటూ వస్తున్న రామ్​చరణ్! ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే?

Last Updated :Mar 15, 2024, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.