ETV Bharat / business

యాపిల్ బిగ్ షాక్ - భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు - APPLE LAYOFFS

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 5:06 PM IST

Apple Layoffs 2024 : యాపిల్ కంపెనీ 614 మంది ఉద్యోగులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తొలగింపులు మే 27 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇంతకూ ఈ ఉద్యోగుల తొలగింపునకు కారణం ఏమిటంటే?

APPLE LAYs OFF 600 workers
APPLE LAYOFFS

Apple Layoffs 2024 : ప్రఖ్యాత టెక్ కంపెనీ యాపిల్ 600కు పైగా ఉద్యోగులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం తరువాత యాపిల్ కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి.

యాపిల్-లే ఆఫ్స్​
కాలిఫోర్నియాలోని 8 కార్యాలయాల్లో పనిచేస్తున్న మొత్తం 614 మంది ఉద్యోగులను తొలిగిస్తూ మార్చి 28న యాపిల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తొలగింపులు (లే ఆఫ్స్​) మే 27 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇటీవల కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్​మెంట్‌కు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ తొలగించిన ఉద్యోగులు ఏ డిపార్ట్​మెంట్ లేదా ఏ ప్రాజెక్ట్​కు చెందినవారో స్పష్టమైన సమాచారం లేదు.

కారణం అదేనా?
కరోనా సంక్షోభం వచ్చిన కాలంలో టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. కానీ తరువాత కంపెనీల వృద్ధి మందగించడం, లాభాలు తగ్గడం మొదలైంది. దీనితో ఖర్చులు తగ్గించుకోవడానికి, గత రెండేళ్లుగా తమ దగ్గర అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి.

అమెజాన్ కంపెనీ ఈ వారం ప్రారంభంలో తన క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ 'ఏడబ్ల్యూఎస్'​ నుంచి చాలా మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల వీడియో గేమ్స్​ మేకింగ్ కంపెనీ 'ఎలక్ట్రానిక్స్​ ఆర్ట్స్'​ సుమారుగా 5 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. సోనీ కంపెనీ తమ ప్లేస్టేషన్ డివిజన్​లోని 900 మంది ఉద్యోగులను, సిస్కో సిస్టమ్స్​ 4000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నాయి. అలాగే సోషల్ మీడియా కంపెనీ స్నాప్​ (స్నాప్​చాట్​) 10 శాతం మంది ఉద్యోగులను తొలగించునున్నట్లు స్పష్టం చేసింది.

ఇండియాలో 55వేల మంది ఐటీ ఉద్యోగుల తొలగింపు
భారత ఐటీ రంగంలోనూ ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్లలో దూకుడును తగ్గించాయి.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీలు 2.30 లక్షల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోగా, 2023-24లో ఆ సంఖ్య కాస్త తగ్గి 1.55 లక్షలకు చేరింది. కాస్త వెనక్కి వెళ్తే 2023-24లో దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య 10,669 తగ్గింది. ఇన్ఫోసిస్‌ కంపెనీలో అత్యధికంగా 24,182 మంది, విప్రోలో 18,510 మంది, హెచ్‌సీఎల్ టెక్‌లో 2,486 మంది ఉద్యోగులు తగ్గారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ నాలుగు దిగ్గజ ఐటీ కంపెనీలు దాదాపు 55వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి.

హోమ్​ లోన్ సకాలంలో చెల్లించలేకపోతున్నారా? ఇలా చేస్తే ఏ ఇబ్బందీ రాదు! - timely Home Loan EMI Repayments

బ్యాంక్​ ఖాతాదారులకు గుడ్ న్యూస్​ - త్వరలో యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్స్​! - UPI Cash Deposits in Bank Accounts

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.