ETV Bharat / bharat

'రైతుల కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నాం'- అన్నదాతల నిరసన వేళ మోదీ కీలక వ్యాఖ్యలు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 3:22 PM IST

Updated : Feb 22, 2024, 5:19 PM IST

PM Modi Comments On Farmers : దిల్లీలో రైతుల నిరసన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందన్నారు. రైతుల జీవితాలను మెరుగుపరచడం పైనే తమ దృష్టి ఉందని చెప్పారు. ఈ మేరకు గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ ఫెడరేషన్‌-GCMMF స్వర్ణోత్సవాల సందర్భంగా లక్షమంది రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

PM Modi Comments On Farmers
PM Modi Comments On Farmers

PM Modi Comments On Farmers : రైతులు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా అమృత్ సరోవర్లను నిర్మించిందని తెలిపారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మోదీ చెప్పారు. ఈ దేశంలోని చిన్న సన్నకారు రైతులకు కూడా ఆధునిక సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ ఫెడరేషన్‌-GCMMF స్వర్ణోత్సవాల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో పశువుల పెంపకందారులు, రైతులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

"చిన్న రైతుల జీవితాన్ని మెరుగుపరచడం, పశుపోషణ పరిధిని పెంచడం, జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, గ్రామాల్లో పశుపోషణతో పాటు పిసికల్చర్, తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడంపైనే మా దృష్టి ఉంది. అందుకే మొట్ట మొదటిసారిగా మేము పశువుల, చేపల పెంపకందారులకు కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని అందించాము. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు మా ప్రభుత్వం రైతులకు ఆధునిక విత్తనాలను అందించింది."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

'అమూల్ ఆ స్థాయికి చేరుకోవాలి'
అమూల్‌ బ్రాండ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల కంపెనీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో పాడి పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ వృద్ధి రేటు రెండు శాతం ఉండగా దేశంలో ఆరు శాతమని చెప్పారు. ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్న గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ప్రపంచంలో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అందుకు కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందని, ఇది మోదీ గ్యారెంటీ అని ప్రధాని చెప్పారు. దేశంలో పాడి పరిశ్రమ మొత్తం టర్నోవర్‌ రూ.10 లక్షల కోట్లు అని వరి, గోధుమ, చెరకు ఉత్పత్తులు మొత్తం కలిపినా అంతకాదని ప్రధాని మోదీ వెల్లడించారు.

కాంగ్రెస్​కు మోదీ చరుకలు
మెహసానా జిల్లాలో వాలినాథ్‌ మహాదేవ్‌ ఆలయానికి ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాముని జన్మస్థానం అయోధ్యలో మహా ఆలయాన్ని నిర్మిస్తే దేశ ప్రజలంతా సంతోషించగా, నెగెటివిటితో జీవించే కొందరు మాత్రం విద్వేష మార్గాన్ని వీడటం లేదంటూ కాంగ్రెస్‌ పేరు ప్రస్తావించకుండా ఆ పార్టీకి చురకలంటించారు. 'మందిరాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు. కేవలం పూజలు చేయటానికి మాత్రమే కాదు. వేలాది సంవత్సరాల సంస్కృతికి, వారసత్వానికి ప్రతీకలు. మందిరాలు విజ్ఞాన కేంద్రాలుగా బాసిల్లాయి. దేశాన్ని, సమాజాన్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లటానికి మాధ్యమాలుగా ఉన్నాయి. వాలినాథ్‌ ధామం విద్య, సమాజ ఉద్ధరణ అనే పవిత్ర వారసత్వాన్ని పూర్తి నిష్ఠతో ముందుకు తీసుకెళ్లింది.' అని ప్రధాని మోదీ తెలిపారు.

'రైతు మృతి బాధాకరం- చర్చలు కొనసాగించాలి'- కేంద్రానికి వెంకయ్య విజ్ఞప్తి

కాంగ్రెస్, ఆప్ మధ్య డీల్​ ఫైనల్- దిల్లీలో ఎవరికెన్ని సీట్లంటే?

Last Updated :Feb 22, 2024, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.