ETV Bharat / entertainment

2024 ఆస్కార్​లో 'ఓపెన్‌హైమర్‌' జోరు- బెస్ట్​ యాక్టర్, డైరెక్టర్ సహా 7 అవార్డులు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 8:18 AM IST

Updated : Mar 11, 2024, 10:59 AM IST

Best Actor Oscar 2024
Best Actor Oscar 2024

Best Actor Oscar 2024: 96వ ఆస్కార్ అవార్డ్స్​లో హాలీవుడ్ హీరో కిలియన్‌ మర్ఫీ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఆయనకు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అస్కార్ దక్కింది.

Best Actor Oscar 2024: 96వ ఆస్కార్ అవార్డ్స్​లో హలీవుడ్ హీరో కిలియన్‌ మర్ఫీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఓపెన్‌ హైమర్‌ సినిమాలో ఆయన నటనకుగాను మర్ఫీకి ఈ అవార్డు లభించింది. ఇక ఓపెన్‌హైమర్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్​ అందుకున్నారు. కాగా, ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ పురస్కారం అందుకోవడం క్రిస్టోఫర్‌ నోలన్‌కు ఇదే తొలిసారి. అలాగే ఎమ్మా స్టోన్‌కు ఉత్తమ నటి అవార్డు వరించింది. ఇక ఓపెన్‌హైమర్‌ సినిమా ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది.

ఆస్కార్​లో ఓపెన్​ హైమర్ జోరు ప్రదర్శించింది. మొత్తం 7 కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది.

  • ఉత్తమ చిత్రం- ఓపెన్​హైమర్
  • ఉత్తమ దర్శకుడు- క్రిస్టోఫర్‌ నోలన్‌
  • ఉత్తమ నటుడు- కిలియన్‌ మర్ఫీ
  • ఉత్తమ సహాయ నటుడు- రాబర్ట్ డౌనీ జూనియర్
  • బెస్ట్ ఒరిజినల్ స్కోర్- 'వాట్ వాజ్​ ఐ మేడ్ ఫర్' (What Was I Made For?)
  • బెస్ట్ సినిమాటోగ్రఫీ- ఓపెన్​హైమర్
  • బెస్ట్​ ఫిల్మ్​ ఎడిటింగ్- జెన్నిఫర్ లేమ్

ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్‌ ఓపెన్‌ హైమర్‌ జీవితం ఆధారంగా ఓపెన్​ హైమర్ రూపొందింది. ఈ సినిమాకు ప్రముఖ బ్రిటన్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించారు. దాదాపు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ మూవీ 2023 జూలై 21న రిలీజై భారీ విజయం దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఓపెన్ హైమర్ ఏకందా 900 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది.

అప్పుడే చెప్పారు: రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్​పై వేసిన అణు బాంబులను కనుగొన్న జే. రాబర్ట్ ఓపెన్ ​హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో కిలియన్‌ మర్ఫీ నటనటు అప్పుడే ప్రశంసలు దక్కాయి. ఈ మూవీలో మర్ఫీ యాక్టింగ్ అదరగొట్టేశాడని అన్నారు. ఆయన నటనకు ఆస్కార్ రావాల్సిందేనని నెటిజన్లు సినిమా రిలీజైనప్పుడే సోషల్ మీడియాలో కామెంట్స్​ చేశారు.

భారీ రెమ్యూనరేషన్: డైరెక్టర్ ​క్రిస్టోఫర్ నోలన్ రెమ్యూనరేషన్​గా సాధారణంగా సినిమా వసూళ్లలో వాటా తీసుకుంటారట. ఈ క్రమంలో ఆయన బ్లాక్​బస్టర్ మూవీ ఓపెన్​ హైమర్​కు కూడా కలెక్షన్​లో షేర్ రెమ్యూనరేషన్​గా తీసుకున్నారట. దీంతో త్రాన్ని డైరెక్ట్ చేసినందుకుగానూ క్రిస్టోఫర్ నోలన్​కు ఏకంగా 72 మిలియన్ డాలర్స్ అందుకున్నట్లు సమాచారం. అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.595 కోట్లు అన్నమాట.

2024 ఆస్కార్ అవార్డ్స్​- బెస్ట్​ పిక్చర్​గా ఓపెన్​హైమర్- ఉత్తమ డైరెక్టర్​గా క్రిస్టోఫర్‌ నోలన్‌

ఆస్కార్ @​96 : అవార్డు గెలిచిన భారతీయులు వీరే - తొలి వ్యక్తి ఎవరంటే?

Last Updated :Mar 11, 2024, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.