ETV Bharat / bharat

రంజాన్​ మాసంలో కచ్చితంగా టేస్ట్​ చేయాల్సిన ఫుడ్స్​ ఇవే! - హలీమ్​తో పాటు నోరూరించేవి ఇంకెన్నో!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 5:25 PM IST

Ramadan
Ramadan Special Dishes

Ramadan Special Dishes : రంజాన్ మాసం వచ్చిందంటే చాలు వెంటనే గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్.. హలీమ్. అయితే ఇదొక్కటే కాదు.. రంజాన్​ నెలలో రుచి చూడాల్సిన మరికొన్ని స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అవి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తోంది! అవేంటో ఇప్పుడు చూద్దాం.

Ramadan Delicious Dishes : ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం స్టార్ట్ అయింది. మార్చి 11న (సోమవారం) సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్లు మతపెద్దలు ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు(రోజా) చేపట్టారు. నెలరోజుల పాటు ఈ పవిత్రమైన ఉపవాస దీక్షలు చేపట్టి ఆ తర్వాత ఈద్​-ఉల్​-ఫితర్​(రంజాన్​)ను ఘనంగా జరుపుకుంటారు.

ఇక రంజాన్​ మాసం(Ramadan 2024) అంటే..నోరూరించే హాలీమ్​ గుర్తొస్తుంది. అలా రోడ్డుపై వెళ్తుంటే.. హాలీమ్ ఘుమఘుమలతో ఆహార ప్రియులు ఉక్కిరిబిక్కిరవుతారు. అయితే రంజాన్ అంటే హాలీమ్ ఒక్కటే కాదు. దీనితో పాటు తప్పక రుచి చూడాల్సిన మరికొన్ని స్పెషల్ ఫుడ్స్ ఉన్నాయి. ఇంతకీ, రంజాన్​ నెలలో తినాల్సిన ఆ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నిహారి - కుల్చా : మీరు రంజాన్​ మాసంలో హాలీమ్​తో పాటు తప్పక తినాల్సిన ఫుడ్ ఐటమ్ నిహారి. హైదరాబాదీలు ఈ మాసంలో దీనిని చాలా ఇష్టంగా తింటారు. ఇక ఈ నిహారిని బీఫ్, మటన్​, చికెన్​ను ఎక్కువ సేపు ఉడికించి తయారుచేస్తారు. సాధారణంగా దీనిని కుల్చా లేదా రోటీతో కలిపి తింటారు. దీని టేస్ట్​ కూడా సూపర్​గా ఉంటుంది. ఇది ఎక్కువగా ఇరానీ హోటళ్లలో లభిస్తుంది.

పత్తర్ కా గోష్ట్ : ఇది కూడా రంజాన్​ మాసంలో తప్పక టేస్ట్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్. నిప్పు మీద వెడల్పాటి రాయిపై మటన్ ముక్కలు ఉంచి దీనిని తయారు చేస్తారు. మాంసం కలర్ లేత గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేడి చేస్తారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు యాడ్ చేయడంతో పాటు చివర్లో ఉల్లిపాయలు, చిటికెడు సున్నంతో వడ్డిస్తారు. చాలా హోటల్స్​లో ఈ ప్రత్యేకమైన వంటకం అందుబాటులో ఉంటుంది.

హలీమ్ : ఇది పరిచయం అక్కర్లేని పేరు. రంజాన్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్ ఇది. నగరంలో ఏ వీధినా చూసినా సెంటర్లు దర్శనమిస్తాయి. దీనిని చాలా మంది రంజాన్​ మాసంలో తప్పనిసరిగా టేస్ట్ చేస్తుంటారు. హాలీమ్​ను మాంసాన్ని(మటన్, బీఫ్ లేదా చికెన్) గోధుమలు, పప్పుదినుసులు, మసాలాలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్​తో కలిపి నెమ్మదిగా ఉడికించి తయారుచేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి అందిస్తారు. మీరు రంజాన్​ మాసంలో అనేక ప్రదేశాలలో ఎక్కడైనా ఈ వంటకాన్ని టేస్ట్ చేయవచ్చు.

రంజాన్‌ ఉపవాసం - షుగర్‌ పేషెంట్లు ఈ జాగ్రత్తలు పాటించాలి!

దహి వడ : దీనిని కూడా రంజాన్​ మాసంలో ఎక్కువ మంది ఆరగిస్తుంటారు. రంజాన్ స్పెషల్ వంటకంగా చెప్పుకునే దీనిని పెరుగులో వడను నానెబట్టి ప్రిపేర్ చేస్తారు. ఆపై తరిగిన కొత్తిమీర, దానిమ్మ, ఆమ్​చూర్(నేల మామిడి) పౌడర్​తో గార్నిష్ చేసి వడ్డిస్తారు. ఈ ఐటెమ్​ కూడా చాలా హోటళ్లలో లభిస్తుంది.

షాహి తుక్డా : మీరు రంజాన్ నెలలో రుచి చూడాల్సిన మరో ఫుడ్ ఐటమ్.. షాహి తుక్డా. దీనిలో కూడా అనేకమైన పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది ఈ ఫుడ్​ను ఇఫ్తార్​ విందుకు సరైన ముగింపుగా చెప్పుకుంటారు. దీనిని ఎలా తయారు చేస్తారంటే.. ముందుగా పాలు, చక్కెర, యాలకుల పొడి, బాదం, పిస్తా అన్ని వేసి మరిగిస్తారు. ఆ మిశ్రమం దగ్గరకు వచ్చాక అందులో నెయ్యిలో వేయించిన బ్రెడ్ ముక్కలు వేస్తారు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఇది లభిస్తుంది.

షీర్ ఖుర్మా : రంజాన్ నెలలో హలీమ్​తో పాటు ఎక్కువగా వినిపించే పేరు షీర్ ఖుర్మా. పాలు, ఎండు ఖర్జూరంతో ప్రిపేర్ చేసే ఈ వంటకం ఈద్ సమయంలోనే కాకుండా రంజాన్​లో కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఈద్​-ఉల్​-ఫితర్​ రోజు ఇది తాగనిదే అసలు పండగలా అనిపించదు. స్వీట్ అంటే ఇష్టపడే వారిని షీర్ ఖుర్మా చాలా బాగా ఆకట్టుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రంజాన్​ మాసంలో ఈ ఫుడ్ ఐటమ్స్​ను టేస్ట్ చేయండి.!

Hyderabadi Haleem : వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ హలీమ్.. తింటే వదలరంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.