ETV Bharat / bharat

10 రోజులు 12 రాష్ట్రాలు- 29 కార్యక్రమాలకు హాజరు- దేశంలో మోదీ సుడిగాలి పర్యటన

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 5:52 PM IST

PM Modi 10days Tour Across India
PM Modi 10days Tour Across India

PM Modi Tour Across India : లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. కేవలం 10 రోజుల్లో పలు రాష్ట్రాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

PM Modi Tour Across India : లోక్​సభ ఎన్నికల నగారా మోగడానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రానున్న 10 రోజుల్లో మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాల్లో హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ అజెండాగా పలు రాష్ట్రాల్లో రూ. లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, బంగాల్‌, బిహార్‌, జమ్మూకశ్మీర్‌, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీల్లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రధాని మోదీ పది రోజుల షెడ్యూల్ ఇదే

  • మార్చి 4 : తెలంగాణ అదిలాబాద్​లోని పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

అనంతరం తమిళనాడు కల్పకమ్​లో ఉన్న భారతీయ నభికియా విద్యుత్ నిగం లిమిటెడ్​ సందర్శించనున్నారు.

ఆదిలాబాద్​, చెన్నైల్లో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు.

  • మార్చి 5 : తెలంగాణలోని సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారు.

ఆ తర్వాత ఒడిశాకు వెళ్లి చండీఖోలేలో బహిరంగ సభలో మాట్లాడతారు.

  • మార్చి 6 : కోల్​కతాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బరాసత్​లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

తర్వాత బిహార్​కు వెళ్లి బెట్టియాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు.

  • మార్చి 7 : జమ్మూకశ్మీర్‌లో పర్యటించి సాయంత్రం తిరిగి దిల్లీకి చేరుకొని ఓ మీడియా ఈవెంట్‌లో పాల్గొంటారు
  • మార్చి 8 : దిల్లీలో తొలిసారిగా జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు.

అదే రోజు సాయంత్రం అసోంలోని జోర్హాట్​లో లెజెండరీ అహోం ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత జోర్హాట్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

అనంతరం అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించనున్నారు. అలాగే ఇటానగర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు.

ఆ తర్వాత బంగాల్​లోని సిలిగుఢిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

  • మార్చి 10 : ఉత్తరప్రదేశ్​లో పర్యటించి అజాంగఢ్‌లో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.
  • మార్చి 11 : ఆ మరుసటి రోజు దిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనంతరం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హరియాణా సెక్షన్‌ను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కార్యక్రమంలో పాల్గొంటారు.

  • మార్చి 12 : గుజరాత్‌లోని సబర్మతి, రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు.
  • మార్చి 13 : గుజరాత్‌, అసోంలో మూడు ముఖ్యమైన సెమీకండక్టర్ల ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేస్తారు.

బీజేపీ లోక్​సభ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్​- వారణాసి నుంచి మోదీ పోటీ

బీజేపీ ఆపరేషన్ 'క్లీన్అప్'- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 33మందికి నో టికెట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.