ETV Bharat / business

కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా? ఈ టాప్​-6 టిప్స్​ మీ కోసమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 11:14 AM IST

Car Driving Tips For Beginners : మీరు కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా? లేదా ఇప్పుడిప్పుడే సొంతంగా కారు డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే ఈ టాప్-6 టిప్స్ మీ కోసమే.

Car Driving Techniques for Beginners
Car Driving Tips For Beginners

Driving Tips For Beginners : డ్రైవింగ్ అంటే వాహనాన్ని ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లడం కాదు, అంత‌కు మించి. డ్రైవింగ్ అనుకున్నంత సుల‌భం కాదు. కారు డ్రైవింగ్ చేయాలంటే ఏకాగ్రతతోపాటు, డైరెక్షన్స్ గురించి, ట్రాఫిక్ నియమాల గురించి పూర్తి పరిజ్ఞానం ఉండాలి. అందుకే కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న వాళ్లకు, ఇప్పుడిప్పుడే సొంతంగా కారు డ్రైవింగ్ చేస్తున్నవారికి ఉపయోగ‌ప‌డే 6 టిప్స్ గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

1. వాహనం గురించి పూర్తిగా తెలుసుకోండి!
మీరు కారు నడపడం ప్రారంభించే ముందు, దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. అది మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా, దాని గురించి అవ‌గాహ‌న పెంచుకోవాలి. ముఖ్యంగా కీ కంట్రోల్స్ అన్నింటి గురించి మీకు అవగాహన ఉండి తీరాలి. ఈ కీ కంట్రోల్స్​ ఎక్క‌డుంటాయి? ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి? అనే విష‌యాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవ‌స‌ర‌మైతే నిపుణుల సాయం తీసుకోవాలి. లేదా కారు మాన్యువ‌ల్​ని చ‌దివాలి.

2. కంఫర్టబుల్ పొజిషన్​లో కూర్చోవాలి!
డ్రైవింగ్ చేసేట‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం చాలా అవ‌స‌రం. అదే స‌మ‌యంలో సౌక‌ర్యవంతంగా కూర్చునే విష‌యంలోనూ రాజీ ప‌డ‌కూడ‌ద‌ని గుర్తుంచుకోండి. మీరు కారును స్టార్ట్ చేసే ముందు, మీ ఎత్తు, సౌకర్యానికి అనుగుణంగా సీటును సర్దుబాటు చేసుకోండి. అన్నివైపులా ఉన్న అద్దాలు స‌రిచూసుకోండి.

3. ప‌ర‌ధ్యానం వ‌ద్దు
కొందరు డ్రైవింగ్ చేసేట‌ప్పుడు ఫోన్ వాడ‌ట‌మో, సాంగ్స్ విన‌ట‌మో చేస్తారు. కానీ ఇది అన్ని వేళ‌లా మందిచి కాదు. ఇలా చేస్తే ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశ‌ముంది. అందుకే డ్రైవింగ్ స‌మ‌యంలో పరధ్యానంలో ఉండ‌కూడదు. అది ఫోన్ అయినా, మ్యూజిక్ అయినా, మీ ఏకాగ్ర‌తను దెబ్బతీసేది ఏదైనా, దానిని ప‌క్క‌న పెట్టాలి. మీరు కొత్తగా డ్రైవింగ్ చేయడం ప్రారంభిస్తే, అందులో నిపుణ‌త సాధించే వ‌ర‌కు మీ పక్కనే అనుభవజ్ఞుడైన డ్రైవర్‌ని కూర్చోబెట్టుకోవాలి.

4. అతివేగం అనర్థం
డ్రైవింగ్ స‌మ‌యంలో ట్రాఫిక్ రూల్స్ పాటించ‌డం ముఖ్యం. ట్రాఫిక్ సిగ్న‌ళ్లు, సంకేతాలు అనుసరించడమే కాదు. వేగ పరిమితులను కూడా కచ్చితంగా పాటించాలి. వాస్తవానికి స్పీడ్ లిమిట్స్​ దేశ‌దేశానికి మారుతాయి. అలాగే ప్రాంతాలను బట్టి కూడా స్పీడ్ లిమిట్స్ మారుతూ ఉంటాయి. కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ సైన్ బోర్డుల్ని కచ్చితంగా గమనిస్తూ ఉండాలి. వేగ ప‌రిమితుల్ని పాటించ‌డం వ‌ల్ల, మనమేకాదు, ఇత‌రులు కూడా ప్ర‌మాదాల బారిన ప‌డ‌కుండా చూసుకోవచ్చు.

5. ఆత్రుత, ఆందోళన వద్దు!
కొత్తగా కారు నడిపేవారికి కాస్త ఆత్రుతగా లేదా ఆందోళనగా ఉంటుంది. ఇది ఏమాత్రం మంచిదికాదు. అందుకే కారు నడిపేముందు కాస్త రిలాక్స్ అవ్వాలి. దీర్ఘశ్వాస తీసుకోవాలి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. దీని వల్ల టెన్షన్ తగ్గుతుంది. ఒంటరిగా కారు నడపేందుకు భయంగా ఉంటే, కారు డ్రైవింగ్​ తెలిసినవారిని తోడు తీసుకెళ్లండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రత లోపించినట్లు అనిపిస్తే, వెంటనే ఆపి విశ్రాంతి తీసుకోండి.

6. రద్దీ వేళల్లో డ్రైవింగ్ వద్దు!
మీరు ఇంకా​ నేర్చుకునే దశలోనే ఉంటే, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కారు డ్రైవింగ్ చేయకండి. రాత్రి స‌మ‌యాల్లోనూ డ్రైవింగ్ జోలికి వెళ్ల‌కండి. లైటింగ్ స‌మస్య‌తో డ్రైవ్ చేయడం కష్టంగా ఉంటుంది. పైగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే, మరోసారి డ్రైవింగ్ స్కూల్​కు వెళ్లండి. మీకు డ్రైవింగ్​పై పూర్తి పట్టు వచ్చేవరకు పట్టుదల విడవకండి.

మోస్ట్​ పవర్​ఫుల్​ బైక్​​ కొనాలా? ఈ టాప్​-5 టూ-వీలర్స్​పై ఓ లుక్కేయండి!

మీరు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్​​ కొన్నారా? ఈ టాప్​-7 మెయింటెనెన్స్ టిప్స్​ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.