ETV Bharat / entertainment

అదేంటో!- టబు రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ బ్లాక్​బస్టర్​ హిట్లే! - Heroine Tabu Rejected Films

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 9:36 PM IST

Heroine Tabu Rejected Films: 90ల్లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న టబు తెలుగు, హిందీ,మలయాళం, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయినా కొన్ని బ్లాక్ బస్టర్లను మిస్ చేసుకుంది, టబు రిజెక్ట్ చేసిన ఆ సినిమాల లిస్ట్ ఇదే.

MoviesHeroine Tabu Rejected Films
MoviesHeroine Tabu Rejected Films

Heroine Tabu Rejected Films: 11 సంవత్సరాలకే బాలనటిగా హిందీలో 'బజార్' అనే సినిమాలో నటించింది టబు. ఆ తర్వాత 'హమ్ నవ్ జవాన్' అనే సినిమాలో దేవ్ ఆనంద్​కు కూతురిగా నటించింది. 1991లో వెంకటేష్ హీరోగా నటించిన 'కూలీ నెం.1'తో హీరోయిన్​గా తెరపై అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్నేళ్లు బిజీగా మారింది. అక్కడ కూడా సూపర్ హిట్ సినిమాలు చేసింది.

1994లో అజయ్ దేవగన్ హీరోగా చేసిన 'విజయ పథ్' సినిమాకు గాను బెస్ట్ డెబ్యూట్ నటి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత 'సాజన్ కి బాహో మెయిన్', 'జీత్' వంటి సినిమాలు చేసింది. మళ్లీ 1996లో తిరిగి టాలీవుడ్​కి వచ్చి అక్కినేని నాగార్జున 'నిన్నే పెళ్ళాడతా'లో నటించింది. ఆ సినిమా టబుకి ఎంతో గుర్తింపుని ఇవ్వడమే కాదు ఉత్తమ హీరోయిన్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. అయితే అప్పట్లోనే ఈ భామ తీరిక లేకుండా షూటింగ్స్ వలనో, షెడ్యూల్ కుదరకపోవడం వలనో కొన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకుంది. మరి ఆ సినిమాలేంటంటే?

  • 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాలో టీనా పాత్రకు మొదట టబునే అనుకున్నారట కాని టబు కాదనడం వల్ల ఆ పాత్ర రాణి ముఖర్జీని వరించింది.
  • 'బదాయి హొ'లో పాత్రకు డైరెక్టర్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ టబుని అడిగారట కానీ టబునే ఆ పాత్రకు నీనా గుప్తాని రికమెండ్ చేశారట.
  • 'మున్నా భాయి ఎంబిబిఎస్' సినిమాలో మొదట టబునే అనుకున్నారట అయితే టబు రిజెక్ట్ చేయడం వల్ల ఆ పాత్రకు గ్రేసీ సింగ్ ను తీసుకున్నారు.
  • 'లజ్జా' సినిమాలో నటించడానికి అవకాశం వచ్చినా టబు కాదు అనడం వల్ల ఆ పాత్రలో మనీషా కోయిరాలా నటించింది.
  • ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా 'మన్' లో కూడా టబు కాదనుకున్న పాత్ర మనీషా కోయిరాలా చేసింది.

ఇక టబు ప్రస్తుతం అజయ్ దేవ గన్ తో ఔరోన్ మెయిన్ కహ ధమ్ తా అనే సినిమాతో పాటు కరీనా కపూర్, కృతి సనన్ తో కలిపి క్రూ అనే సినిమాలో కనిపించనుంది.

వీళ్ల ప్లేస్​లో వాళ్లు! - ఈ హీరోయిన్లను ఆడిషన్స్​లో రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా? - Actress Rejected In Auditions

'స్క్విడ్​గేమ్' లాంటి అడ్వెంచర్స్​- నెట్​ఫ్లిక్స్​లో ఉన్న టాప్ 10 మూవీస్ ఇవే - Squid Game Type Movies Hollywood

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.