ETV Bharat / entertainment

గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్'- రాజ్​తరుణ్ 'భలే ఉన్నాడే' గ్లింప్స్ చూశారా? - Raju Yadav Trailer

author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 7:46 PM IST

Updated : May 5, 2024, 8:18 PM IST

Raju Yadav Trailer
Raju Yadav Trailer (Source: ETV BHARAT)

Raju Yadav Trailer: జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను లీడ్​ రోల్​లో 'రాజు యాదవ్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం రిలీజైంది. మరోవైపు టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా 'భలే ఉన్నాడే' నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.

Raju Yadav Trailer: జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ గెటప్ శ్రీను హీరో అవతారమెత్తాడు. డైరెక్టర్ కృష్ణమాచారి తెరకెక్కించిన 'రాజు యాదవ్' సినిమాలో శ్రీను హీరోగా పరిచయం కానున్నాడు. యధార్థ సంఘటనల ఆధారంగా కృష్ణమాచారి ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో అంకిత కారత్ హీరోయిన్​గా నటించింది. కాగా, ఆదివారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్​ ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​కు హను-మాన్ ఫేమ్ హీరో తేజ సజ్జ చీఫ్ గెస్ట్​గా హాజరై ట్రైలర్​ను రిలీజ్ చేశారు. మరి మీరు ట్రైలర్ చూశారా?

ఈ సినిమాలో శ్రీను మధ్య తరగతి కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడు. క్రికెట్ ఆడుతుండగా బంతి శ్రీను మొహంపై తగులుతుంది. దీంతో అతడి ముఖ చిత్రం కామెడీగా మారిపోతుంది. ఈ ఒక్క లైన్​తో డెరెక్టర్ సినిమాను నడిపించారు. ఈ రకమైన ఫేస్​తో శ్రీను పడే ఇబ్బందులు ట్రైలర్​లో చూపించారు. ఇక ఈ సినిమాలో రాకెట్ రాఘవ, జబర్దస్త్ ఫేమ్ సన్నీ, హేమంత్, ఆనంద చక్రపాణి తదితరులు నటించారు. ఇక ఈ మూవీ మే 17న థియేటర్లలో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhale Unnade Teaser: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్​తరుణ్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న సినిమా 'భలే ఉన్నాడే'. ఈ సినిమాకు జే శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. యంగ్ బ్యూటీ మనీషా కందుకూర్ హీరోయిన్​గా నటించింది. ఈ సినిమా టీజర్ ఆదివారం విడుదలైంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతి ఈ టీజర్ రిలీజ్ చేశారు. మరి మీరు ఈ టీజర్ చూశారా?

ఈ సినిమాలో రాజ్​తరుణ్ ఫ్యాషన్ డిజైనర్​గా కనిపించనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. సినిమాలో హీరోకి అమ్మాయిల ఫీవర్ ఉంది. దీంతో ఆడవాళ్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. అయితే హుషారైన హీరోయిన్ తన చలాకీ తనంతో హీరోను ఎలా దగ్గర చేసుకుంటుంది? ఎలా ప్రేమలో పడేస్తుందనేదే కథ. ఈ సినిమా మంచి ఫ్యామిలీ డ్రామా విత్ కామెడీ ఎలిమెంట్స్​తో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్​గా ఉండనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'నారప్ప' తొలి లిరికల్.. నవ్విస్తున్న 'స్టాండప్ రాహుల్' టీజర్

గెటప్​ శ్రీను కొత్త చిత్రం.. 'థ్యాంక్​ యు బ్రదర్'​ రిలీజ్ డేట్

Last Updated :May 5, 2024, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.