ETV Bharat / business

మీరు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్​​ కొన్నారా? ఈ టాప్​-7 మెయింటెనెన్స్ టిప్స్​ మీ కోసమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 11:48 AM IST

Electric Bike Maintenance Tips : మీరు కొత్తగా ఎలక్ట్రిక్​ బైక్ కొన్నారా? దానిని చక్కగా మెయింటైన్​​ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో టాప్​-7 ఎలక్ట్రిక్​ బైక్​ మెయింటెనెన్స్ టిప్స్ గురించి తెలుసుకుందాం.

Electric two wheeler Maintain Tips
Electric Bike Maintain Tips

Electric Bike Maintenance Tips : ప్రస్తుత కాలంలో ఎలక్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పర్యావరణ ప్రేమికులు వీటిని ఎక్కువగా కొంటున్నారు. వీరితోపాటు పెరిగిన ఇంధన ధరలను తట్టుకోలేక, చాలామంది ఈవీ బైక్​లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఈవీ టూ-వీలర్స్​ను ఎలా మెయింటైన్ చేయాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. దీనికి తోడు మన దేశంలో ఈవీ టూ-వీలర్స్​ రిపేర్ షాపులు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. అందుకే ఈ ఆర్టికల్​లో మీ ఈవీ బైక్ మెయింటెనెన్స్ కోసం పనికి వచ్చే టాప్​-7 టిప్స్ గురించి తెలుసుకుందాం.

1. బైక్​ను తరచుగా శుభ్రపరచాలి!
మీ ఎలక్ట్రిక్​ బైక్​ను కనీసం వారానికి ఒకసారి అయినా శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఇంజిన్​, చైన్​ల్లోని దుమ్ము, ధూళిని తొలగించాలి. అప్పుడే బైక్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఒకవేళ ఇంజిన్​లో దుమ్ము, ధూళి చేరితే ఇంజిన్ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది.

2. ఓవర్ లోడ్ చేయకూడదు!
మీ ఈవీ బైక్​ ఎంత బరువు వరకు మోయగలదో, అంతే వెయిట్​తో ప్రయాణించాలి. దానిపై ఎక్కువ మంది వెళ్లటం లేదా అధిక బరువు ఉండే వస్తువులను తీసుకెళ్లడం లాంటివి చేయకూడదు. ఏవో కొన్ని సందర్భాల్లో అయితే ఫర్వాలేదు కానీ, తరచూ ఈవీ బైక్​ల అధిక బరువులతో ప్రయాణం చేస్తే ఇంజన్​పై, టైర్లపై చాలా దుష్ప్రభావం పడుతుంది.

3. పవర్ ఆఫ్ చేయండి!
సాధారణంగా మనం ట్రాఫిక్​లో చిక్కుకున్నప్పుడు లేదా ఎక్కడైనా ఆగినప్పుడు బైక్ ఇంజన్ ఆఫ్ చేయకుండా ఉంచుతాం. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. మీరు ఎక్కడైనా ఈవీ బైక్​ను ఆపినప్పుడు, తప్పకుండా ఇంజన్ ఆఫ్ చేయాలి. దాని వల్ల పవర్ ఆదా అవడంతో పాటు, మీ స్కూటీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది.

4. తరచుగా టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి!
సాధారణంగా ఈవీ బైక్​లు లైట్ వెయిట్ కలిగి ఉంటాయి. కనుక టైర్​లో ఎంత ప్రెజర్​ ఉందో మనకు తెలియదు. కానీ మనం టైర్​ ప్రెజర్ గురించి పట్టించుకోకుండా దీర్ఘకాలంపాటు ప్రయాణాలు చేస్తుంటే, ఇంజిన్​పై దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కనుక టైర్ ప్రెజర్​ను తరచుగా చెక్​ చేసుకోవాలి. ప్రస్తుతం టైర్ ప్రెజర్ చెక్ చేసుకునే పరికరాలు, మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.

5. అతిగా ఎమర్జెన్సీ బ్రేక్స్​ వేయకూడదు!
మనం స్పీడ్​గా వెళ్తున్నప్పుడు బండి వేగాన్ని అదుపు చేయడానికి ఎమర్జెనీ బ్రేక్స్ వేస్తుంటాం. కానీ ఇలా తరచూ చేస్తుంటే, బైక్​ దెబ్బతింటుంది. ముఖ్యంగా బైక్​లోని ఎలక్ట్రికల్​, మెకానికల్ పార్టులు పాడయ్యే అవకాశం ఉంటుంది.

6. ఆయిల్ మార్చండి
మీ ఈవీ బైక్​ విడిభాగాల మధ్య ఆయిల్ వేస్తూ (లూబ్రికేషన్​ చేస్తూ) ఉండాలి. దీని వల్ల బైక్ పార్టుల మధ్య ఫ్రిక్షన్​ సరిగ్గా ఉంటుంది. మీరు కనుక మెుదటిసారి ఈవీ బైక్ కొన్నట్లయితే, నిపుణులను అడిగి లూబ్రికేషన్ ఎలా చేయాలో తెలుసుకోండి.

7. బ్యాటరీ మెయింటెనెన్స్​
సాధారణ బైక్​లకు ఇంజన్ ఎలాగో, ఈవీ బైక్​లకు బ్యాటరీ అలాంటిదే. కనుక బ్యాటరీ మెయింటెనెన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా బ్యాటరీల విషయంలో మాన్యుఫాక్చురర్​ కంపెనీ సూచించిన నియామాలను కచ్చితంగా పాటించాలి. బ్యాటరీని ఓవర్​ ఛార్జ్ చేయకూడదు. ఇలా అన్ని జాగ్రత్తలు పాటిస్తే, బ్యాటరీ అధిక కాలం మన్నిక వస్తుంది. మీ వెహికల్ కూడా సురక్షితంగా ఉంటుంది.

కొత్త కారు కొంటున్నారా? ఈ టాప్​-6 ఫీచర్లు ఉన్నాయో లేదో చూసుకోండి!

మంచి మైలేజ్ ఇచ్చే బైక్​ను కొనాలా? అయితే ఈ మోడల్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.