ETV Bharat / business

ట్రైన్​ ప్యాసింజర్స్​​కు గుడ్​న్యూస్​- ఇకపై జర్నీలోనూ స్విగ్గీ ఫుడ్​ ఆర్డర్​ చేయొచ్చు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 3:51 PM IST

Swiggy IRCTC
Swiggy IRCTC

Swiggy IRCTC : ఈనెల 12 నుంచి విశాఖపట్నం, విజయవాడ సహా దేశంలోని మరో రెండు ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్​లలో తమ సేవలను అందిస్తామని ప్రకటించింది ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ. ఈ మేరకు ఐఆర్​సీటీసీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Swiggy IRCTC : ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ సేవలను మరింత విస్తరించేందకు మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా మార్చి 12 నుంచి విశాఖపట్నం, విజయవాడ సహా దేశంలోని మరో రెండు ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్​లలో ఆన్​లైన్​లో ఫుడ్​ డెలివరీ సర్వీసులను అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​-ఐఆర్​సీటీసీతో మంగళవారం ఎంఓయూ (అవగాహన ఒప్పందం) కుదుర్చుకుంది.

మరో 59 స్టేషన్​లకు కూడా
ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, విశాఖపట్నం సహా కర్ణాటక- బెంగళూరు, ఒడిశా- భువనేశ్వర్ నగరాల​ రైల్వే స్టేషన్​లలోనూ ఈనెల 12 నుంచి ప్రయాణికులకు ఆన్​లైన్​ ద్వారా ఫుడ్​ డెలివరీ సేవలను అందిస్తామని స్విగ్గీ సీఈఓ రోహిత్​ కపూర్​ వెల్లడించారు. కాగా, తమ సేవలను రానున్న రోజుల్లో దేశంలోని మరో 59 రైల్వే స్టేషన్​లకు విస్తరిస్తామని స్విగ్గీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

'బెంగళూరు, భువనేశ్వర్​, విశాఖపట్నం, విజయవాడ మార్గాల్లో తిరిగే రైలు ప్రయాణికులు ఇకపై మార్చి 12 నుంచి మా పోర్టల్​ లేదా యాప్​ ద్వారా ఆన్​లైన్​లోనే తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్​ చేసుకోవచ్చు. మాకున్న విస్తృతమైన రెస్టారెంట్​ల నెట్​వర్క్​ ద్వారా ఆయా స్టేషన్​లకు చేరే ప్రయాణికులకు సమయానికి ఆహారాన్ని అందజేస్తాం. ఈ సేవలను మీరు ఆస్వాదిస్తూ మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా. మీ ఆశాజనకమైన ఫీడ్​బ్యాక్​ రాబోయే రోజుల్లో ఇలాంటి సేవలను మరిన్ని స్టేషన్​లలో కూడా ప్రారంభించేందుకు మాకు ఉత్తేజాన్ని ఇస్తుంది' అని స్విగ్గీ సీఈఓ రోహిత్​ కపూర్​ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

"స్విగ్గీతో ఈ భాగస్వామ్యం ఆహారం విషయంలో మా ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుందని అనుకుంటున్నా. తద్వారా ప్యాసింజర్స్​ చేసే ప్రయాణాలు వాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి."
- సంజయ్​ కుమార్​, ఐఆర్​సీటీసీ ఎండీ, ఛైర్మన్​

ఆర్డర్​ చేయండిలా
రైళ్లలో ప్రయాణించే సమయాల్లో మీకు నచ్చిన ఫుడ్​ను ప్రీ-ఆర్డర్​ చేయడానికి ముందుగా ఐఆర్​సీటీసీ యాప్‌లో పీఎన్​ఆర్​ సంఖ్యను ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. తర్వాత తాము ఏ స్టేషన్​లో అయితే ఆహారాన్ని రిసీవ్​ లేదా తీసుకోవాలనుకుంటున్నారో ఆ రైల్వే స్టేషన్​ను సెలెక్ట్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీకు నచ్చిన స్టేషన్​కు మీరు ఇష్టపడే ఫుడ్​ను స్విగ్గీ డెలివరీ బాయ్స్​ తీసుకొచ్చి డెలివర్​ చేస్తారు.

ఇకపై రెండు కంపెనీలుగా టాటా మోటర్స్​ - కారణం అదేనా?

ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్​ - రెండో స్థానానికి పడిపోయిన ఎలాన్ మస్క్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.