ETV Bharat / entertainment

నభా నటేశ్ పర్సనల్ లైఫ్​పై ప్రియదర్శి కామెంట్స్ - స్టేజ్ పైనుంచి కోపంతో వెళ్లిపోయిన హీరోయిన్! - Darling Movie Promo Release Event

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 5:09 PM IST

Nabha Natesh Priya darshi : నటుడు ప్రియదర్శి చేసిన పనికి హీరోయిన్ నభా నటేశ్​ స్టేజ్​పై నుంచి కోపంతో దిగి వెళ్లిపోయింది. అసలేం జరిగిందంటే?

నభా నటేశ్ పర్సనల్ లైఫ్​పై ప్రియదర్శి కామెంట్స్ - స్టేజ్ పైనుంచి కోపంతో వెళ్లిపోయిన హీరోయిన్!
నభా నటేశ్ పర్సనల్ లైఫ్​పై ప్రియదర్శి కామెంట్స్ - స్టేజ్ పైనుంచి కోపంతో వెళ్లిపోయిన హీరోయిన్!

Nabha Natesh Priya darshi : నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్​కు పరిచయమైన నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ మూవీ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత రెండేళ్లు ఎవరికి కనిపించలేదు. అందుకు కారణం ఆమెకు యాక్సిడెంట్ అవ్వడం, శస్త్ర చికిత్సలు జరగడం. ప్రస్తుతం వీటి నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు.

అయితే ఇప్పుడామె ప్రియదర్శి హీరోగా చేస్తున్న డార్లింగ్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో వీరు నిత్యం గొడవపడే భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ప్రమోషన్స్​ను కూడా ఈ మూవీ థీమ్​కు తగ్గట్టుగానే రెెండు మూడు రోజుల నుంచి చేస్తున్నారు. అలా తాజాగా టైటిల్ ప్రోమో రిలీజ్ ఈవెంట్​లోనూ వీరు స్టేజిపై గొడవ పడుతూ ప్రమోషన్స్ చేశారు.

ఈ క్రమంలోనే ప్రియదర్శి మాట్లాడుతూ "ఈ రెండేళ్లలో నేను ఐదు సినిమాలు చేశాను. నువ్వు ఒక సినిమా కాదు కదా, సినిమా ఈవెంట్​లోనూ కూడా కనిపించలేదు” అంటూ మాట్లాడారు. దీనికి నభా ఎమోషనల్​గా రియాక్ట్ అయింది. సినిమా ప్రమోషన్స్ అని చెప్పి పర్సనల్ లైఫ్​ ఎందుకు మాట్లాడుతున్నారు. ఈ రెండేళ్లలో నాకు ఏం జరిగింది, దాని నుంచి కోలుకోవడం కోసం నేను ఎంత కష్టపడ్డాను అనేది మీకు కూడా తెలుసు. అయినా మీరు ఇలా మాట్లాడటం సరికాదుఅంటూ స్టేజ్​ మీద నుంచి వెళ్లిపోయింది. ప్రియదర్శి ఆమెను ఆపడానికి ట్రై చేసినా కూడా వినకుండా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు స్క్రిప్ట్​లో భాగంగానే ఇలా చేశారోమో అని కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతే ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. హనుమాన్​ను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చెందిన నిరంజన్ రెడ్డినే దీనికి కూడా ప్రొడ్యూసర్​గా వ్యవహరిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రంలో అనన్య నాగళ్ళ, శివ రెడ్డి, మురళీధర్ గౌడ్, కృష్ణ తేజ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా, నభా నటేశ్ ఈ చిత్రంతో పాటు నిఖిల్ స్వయంభులోనూ నటిస్తోంది.

వీకెండ్ స్పెషల్​ - టాప్ 10 ట్రెండింగ్​ సిరీస్​ ఇవే! మీరేం చూస్తారు? - Top 10 OTT Webseries

తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ - ఫొటోస్ చూశారా? - Balakrishna Mokshagna

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.