ETV Bharat / bharat

ఇవాళ హైదరాబాద్​లో నాన్​ వెజ్​ బంద్​ కదా - ఎగ్​తో సూపర్ దమ్‌ బిర్యానీ ఇలా చేయండి - దుమ్ము లేపేయండి! - Spicy Egg Dum Biryani at Home

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 8:09 AM IST

Spicy Egg Dum Biryani at Home
Spicy Egg Dum Biryani at Home

Spicy Egg Dum Biryani at Home : ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌ వెజ్ ప్రియులు పండగ చేసుకుంటారు. కానీ.. ఈ సండే హైదరాబాద్​లో చికెన్, మటన్‌ దుకాణాలు తెరుచుకోవట్లేదు. కాబట్టి.. ఈ రోజున కోడి గుడ్లతో సూపర్​ దమ్‌ బిర్యానీ ఇలా చేసేయండి. ఫుల్లుగా లాగించేయండి.

Spicy Egg Dum Biryani : సండే వచ్చిదంటే చాలు దాదాపు అందరి ఇళ్లలోనూ నాన్‌వెజ్‌ వంటకాలు ఘుమఘుమలాడుతుంటాయి. కానీ, ఇవాళ జైనుల మహావీర్‌ జయంతి పండుగ ఉండటంతో.. హైదరాబాద్‌లో మాంసం అమ్మే దుకాణాలన్నీ మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో.. సండే ముక్క లేకపోతే ముద్ద దిగలేని వాళ్లు నిరుత్సాహానికి గురికాకుండా ఎగ్​తో సూపర్ దమ్ బిర్యానీ లాగించేయండి. ఎంతో రుచికరంగా ఉండే ఎగ్‌ దమ్‌ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఎగ్‌ దమ్‌ బిర్యానీకి కావల్సిన ప‌దార్థాలు :

  • గుడ్లు- 5 (ఉడికించి పెట్టుకోవాలి)
  • ఉల్లిపాయలు -1 కప్పు (బాగా సన్నగా కట్ చేసి నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి)
  • పచ్చిమిర్చి -5 లేదా 6
  • గరం మసాలా- 1tsp
  • టమాటాలు - 2
  • పెరుగు - 1/2 కప్పు
  • దాల్చిన చెక్క - చిన్నది
  • పసుపు - 1/4tsp
  • ధనియాల పొడి- 1tsp
  • కారం పొడి- 1tsp
  • షాజీరా - 1tsp
  • లవంగాలు - 4
  • యాలకులు- 2
  • మరాఠి మొగ్గ- 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 tsp
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర, పుదీనా తరుగు
  • నెయ్యి - కొద్దిగా
  • నూనె - 1/4కప్పు

ఎగ్‌ దమ్‌ బిర్యానీ తయారుచేసే విధానం:

  • ముందుగా మసాలాలు అన్నీ మిక్సీలో వేసుకుని మెత్తగా గరం మసాలా పొడిని రెడీ చేసుకోవాలి.
  • తర్వాత అర కేజీ బాస్మతీ రైస్‌ (2 గ్లాసులు) నానబెట్టి.. అందులోకి చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, ఒక టీ స్పూన్‌ షాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఉప్పు (రుచికి సరిపడినంత), 3 గ్లాసుల వాటర్‌, ఒక టీస్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కొద్దిగా కొత్తిమీర, పూదీనా వేసి రైస్‌ను 80 శాతం ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్‌పై బిర్యానీ గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్‌ వేయాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకుని ఉడికించుకున్న కోడిగుడ్లను ఆయిల్‌లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత మళ్లీ కొద్ది ఆయిల్‌ వేసి పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు కొద్దిగా.. ఉప్పు, కారం, ప్రిపేర్‌ చేసుకున్న గరం మసాలా, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి.
  • తర్వాత ఉడికించుకున్న రైస్‌ను వేసుకోవాలి.
  • రైస్‌పైన ఆయిల్‌లో ఫ్రై చేసిన ఆనియన్స్, కొద్దిగా నెయ్యి, సన్నగా కట్‌ చేసిన కొత్తిమీర, పూదీన వేసుకుని ఒక 15 నిమిషాలు సన్నని మంట మీద దమ్‌ పెట్టుకోవాలి.
  • అంతే ఇలా సింపుల్‌గా ఈజీగా ఎగ్‌ దమ్‌ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు.
  • ఇలా ఎగ్‌ దమ్‌ బిర్యానీ ఇంట్లో చేసుకుని తినడం వల్ల టేస్ట్‌తో పాటు, ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కోడి గుడ్డుతో 10 వెరైటీ రెసిపీస్ - మీరు ఎప్పుడూ టేస్ట్ చేయని రకాలు!

బంగాళాదుంపలు అంటే ఇష్టమా? ఈ టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే ఈజీగా పెంచుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.