ETV Bharat / education-and-career

SBIలో 131 'స్పెషలిస్ట్' ఉద్యోగాలు- అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 6:39 PM IST

SBI SCO Recruitment 2024 : బ్యాంకింగ్​ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్​బీఐ పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SBI SCO Recruitment 2024
SBI SCO Recruitment 2024

SBI SCO Recruitment 2024 : స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ)లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్​ క్యాడర్​ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? పోస్టుల సంఖ్య, అప్లికేషన్​ ఫీజు, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, అర్హత తదితర వివరాలు మీ కోసం.

  • ఉద్యోగాలు భర్తీ చేసే సంస్థ : స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా
  • మొత్తం ఉద్యోగాల సంఖ్య : 131
    • మేనేజర్​(క్రెడిట్​ అనాలసిస్​) : 50
    • అసిస్టెంట్​ మేనేజర్​ (సెక్యూరిటీ అనలిస్ట్​) : 23
    • డిప్యూటీ మేనేజర్​(సెక్యూరిటీ అనలిస్ట్​) : 51
    • మేనేజర్​(సెక్యూరిటీ అనలిస్ట్​) : 3
    • అసిస్టెంట్ జనరల్​ మేనేజర్ ​(అప్లికేషన్​ సెక్యూరిటీ) : 3
    • సర్కిల్​ డిఫెన్స్​ బ్యాంకింగ్​ అడ్వయిజర్​ : 1

SBI SCO Eligibility 2024
అర్హత : మేనేజర్ ​(క్రెడిట్​ అనలిస్ట్​) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ(ఫైనాన్స్)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఏఎస్​(ఫైనాన్స్)/CA/సీఎఫ్​ఏ/ఐసీడబ్ల్యూఏ వీటిలో ఏదో ఒక దానిలో డిగ్రీ పొంది ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఇతర అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలకు ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

SBI SCO FEE

ఫీజు : జనరల్​/ ఈడబ్ల్యూఎస్​/ ఓబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తులు స్వీకరణ తేదీ : ఆన్​లైన్​ అప్లికేషన్​లను 2024 ఫిబ్రవరి 13 నుంచి స్వీకరిస్తారు.

చివరి తేదీ : 2024 మార్చ్ 4

ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి?

  1. స్టెప్​ 1 : ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.
  2. స్టెప్​2 : ఎస్​బీఐ ఎస్​సీఓ(స్పెషలిస్ట్​ క్యాడర్​ ఆఫీసర్​) రిక్రూట్​మెంట్​ 2024 హోమ్​పేజ్​పై క్లిక్​ చేయండి.
  3. స్టెప్​3 : అవసరమైన అన్ని వివరాలను ఎంటర్​ చేయాలి.
  4. స్టెప్​4 : అప్లికేషన్​ ఫామ్​ను సబ్మిట్​ చేయాలి.
  5. స్టెప్​5 : అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్​ చేయాలి.
  6. స్టెప్​6 : మీ అప్లికేషన్​ ఫామ్​ను ప్రింట్​ తీసుకుని భద్రపరుచుకోవాలి.

అభ్యర్థులకు ముఖ్య గమనిక : అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా అఫీషియల్​ వెబ్​సైట్​ను సందర్శించి మాత్రమే ఈ జాబ్​లకు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

ఎస్​బీఐ భారీ నోటిఫికేషన్​.. 2000 పీవో పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

డిగ్రీ అర్హతతో ఎస్​బీఐలో 8773 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.