ETV Bharat / entertainment

సాయి పల్లవికి చైతూ లవ్​ ప్రపోజ్- వీడియో పోస్ట్ చేసి సర్ప్రైజ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 11:00 AM IST

Updated : Feb 14, 2024, 11:56 AM IST

Naga Chaitanya Love Proposal Sai Pallavi: వాలెంటైన్ రోజు స్టార్ హీరో నాగచైతన్య సర్​ప్రైజ్ ఇచ్చారు. హీరోయిన్ సాయి పల్లవికి ప్రపోజ్ చేస్తున్నట్లుగా ఉన్న పోస్ట్​ షేర్ చేశారు.

Naga Chaitanya Love Proposal Sai Pallavi
Naga Chaitanya Love Proposal Sai Pallavi

Naga Chaitanya Love Proposal Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య వాలెంటైన్ రోజు సర్​ప్రైజ్ ఇచ్చారు. హీరోయిన్ సాయి పల్లవికి లవ్ ప్రపోజల్ చేసినట్లున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశారు. చైతు- సాయిపల్లవి లీడ్ రోల్స్​లో తెరకెక్కుతున్న 'తండేల్' సినిమా గ్లింప్స్​లోని ఓ డైలాగ్​ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్​లో ఉంది. ఈ డైలాగ్​తో నెటిజన్లు రీల్స్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య కూడా రీల్ చేసి ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు.

'తండేల్ గ్లింప్స్​కు వస్తున్న రెస్పాన్స్​ పట్ల థ్రిల్లింగ్​గా ఉంది. దానిపై మీరందరూ (నెటిజన్లు) రీల్స్​ చేయడం సంతోషాన్నిస్తుంది. మీలాగే మేము (నేను & సాయి పల్లవి) కూడా రీల్ చేయాలనుకున్నాం. మీ అందరికీ తండేల్ మూవీ టీమ్ నుంచి హ్యాపీ వాలెంటైన్ డే' అని చైతు పోస్ట్ చేశారు. రీల్ చూసిన ఫ్యాన్స్ చైతూ- సాయి పల్లవి జోడీ బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఇదివరకే వీరి కాంబోలో తెరకెక్కిన 'లవ్​స్టోరి' సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.

ఇక సినిమా విషయానికొస్తే, దర్శకుడు చందూ మోండేటి కోస్టల్ బ్యాక్​డ్రాప్​లో తండేల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా గ్లింప్స్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ 'దద్దా గుర్తెట్టుకో ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్ ఇక రాజులమ్మ జాతరే' అంటూ చెప్పే ఓ డైలాగ్‌ గ్లింప్స్​లో హైలైట్​గా నిలిచింది. ఇక చైతూ పాక్ ప్రభుత్వానికి చిక్కడం, అక్కడ జైల్లో ఇబ్బంది పెడుతున్న అధికారికి కౌంటర్ ఇవ్వడం లాంటి సన్నివేశాలను గ్లింప్స్​లో చూపించారు. చివర్లో సాయిపల్లవిని కూడా చూపించారు. ఇది ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంది.

Thandel Cast: ఈ సినిమాలో హీరో, హీరోయిన్ మినహా ఇతర నటీనటుల వివరాలు బయటకు రాలేదు. గీతా ఆర్ట్స్​ బ్యానర్​పై బన్ని వ్యాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నాగ చైతన్య 'తండేల్​' గ్రాండ్ లాంఛ్​ - స్పెషల్ అట్రాక్షన్​గా సాయి పల్లవి!

నాగ చైతన్య కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ - ఆ క్రేజీ లుక్​లో పోస్టర్ రివీల్​!​

Last Updated : Feb 14, 2024, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.