'హనుమాన్' షాకింగ్ డెసిషన్- మరింత ఆలస్యంగా ఓటీటీలోకి- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 1:30 PM IST

Updated : Mar 1, 2024, 2:22 PM IST

Hanuman Movie OTT

Hanuman Movie OTT: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ రీసెంట్ బ్లాక్​బస్టర్ హనుమాన్ ముందుగా చెప్పిన తేదీ కంటే మరింత ఆలస్యంగా ఓటీటీలోకి రానుంది.

Hanuman Movie OTT: 2024 సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా నిలిచి భారీ విజయాన్ని దక్కించుకుంది హనుమాన్. ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.300+ కోట్లు వసూల్ చేసి పలు రికార్డులు బ్రేక్ చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వీఎఫ్ఎక్స్​తో వండర్స్​ క్రియేట్ చేసి ప్రశంసలు పొందారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఈగర్​గా వెయిట్​ చేస్తున్నారు.

అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ జీ 5 (ZEE 5) దక్కించుకుంది. ముందుగా మార్చి 2నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ (OTT Streaming) కానున్నట్లు రీసెంట్​గా మేకర్స్​ తెలిపారు. కానీ, కొన్ని కారణాల వల్ల హనుమాన్ మరింత ఆలస్యంగా ఓటీటీలోకి రానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్​ కానున్న డేట్​ను జీ 5 అఫీషియల్​గా ప్రకటించింది. ఈ బ్లాక్ బస్టర్ ముూవీ మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు జీ 5 శుక్రవారం తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్​లో ట్వీట్ చేసింది.

సినిమా విషయానికొస్తే, 2024లో తొలి బ్లాక్​బస్టర్ విజయం అందుకున్న మూవీ హనుమాన్. హిందీలోనూ హనుమాన్ మార్క్ కనిపించింది. నార్త్​లో రూ.40+ కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా అటు ఓవర్సీస్ (Hanuman Overseas Collection)లోనూ హనుమాన్ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఓవర్సీస్​లో 5 మిలియన్ డాలర్ల క్లబ్​లోకి ఎంటర్​ అయ్యింది. దీంతో ఓవర్సీస్​లో 5మిలియన్​ డాలర్లు సాధించిన టాప్- 5 తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

Hanuman Movie Cast: హనుమాన్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జతోపాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్​రెడ్డి ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను రూపొందించారు. గౌర హరి, అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక 2025లో జై హనుమాన్ టైటిల్​తో ఈ సినిమా సీక్వెల్ రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'హనుమాన్​' డైరెక్టర్ సూపర్ ట్యాలెంట్​ - స్కూల్​ ఫంక్షన్​లో రివీల్

25 రోజుల్లో రూ. 300 కోట్లు - బాక్సాఫీస్ వద్ద మరో రేర్​ రికార్డు బ్రేక్​

Last Updated :Mar 1, 2024, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.