ETV Bharat / business

మార్చి డెడ్​లైన్స్​ - గడువులోగా ఈ పనులన్నీ కంప్లీట్​ చేయాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 2:58 PM IST

Financial Deadlines In March 2024
Financial Deadlines In March 2024

Financial Deadlines In March 2024 : మరికొద్ది రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆధార్​ అప్​డేషన్​​, ఫాస్టాగ్​ కేవైసీ సహా, పలు డెడ్​లైన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంది. గడువులోగా వాటిని పూర్తి చేయకపోతే, తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Financial Deadlines In March 2024 : మరికొద్ది రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అంతకంటే ముందు ఈ మార్చి నెలలో పలు కీలక ఆర్థిక అంశాల గడువు ముగుస్తోంది. వాటిని సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఆ ఫైనాన్సియల్​ డెడ్​లైన్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్​ ఫ్రీ అప్​డేట్​కు​ చివరి తేదీ : చాలా ఏళ్లుగా ఎవరైతే ఆధార్​ వివరాలను అప్​డేట్ చేసుకోలేదో, వారు మార్చి 14లోపు ఉచితంగా అప్​డేట్​ చేసుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అవకాశం కల్పించింది. ఆధార్​ సంబంధిత మోసాలను నివారించడానికి ఇది తప్పనిసరి. ఒక వేళ ఈ గడువులోగా ఆధార్​ అప్​డేట్ చేసుకోకపోతే, తరువాత నుంచి ఆధార్​ అప్​డేట్​ కోసం అదనపు ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ డెడ్​లైన్
పేటీఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్లు తమ నగదును ఇతర బ్యాంకుల్లోకి ట్రాన్స్​ఫర్​ చేసుకునేందుకు ఆఖరు తేదీ మార్చి 15. ఒక వేళ గడువులోగా మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​లో ఉన్న డబ్బును ట్రాన్స్​ఫర్​ చేసుకోకపోతే, ఆ తరువాత డబ్బు జమ చేసుకోవడం, క్రెడిట్​ ట్రాన్షాక్షన్స్​ చేయడానికి అవకాశం ఉండదు.

నాలుగో విడత అడ్వాన్స్​ ట్యాక్స్​ పేమెంట్​ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, నాలుగో విడత అడ్వాన్స్​ ట్యాక్స్​ పేమెంట్​ చేసేందుకు ఆఖరు తేదీ మార్చి 15.

ట్యాక్స్​ సేవింగ్​ ఇన్వెస్ట్​మెంట్లు : ట్యాక్స్​ సేవింగ్​ ఇన్వెస్ట్​మెంట్లు చేసేందుకు మార్చి​ 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఈ తేదీలోగా ఇన్వెస్ట్​మెంట్లు చేస్తే, పన్ను ఆదా కావడానికి అవకాశం ఉంటుంది.

ఆదాయ పన్ను రిటర్నులు : 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, సవరించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు 2024 మార్చి 31. కనుక సదరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారులు, సవరించిన ఐటీఆర్​ను లేదా ఐటీఆర్​-యూను మార్చి 31లోపు సమర్పించుకోవచ్చు.

ఆదాయపు పన్ను షరతులు పాటించినట్లయితే, సంబంధిత అసెస్​మెంట్ సంవత్సరం ముగిసినప్పటి నుంచి రెండేళ్లలోపు అప్​డేట్​ చేసిన ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ ​చేసుకునే వెసులుబాటు ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్​ ఫైల్​ చేయనివారు ఈ మార్చి 31 లోపు దానిని దాఖలు చేయవచ్చు.

ఫాస్టాగ్​ అప్​డేట్​ : పేటీఎం ఫాస్టాగ్​ వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, నేషనల్​ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్​ అప్డేట్​ కోసం 2024 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. కనుక ఫాస్టాగ్ వినియోగదారులు ఈ గడువులోగా కేవైసీ (Know Your Customer) పూర్తి చేసుకోవాలి.

మీ కార్ ఇన్సూరెన్స్ ఎక్స్​పైర్ అయ్యిందా? సింపుల్​గా రెన్యువల్ చేసుకోండిలా!

ఇన్​స్టాంట్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.