ETV Bharat / entertainment

మహేశ్ నటించిన ఆ రెండు చిత్రాలు నమ్రతకు అస్సలు నచ్చవట!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 8:39 PM IST

మహేశ్ నటించిన ఆ రెండు చిత్రాలు నమ్రతకు అస్సలు నచ్చవట!
మహేశ్ నటించిన ఆ రెండు చిత్రాలు నమ్రతకు అస్సలు నచ్చవట!

Mahesh Babu Namratha : మహేశ్​ తన సుదీర్ఘ సినీ కెరీర్​లో ఎన్నో హిట్, ఫ్లాప్ చిత్రాల్లో నటించారు. అయితే వీటిలో రెండు చిత్రాలు ఆయన సతీమణి నమ్రతకు నచ్చలేదట. అవేంటో తెలుసుకుందాం..

Mahesh Babu Namratha : టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్​ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్​లో ఉన్నారనే చెప్పాలి. అయితే వరుస హిట్లను అందుకుంటూ పోతున్న ఆయన అభిమానులకు రీసెంట్​గా వచ్చిన గుంటూరు కారం చిత్రం మాత్రం కాస్త నిరాశపరిచింది. అయితే వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి.

ప్ర‌స్తుతం మ‌హేశ్​ బాబు త‌న నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో కలిసి SSMB29 భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్​ చేయబోతున్నారు. ఇప్పటికే కథ కూడా రెడీ అయిపోయింది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది.

అయితే తాను​ కెరీర్​లో ఇంత ఉన్న‌త స్థాయికి చేరుకోవడం వెనక తన భార్య ప్రోత్సాహం కూడా ఉందని పలు సందర్భాల్లో మహేశ్ చెప్పారు కూడా. ఆమె మ‌హేశ్​​ బాబును పెళ్లి చేసుకున్నాక నటనకు గుడ్‌ బై చెప్పి సంపూర్ణ గృహిణిగా మారిపోయింది. ఓవైపు ఇంటి బాధ్య‌త‌లు, పిల్ల‌ల బాగోగులు చూసుకుంటూనే ఇంకోవైపు భ‌ర్త‌కు అన్ని విష‌యాల్లో తోడుగా ఉంటోంది. మ‌హేశ్​కు సంబంధించి అన్ని పనులు ద‌గ్గ‌రుండి మరీ చూసుకుంటోంది. ఆయన నిర్మాణ సంస్థ‌ను, వ్యాపారాల‌ను, సేవా సంస్థ‌ల‌ను హ్యాండిల్ చేస్తోంది.

అలా మ‌హేశ్​ స‌క్సెస్​లో న‌మ్ర‌త కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఆమెకు మ‌హేశ్​ బాబు నటించిన రెండు సినిమాలు అంతగా నచ్చవట. ఈ విషయాన్ని ఆమెనే చెప్పినట్లు కథనాలు కూడా వచ్చాయి. అవేంటంటే మహేశ్​ కౌ బాయ్​గా నటించిన టక్కరి దొంగ, మరొకటి బాబీ. ఈ రెండు చిత్రాలు కూడా 2002లోనే రిలీజై ప్రేక్షకుల్ని కూడా నిరాశపరిచాయి. మరి ఈ రెండు సినిమాలు ఆమెకు ఎందుకు నచ్చలేదో క్లారిటీ ఇవ్వలేదని కథనాల్లో రాసి ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mahesh Rajamouli Movie Budget : ఇక మహేశ్ నటించనున్న SSMB29 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్​ వర్క్స్​ను శరవేగంగా జరుపుకుంటోంది. దాదాపు రూ.1000కోట్ల బడ్జెట్​తో తెరకెక్కించనున్నారు. హాలీవుడ్ టెక్నిషియన్స్​ కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

ఆ స్టార్​ హీరోతో సినిమా చేసేందుకు నో చెప్పిన రాజమౌళి! - ఎందుకంటే?

ఓటీటీలోని బెస్ట్ క్రైమ్ డాక్యుమెంటరీస్​ - ఇవన్నీ సెన్సేషనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.