ETV Bharat / business

ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? పన్ను ఆదా కావాలా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 4:49 PM IST

income tax saving tips
Tax Saving Investments

Tax Saving Investments : మీరు భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? సంపాదించిన రాబడిపై పన్ను మినహాయింపులు కూడా లభిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆదాయ పన్ను భారం వీలైనంత వరకు తగ్గించుకునే, మంచి పెట్టుబడి మార్గాలను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Tax Saving Investments : మన భవిష్యత్ బాగుండాలంటే, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే, అందుకు తగిన ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం మంచి పన్ను ఆదా పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు, నష్టాన్ని భరించే శక్తిని అనుగుణంగా, ఈ పథకాలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మీ భవిష్యత్​కు భరోసా లభిస్తుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న నేపథ్యంలో, పన్ను ప్రణాళికలు వేసుకునేవారు, కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ఆదాయ పన్ను భారం తగ్గేలా, నిర్ణీత మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చట్టం అనుమతి ఇస్తోంది. కనుక కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చినవారు దీర్ఘకాలిక దృష్టితో పథకాలను ఎంచుకోవాలి. ఇప్పటికే పన్ను చెల్లిస్తున్నవారు, తమ పెట్టుబడులను ఒకసారి సమీక్షించుకోవాలి.

వ్యూహాత్మకంగా
పెట్టుబడులు పెట్టే ముందు కచ్చితంగా కట్టాల్సిన పన్నులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కొత్త పన్ను విధానం ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7.5 లక్షలలోపు సంపాదించేవారు, ఎలాంటి పన్ను కట్టాల్సిన పనిలేదు. కనుక ఈ పరిమితిలోపు ఉన్నవారు, పన్ను గురించి, పెట్టుబడుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ భవిష్యత్త్ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మకంగా, గరిష్ఠ ప్రయోజనాలు పొందేలా పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఇందుకోసం ముందుగా పాత పన్ను విధానంలో, ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో తెలుసుకోవాలి. అవసరమైతే ఆదాయ పన్ను వెబ్​సైట్​లో ఉన్న ఆన్​లైన్ కాలిక్యులేటర్​ను ఉపయోగించుకోవాలి. అలాగే కొత్త పన్నుల విధానాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోవాలి. ఏ విధానంలో తక్కువ పన్ను ఉందో, స్పష్టమైన అవగాహనకు వచ్చి, దాని ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలి.

మినహాయింపులు
ఇంటి అద్దె, పిల్లల ట్యూషన్ ఫీజులు, గృహరుణం - అసలు, వడ్డీలు, పీఎఫ్ జమ, బీమా పాలసీలు అన్నింటినీ చూసుకోవాలి. ఇవన్నీ పన్ను భారం తగ్గించుకునేందుకు ఉపకరిస్తాయి. ఇవి కాకుండా ఇంకా వేటిపై పన్నులు చెల్లించాలి. పన్ను మినహాయింపులు లభించే పెట్టుబడులు ఏమున్నాయో చూసుకోవాలి. అప్పుడే వీలైనంత వరకు పన్నుల భారం తగ్గించుకోవచ్చు.

దీర్ఘకాల పెట్టుబడులు
దీర్ఘకాలిక పన్ను ఆదా పెట్టుబడులపై దృస్టి సారించే వారికి ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీం (ELSS), ప్రజా భవిష్య నిధి (PPF) బాగుంటాయి. అయితే స్టాక్​మార్కెట్లతో నేరుగా సంబంధం ఉన్న ఈఎల్​ఎస్ఎస్​ వల్ల కొంత మేరకు నష్టభయం ఉంటుంది. నష్టభయాన్ని తట్టుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు. అలా కాకుండా స్థిరమైన రాబడి రావాలని ఆశించేవారు పీపీఎఫ్ పథకాన్ని ఎంచుకోవాలి. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం కనుక ఎలాంటి నష్టభయం ఉండదు. పైగా ఈ పెట్టుబడులకు సెక్షన్​ 80సీ కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

బీమా పాలసీలు - పన్ను మినహాయింపులు

  • బీమా పాలసీలపై పన్ను మినహాయింపులు ఉంటాయి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీ ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఎన్నో రకాల ఇన్సూరెన్స్​ పాలసీలు ఉన్నప్పటికీ, తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ అందించే టర్మ్‌ పాలసీని తీసుకోవడం మంచిది. ఒకవేళ పాలసీదారునికి దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే, అతని లేదా ఆమె కుటుంబానికి పరిహారం లభిస్తుంది. ఇది ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరా అవుతుంది. ముఖ్యంగా ఈ బీమా, టర్మ్​ పాలసీలు మీ వార్షికాదాయానికి కనీసం 10 రెట్లకు మించి ఉండేలా చూసుకోవాలి.
  • నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా పాలసీలు తప్పనిసరిగా ఉండాలి. కనీసం రూ.5 లక్షల ప్రాథమిక పాలసీ, రూ.20 లక్షల సూపర్​ టాప్​అప్​ పాలసీలు అందరూ తీసుకోవాలి. ఎందుకంటే వీటిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీపై కూడా సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు లభిస్తుంది.
  • జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడం ప్రతి ఒక్కరీ చాలా అవసరం. అయితే వీటిని పన్ను మినహాయింపు కోసం కాకుండా, అదనపు ప్రయోజనంగానే చూడాలి.
  • అలాగే పన్ను మినహాయింపు కోసం కాకుండా, దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే మీకు భవిష్యత్​లో మంచి రాబడి వస్తుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది.

క్రెడిట్ కార్డు పోయిందా? వెంటనే ఇలా చేయండి- లేదంటే చాలా నష్టం!

మీరు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్​​ కొన్నారా? ఈ టాప్​-7 మెయింటెనెన్స్ టిప్స్​ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.