ETV Bharat / entertainment

అమ్మాయి హత్య కేసులో ఇరుక్కున్న సుహాస్​ బయటపడ్డాడా? - Prasanna vadhanam Review

author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 8:26 AM IST

Updated : May 3, 2024, 9:21 AM IST

Prasanna Vadanam Review
Prasanna Vadanam Review(ETV Bharat)

Prasanna Vadanam Review : వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న హీరో సుహాస్‌. ఈ మధ్యే ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. క‌ల‌ర్ ఫొటో నుంచి కథానాయకుడిగా మారి ప‌క్కింటి అబ్బాయిని గుర్తు చేసే పాత్ర‌లు చేస్తున్నాడు. రీసెంట్​గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్​తో హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు ప్ర‌స‌న్న వ‌ద‌నంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

Prasanna Vadanam Review;

చిత్రం: ప్రసన్నవదనం;

నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు;

సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌;

సినిమాటోగ్రఫీ: ఎస్‌.చంద్రశేఖరన్‌;

ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌ ఆర్‌;

నిర్మాత: మణికంఠ జేఎస్‌, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌;

రచన, దర్శకత్వం: అర్జున్‌ వైకే;

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న హీరో సుహాస్‌. ఈ మధ్యే ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. క‌ల‌ర్ ఫొటో నుంచి కథానాయకుడిగా మారి ప‌క్కింటి అబ్బాయిని గుర్తు చేసే పాత్ర‌లు చేస్తున్నాడు. రీసెంట్​గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్​తో హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు ప్ర‌స‌న్న వ‌ద‌నంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

క‌థేంటంటే : రేడియో జాకీగా పనిచేసే సూర్య (సుహాస్‌)కు ఒక ప్ర‌మాదం తన జీవితాన్ని త‌లకిందులు చేసేస్తుంది. అమ్మానాన్న‌ల్ని కోల్పోతాడు. ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్యకు కూడా గురౌతాడు. ఎవ‌రి మొహాల్నీ, గొంతుల్ని గుర్తు ప‌ట్ట‌లేడు. ఈ సమస్య గురించి త‌న స్నేహితుడు విఘ్నేష్ (వైవా హ‌ర్ష‌)కు త‌ప్ప ఎవరికీ తెలీకుండా జాగ్ర‌త్తలు తీసుకుంటుంటాడు. ఈ క్రమంలోనే ఆద్య (పాయల్‌)తో ప్రేమలో పడిన అతడు అనుకోకుండా త‌న క‌ళ్లతో ఓ హత్య చూస్తాడు. కానీ త‌న‌కున్న స‌మ‌స్య‌ వల్ల ఆ హ‌త్య ఎవ‌రు చేశారో తెలుసులేకపోతాడు. కానీ, పోలీసుల‌కు ఈ విష‌యం చెప్పాలని ప్రయత్నించిన అతడిపై దాడి జ‌రుగుతుంది. అయినప్పటికీ వెన‌క‌డుగు వేయ‌కుండా సూర్య ముందుకెళ్తాడు. అనూహ్యంగా ఆ హ‌త్య కేసులో తానే ఇరుక్కుని మరిన్ని కష్టాల్ని ఎదుర్కొంటాడు. . మరి ఇంత‌కీ ఆ హ‌త్య చేసింది ఎవ‌రు? హ‌త్య‌కు గురైన ఆ అమ్మాయి ఎవ‌రు? ఆ కేసులో సూర్య‌ ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది? చివరికి సుహాస్ దీని నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే కథ.

ఎలా ఉందంటే : సుహాస్‌ను ఇందులో కొత్త‌గా చూపించారు. తన లోక‌ల్ బాయ్​ ఇమేజ్‌కు భిన్నంగా చేసిన సినిమా ఇది. ఫేస్ బ్లైండ్‌నెస్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. సినిమా ఆద్యంతం మంచి మ‌లుపులు తిరుగుతూ ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్‌ను పంచుతుంది. ఓరకంగా ద‌ర్శకుడు విజ‌యం సాధించాడనే చెప్పాలి. హీరోకు అత‌డి స్నేహితుడికీ మ‌ధ్య సీన్స్​, ఆద్య‌తో లవ్ ట్రాక్​ ఎపిసోడ్స్ బాగున్నాయి. హీరో హ‌త్యను చూడ‌టంతో క‌థ మలుపు తిరిగి ఆస‌క్తి మొద‌ల‌వుతుంది.ఇంటర్వెల్ ముందు మలుపు తిరిగిన ఈ కథ సినిమాను ఉత్కంఠ‌భ‌రితంగా మార్చేస్తుంది.

సెకంఢాప్​లో హీరో చుట్టూ ఉచ్చు బిగుసుకోవ‌డం, హీరో తనకున్న వ్యాధితోనే నేరస్థుడు ఎవ‌రనేది క‌నిపెట్టడానికి చేసే పోరాటం, ఈ క్రమంలోనే చోటు చేసుకునే మలుపులు ఆసక్తికరంగా సాగుతాయి. హత్యకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకం. క్లైమాక్స్​ సీన్స్​ సినిమాను మ‌రింత ఉత్కంఠగా చూపిస్తుంది. అక్క‌డ‌క్క‌డ మాత్రమే కాస్త స్లో అవుతుంది కానీ ఓ కొత్త ర‌క‌మైన థ్రిల్ల‌ర్‌ను చూసిన అనుభూతి మాత్రం ఉంటుందనే చెప్పాలి.

ఎవ‌రెలా చేశారంటే : సుహాస్ న‌ట‌న ఎప్పటి లాగే సూపర్. అతడి పాత్ర కామెడీ, ఎమోషనల్​ బాగా పండింది. పోలీస్ అధికారిగా రాశిసింగ్‌ పాత్ర అల‌రించింది. నితిన్ ప్ర‌స‌న్న పాత్ర సినిమాకు ఎంతో కీల‌కం. వైవాహర్ష తెలిసిన స్నేహితుడి పాత్ర‌లో సంద‌డి చేశాడు. నందు, సాయి శ్వేత తమ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించి ఆకట్టుకున్నారు.

టెక్నికల్​గా ఏ విభాగం లోటు చేయ‌లేదు. చంద్ర‌శేఖ‌ర‌న్ కెమెరా వర్క్ మంచిగా ఉంది. విజయ్ బుల్గానిన్ బ్యాక్​గ్రౌండ్ స్కోర్​ ప్ర‌భావం చూపుతుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా బాగుంది. ద‌ర్శ‌కుడు అర్జున్‌ తన తొలి చిత్రాన్నే ఎంతో స్ప‌ష్టంగా చూపించారు. తన ర‌చ‌న‌లో బిగి, బ‌లం దాగి ఉంది. నిర్మాణం ప‌రంగా ఎటువంటి లోటు లేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మాహిష్మతి మీద‌కి దండెత్తిన క‌ట్ట‌ప్ప‌ - 'బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్' స్ట్రీమింగ్ ఎక్కడంటే ? - Baahubali Crown Of Blood Release

మాట నిలబెట్టుకున్న రాజమౌళి-మహేశ్​ - Rajamouli Mahesh Babu Movie

Last Updated :May 3, 2024, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.