ETV Bharat / entertainment

మలయాళంలో మరో సూపర్ హిట్ - పుష్ప విలన్ 'ఆవేశం'కు అదిరిపోయే కలెక్షన్స్! - Fahad fazil Aavesham

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 2:40 PM IST

Updated : Apr 12, 2024, 3:12 PM IST

Fahad fazil Aavesham Collections : పుష్పతో తెలుగులో మార్కెట్ పెంచుకున్న ఫహాద్ ఫాజిల్ తాజాగా ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు తొలిరోజే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వసూళ్లు ఎంత వచ్చాయంటే?

మలయాళంలో మరో సూపర్ హిట్ - పుష్ప విలన్ 'ఆవేశం'కు అదిరిపోయే కలెక్షన్స్!

Fahad fazil Aavesham Collections : పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. పుష్ప తర్వాత కూడా ఆయన ఎన్నో హిట్ చిత్రాలలో నటించారు. అలా తాజాగా మలయాళంలో మరో సూపర్ హిట్ అందుకున్నారాయన. అదే ఆవేశం.

ఈ మధ్య మాలీవుడ్​ బాక్సాఫీస్​ ముందు వరుసగా బ్లాక్ బస్టర్లు పడుతున్నాయి. మాములుగానే మలయాళ సినిమాల బడ్జెట్ తక్కువే ఉంటుంది. అయితే అందులో కథాబలం ఉన్న సినిమాలు పెట్టిన బడ్జెట్​కు రెట్టింపు వసూళ్లను అందుకుంటూ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. రీసెంట్​గా వచ్చిన మంజూమ్మల్​ బాయ్స్, ప్రేమలు, భ్రమయుగం వంటి సినిమాలు ఈ కోవకే చెందినవి. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోవడానికి సిద్ధమైంది ఫహాద్ ఫాజిల్ ఆవేశం.

రిలీజైన తొలిరోజే ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రూ. 3.26 కోట్లు వసూళ్లు వచ్చాయట. గురువారం విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఉదయం 62.97 శాతం, మధ్యాహ్నం 73.67 శాతం, సాయంత్రం 78.85 శాతం, రాత్రి 78.78 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. హైదరాబాద్​లోనూ ఈ సినిమాకు అత్యధికంగా 94 శాతం ఆక్యుపెన్సీ వచ్చిందని తెలసింది.

Malayalam Movies Recent release : ఇక ఈ సినిమా మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు ప్రేక్షకుల ఆసక్తి మొదలైపోయింది. ఇప్పటికే భ్రమయుగం, ప్రేమలు, మంజూమ్మల్​ బాయ్స్ చిత్రాలు తెలుగు వెర్షన్​లో రిలీజయ్యాయి. ఇక ఆవేశం కోసం ఎదురుచూడం మొదలుపెట్టారు. అందులోనూ పుష్ప ఫేమ్ విలన్ కాబట్టి తెలుగు రైట్స్ కూడా మంచి రేటుకే అమ్ముడు పోయే అవకాశం ఉంది.

ఇకపోతే జితు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఆవేశం సినిమాకు సుషీన్ శ్యామ్ సంగీతం అందించారు. చిత్రంలో ఫహాద్ తో పాటు మన్సూర్ అలీ ఖాన్, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించారు. కాగా, ఈ సినిమాలో నటించడమే కాదు ఈ సినిమాలో నిర్మాతలలో ఒకరిగా వ్యవహరించారు ఫహాద్ ఫాజిల్.

ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన 'పోకిరి' ​సాయాజీ షిండే - పరిస్థితి ఎలా ఉందంటే? - Sayaji Shinde Hospitalized

'హీరోలకు అంత సీన్ లేదు' : హీరోయిన్ కృతిసనన్ షాకింగ్ కామెంట్స్! - Kritisanon Crew Movie

Last Updated : Apr 12, 2024, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.