ETV Bharat / business

'వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి నో ప్రమోషన్!'- ఐటీ కంపెనీ నయా షాక్!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 3:10 PM IST

Dell Says Remote Employees Not Eligible For Promotion : ప్రఖ్యాత ల్యాప్​టాప్​ బ్రాండ్​ 'డెల్' తమ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై అందరూ ఆఫీస్​కు వచ్చి పని చేయాలని స్పష్టం చేసింది. ఒక వేళ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికే ఇష్టపడితే, ఇకపై వారికి ప్రమోషన్​లు కల్పించేది లేదని తేల్చి చెప్పింది. దీనితో ఉద్యోగులు ఏమి చేయాలో తెలియక షాక్​లో ఉన్నారు.​

No More Work From Home For Dell Employees
Dell company message to employees

Dell Says Remote Employees Not Eligible For Promotion : మోస్ట్ పాపులర్​ ల్యాప్​టాప్​ బ్రాండ్​ 'డెల్' (DELL) తమ కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఇంటి వద్ద నుంచి పని చేసే ఉద్యోగులకు (వర్క్ ఫ్రమ్ హోమ్​) ఇకపై పదోన్నతులు కల్పించేది లేదని స్పష్టం చేసింది. ప్రమోషన్ కావాలని అనుకునే ఉద్యోగులు అందరూ ఇకపై కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందే అని ​తేల్చిచెప్పింది. దీనితో డెల్ ఉద్యోగులు ఏమీ చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు.

ల్యాప్​టాప్​ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ డెల్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. వాస్తవానికి కొవిడ్ సంక్షోభం కంటే, చాలా ముందు నుంచే డెల్ కంపెనీ హైబ్రీడ్​ వర్క్ కల్చర్​ను పాటిస్తూ వచ్చింది. అంటే ఉద్యోగులు కొద్ది రోజులు ఇంట్లో ఉండి పనిచేస్తారు. మరికొద్ది రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తన విధానాన్ని మార్చుకుంది. రిటర్న్-టు-ఆఫీస్​ (RTO) గురించి తెలుపుతూ ఫిబ్రవరిలో ఒక మెమో జారీ చేసింది.

డెల్​ జారీ చేసిన మెమో ప్రకారం, రిమోట్​గా (ఇంటి వద్ద నుంచి) పని చేసే ఉద్యోగులు కొనసాగుతారు. కానీ వారికి ప్రమోషన్​లు కల్పించారు. ఇలా కాకుండా హైబ్రీడ్​ విధానంలో కొందరు పనిచేస్తూ ఉంటారు. వీరు వారంలో కనీసం మూడు రోజులు డెల్​ అప్రూవ్డ్ ఆఫీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారికి ప్రమోషన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ పూర్తిగా ఇంటి వద్ద నుంచి పనిచేసే వారికి ప్రమోషన్లు ఉండవు. పైగా కంపెనీలోని ఇతర రోల్స్​ (ఉద్యోగాల)ల్లోకి మారడానికి కూడా అనుమతించరు.

అందరూ కలవరపడుతున్నారు!
డెల్ కంపెనీ ఇచ్చిన మెమోతో ఉద్యోగులు అందరూ తమ భవిష్యత్ గురించి కలవరపడుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉద్యోగి చెప్పాడు. ముఖ్యంగా చాలా కాలం నుంచి ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న ఉద్యోగులు, తాము ఇక ప్రమోషన్ పొందలేమని తెలుసుకుని చాలా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒక సీనియర్ డెల్ ఉద్యోగి మాత్రం భిన్నంగా స్పందించాడు. డెల్ కంపెనీ ఉద్యోగులు ఎక్కడి నుంచి పనిచేస్తారనేది పట్టించుకోదని, కేవలం వర్క్ గురించి మాత్రమే ఆలోచిస్తుందని తెలిపాడు.

గతం మరిచిన బాస్​
డెల్ కంపెనీ అధినేత మైఖేల్​ డెల్​ ఇంతకు ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇంటి వద్ద ఉండి పని చేయడం చాలా బాగుంటుందని పేర్కొన్నారు. అంతేకాదు ఆఫీసుకు వచ్చి పని చేయమని అడిగే కంపెనీలను తప్పుపట్టాడు కూడా. కానీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. డెల్ కంపెనీ ఉద్యోగులు అందరూ కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని మెమో జారీ చేయించాడు. దీని వల్ల ఉద్యోగులు కొత్త ఆలోచనలతో ముందుకు రాగలుగుతారని, ఫలితంగా కంపెనీ పనితీరు బాగా మెరుగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మిగతా కంపెనీలు కూడా ఇలానే చేస్తాయా?
ఉద్యోగులకు ఇది ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ, డెల్ కంపెనీ మాత్రం రిటర్న్​-టు-ఆఫీస్​ పాలసీకే కట్టుబడి ఉంది. తాజా పరిణామం టెక్ ప్రపంచాన్నే మార్చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్ కంపెనీలు డెల్​ను ఇన్స్​పిరేషన్​గా తీసుకుని, తమ ఉద్యోగులను కూడా ఆఫీస్​కి వచ్చి పనిచేయమని అడిగే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో!

సరైన ఇన్సూరెన్స్ ఏజెంట్​ను ఎంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

ఆర్థిక కష్టాల్లో ఆదుకునే బీమా పాలసీలు- ఇన్సూరెన్స్ రకాలు, వాటి​ ప్రయోజనాలేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.