ETV Bharat / business

అలర్ట్ : మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? - మరి ఇన్సూరెన్స్ స్కామ్ గురించి తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 3:39 PM IST

Insurance Fraud
Insurance

Insurance Scams : అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి బీమా​ పాలసీలు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాయి. అలాంటి బీమానే మింగేసే స్కామ్స్​ కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయని మీకు తెలుసా? ఇటీవల పెరుగుతున్న ఇన్సూరెన్స్ స్కామ్‌లు పాలసీదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మీరు మోసపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

How to Avoid Insurance Scams : సాంకేతికత పెరగడంతో మోసగాళ్లు ఇన్సూరెన్స్​లను కూడా వదలట్లేదు. దాంతో చాలా మంది అమాయకులు బీమా(Insurance) స్కామ్​లతో తీవ్రంగా నష్టపోతున్నారు. మరి.. ఏంటీ బీమా స్కామ్​? వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

క్లెయిమ్ స్కామ్ : ఇది హెల్త్ ఇన్సూరెన్స్, వెహికిల్ ఇన్సూరెన్స్​ విషయంలో ఎక్కువగా జరుగుతుంది. ఈ స్కామ్​లో దొంగలు బాధితుడి సమాచారాన్ని సేకరించి, అతడి పేరుతో మోసపూరిత క్లెయిమ్‌లు చేయడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు మీరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే.. మీకు సహాయం చేస్తామని చెప్పి.. మీ బీమాకు సంబంధించిన పత్రాలను తీసుకుంటారు. వాటితో మీకు తెలియకుండానే క్లెయిమ్​ చేసుకుంటారు. కాబట్టి.. మీ ఆధార్ నంబర్‌, ట్రీట్మెంట్ రికార్డులు, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరికిపడితే వారికి ఇవ్వకూడదు. మీ ఈ-మెయిల్ అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. అనుమానాస్పదంగా వచ్చిన ఈ-మెయిల్ లింక్‌లపై క్లిక్ చేయకూడదు.

నకిలీ వాగ్దానాలు : మీరు ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు.. ఏజెంట్​ చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మొద్దు. ఏం జరిగినా.. మొత్తం మీ పాలసీ పరిధిలోకి వస్తుందని మాటలు చెబుతుంటారు. ఇలా చెబితే జాగ్రత్త వహించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. బీమా పాలసీలు కొన్ని మినహాయింపులను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా బీమా ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు.. కంపెనీ వెబ్‌సైట్ లేదా బ్రోచర్‌లో ఆ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోండి.

గుర్తింపు కార్డు అడగండి : బీమా ఏజెంట్ అంటూ మీకు చాలా మంది ఎదురుపడి.. పాలసీల గురించి వివరిస్తుంటారు. మరి.. వాళ్లు నిజంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లేనని మనం ఎలా నమ్మాలి? అంటే.. వాళ్ల ఐడీ కార్డును చూపించమని అడగాలంటున్నారు నిపుణులు.

తప్పుడు లెక్కలు : మీరు ఏదైనా బీమా పాలసీ తీసుకునేటప్పుడు.. తప్పనిసరిగా కంపెనీ స్టాండర్డ్ బ్రోచర్స్​లో డీటెయిల్స్ చూడాలి. సదరు బీమా కంపెనీ వెబ్‌సైట్​లోకి వెళ్లి సమాచారాన్ని చూసుకొని.. ఇతర కంపెనీలతో పోల్చి చూడాలి. ఏజెంట్లు చేత్తో రాసిన లెక్కలు చూసి నిజమేనని నమ్మకూడదు. అవి మోసపూరితమైనవి కావొచ్చు.

సరైన ఇన్సూరెన్స్ ఏజెంట్​ను ఎంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

నగదు చెల్లించకండి : ఇన్సూరెన్స్ ఫ్రాడ్​కు గురికాకూడదంటే.. బీమా ఏజెంట్లకు ప్రీమియం నగదు రూపంలో చెల్లించడం మానుకోండి. ఆన్​ లైన్​ విధానంలో చెల్లించండి. అదే సమయంలో కస్టమర్‌ కేర్​కు కాల్ చేసి.. చెల్లింపు సమాచారాన్ని ధృవీకరించుకోవాలి.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి : బీమా స్కామ్‌ల బారిన పడకుండా ఉండేందుకు.. పాలసీలను ఏజెంట్ ద్వారా కొనుగోలు చేయకపోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా మధ్యవర్తుల ఇబ్బంది ఉండదు.

పూర్తి డాక్యుమెంటేషన్ : ఆన్‌లైన్‌లో పాలసీ కొనుగోలు చేసేటప్పుడు.. మీ బీమా ఫారమ్‌లను పూర్తిగా నింపాలనే విషయాన్ని మరిచిపోవద్దు. ఒకవేళ ఏజెంట్ మీ ఫారమ్ నింపినప్పటికీ.. వ్యక్తిగత వివరాలకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నాయెమో మీరు ఓసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మీ పాలసీలపై సంతకం చేసే ముందు వాటిని జాగ్రత్తగా చదవాలి. అంతేకాదు.. మీ పాలసీ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు.

నష్ట జరిగితే.. : మీరు మోసానికి గురైతే.. త్వరగా చర్యలు తీసుకోవాలి. నష్టాన్ని వెంటనే బీమా సంస్థకు తెలియజేయాలి.

ఎల్​ఐసీ నయా ప్లాన్​తో డబుల్ బెనిఫిట్స్​ - జీవిత బీమా + సంపద వృద్ధి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.