ETV Bharat / entertainment

'ఫాస్ట్​గా రిలీజ్ చేయండి బ్రో'- హనుమాన్ OTTపై ప్రశాంత్​కు ఫ్యాన్స్​ రిక్వెస్ట్

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 4:02 PM IST

Updated : Mar 13, 2024, 4:50 PM IST

Hanuman OTT
Hanuman OTT

Hanuman OTT: టాలీవుడ్ యంగ్ హీరో తేజసజ్జ- ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన బ్లాక్​బస్టర్ మూవీ 'హనుమాన్'​ ఓటీటీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా ఓటీటీ రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్​కు ట్విట్టర్​లో ఫ్యాన్స్​ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Hanuman OTT: 2024లో తొలి బ్లాక్​బస్టర్ మూవీ హను-మాన్ ఓటీటీ కోసం ఫ్యాన్స్ ఎంతో​ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇప్పుటికే పలుమార్లు వాయిదా పడింది. హనుమాన్ డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ5 స్ట్రీమింగ్ డేట్​పై క్లాటిరీ ఇవ్వట్లేదు. మరోవైపు హిందీలో ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్స్​కు రెడీ అవుతోంది. మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ ఛానల్‌, జియో సినిమాలో టెలికాస్ట్‌ కానుంది.

అయితే అదే రోజు తెలుగు వెర్షన్​ కూడా ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందని ఆడియెన్స్ ఆశిస్తున్నప్పటికీ, దీనిపై సరైన క్లారిటీ లేదు. దీంతో హనుమాన్ ఓటీటీ ఎక్స్​పీరియన్స్ చేయాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు రిక్వెస్ట్ పెడుతున్నారు. ఫన్నీ ఫన్నీ మీమ్స్, పోస్ట్​లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికైనా సస్పెన్స్​ వీడి ఓటీటీ రిలీజ్ డేట్​పై అప్డేట్ ఇవ్వాలంటూ జీ5ని ట్యాగ్ చేస్తున్నారు. చూడాలి మరి మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్​లో ఉన్న హనుమాన్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో?

చిన్న సినిమాగా రూపొంది 2024 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ అతి పెద్ద విజయం సాధించింది. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్​లోనూ కాసుల వర్షం కురిపించిన హనుమాన్ రూ.300+ కోట్లు వసూల్ చేసింది. ఇక ఈ సినిమా రీసెంట్​గా 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ నటించగా, వరలక్ష్మి శరత్​కుమార, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు ఆయా పాత్రలు పోషించారు.

రెడీ బాబు రెడీ: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రం జై హనుమాన్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హనుమాన్​కు సీక్వెల్​గా ఇది రూపొందనుంది. ఈ క్రమంలో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక తాజాగా సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు ప్రశాంత్ వర్మ లేటెస్ట్ పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. బుధవారం ప్రశాంత్ వర్మ షూటింగ్ పనులకు సంబంధించి ఓ పోస్ట్ షేశారు. దానికి 'బ్యాక్ టు మై ప్లేస్, రెడీ బాబు రెడీ' అని క్యాప్షన్ రాసుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓటీటీలో కన్నా ముందే టీవీలోకి హనుమాన్ మూవీ- ఏ ఛానల్​లో అంటే?

'హనుమాన్' షాకింగ్ డెసిషన్- మరింత ఆలస్యంగా ఓటీటీలోకి- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Last Updated :Mar 13, 2024, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.