ETV Bharat / entertainment

టాప్​ ట్రెండింగ్​లో మమితా బైజు - కుర్రాళ్ల మనసు దోచేస్తూ! - Premalu OTT

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 10:13 AM IST

Updated : Apr 13, 2024, 10:21 AM IST

Premalu OTT Mamitha Baiju
Premalu OTT Mamitha Baiju

Premalu OTT Mamitha Baiju : మలయాళీ బ్లాక్ బస్టర్​ ప్రేమలు సినిమా ఓటీటీలోనూ ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. రిలీజైన తొలి రోజు నుంచే విశేష ఆదరణ దక్కించకుంటూ దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్​ నటించిన మమితా బైజు పేరే వినిపిస్తుంది. పూర్తి వివరాలు స్టోరీలో.

Premalu OTT Mamitha Baiju : మలయాళంలో ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు ఇలా వరుసగా వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. తాజాగా వచ్చిన మలయాళీ చిత్రం ఆవేశం కూడా మంచి వసూళ్లను అందుకుంటూ పోతోంది. అయితే వీటిన్నింటిలో తెలుగువారిని ఎక్కువగా ఆకట్టుకుంది ప్రేమలు. రీసెంట్​గా తెలుగు వెర్షన్​లోనూ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా వీకెండ్​ స్పెషల్​గా ఓటీటీలోకి వచ్చేసిందీ చిత్రం. వచ్చీ రాగానే డిజిటల్ ప్లాట్​ఫామ్​లోనూ టాప్ ట్రెండింగ్​లో దూసుకుపోతోంది. సోషల్ మీడియా అంతా ప్రేమలు హ్యాష్​ట్యాగే నడుస్తోంది.

మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్​ నటించిన మమితా బైజు పేరే వినిపిస్తుంది. అంతటా ఈమె ఫొటోలు, వీడియోలే చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఇప్పటికే సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్​తో కలిసి ఆమె ​ నటించిన రెబల్ కూడా మంచి ట్రెండింగ్ అవుతోంది.

దీంతో ఇప్పటికే మిమితాకు వచ్చిన క్రేజ్​తో సౌత్ నిర్మాతలు కూడా ఆమెపై కర్చీఫ్ వేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అయితే ఈమెకు ఇది తొలి సినిమాయేం కాదు. 2017 నుంచి సినిమాల్లో నటిస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు 18 సినిమాలకు పైగా నటించేసింది.2023లో ప్రణయ విలాసం, 2022లో సూపర్ శరణ్య, అంతకంటే ముందు 2021లో ఆపరేషన్ జావా, ఖోఖో సినిమాల్లోనూ కనిపించింది. వీటన్నిటి కన్నా ప్రేమలు సినిమానే ఆమెకు ఇక్కడ మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా స్టార్ హోదాలో కూర్చోబెట్టింది.

అయితే మన తెలుగు నిర్మాతలు ఒక అడుగు ముందే ఉంటారు కాబట్టి విజయ్ దేవరకొండ్ నటించబోయే తర్వాతి సినిమాకు మమితాను ఒప్పించేశారంటూ కొద్ది రోజుల నుంచి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి గ్లామర్ పాత్రలకు, స్కిన్ షోకు దూరంగా ఉండే మమితా బైజు ఈ ఫేంను ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.


కాగా, రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ప్రేమలు సినిమా దాదాపు రూ.10 కోట్లతో తెరకెక్కింది. ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రాన్ టైమ్​లో దాదాపు రూ.130 కోట్లకు పైగా వసూలు చేసింది. మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావడంతో రాజమౌళి తనయుడు కార్తీకేయ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTTలో దూసుకుపోతున్న తెలుగు హారర్ కామెడీ - రిలీజైన తొలిరోజే ట్రెండింగ్‌లోకి! - Amazon Prime OTT Telugu Movies

మలయాళంలో మరో సూపర్ హిట్ - పుష్ప విలన్ 'ఆవేశం'కు అదిరిపోయే కలెక్షన్స్! - Fahad fazil Aavesham

Last Updated :Apr 13, 2024, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.