ETV Bharat / bharat

ఏఐ టీచర్​ 'ఐరిస్'​- ఏ ప్రశ్నకైనా 10సెకన్లలో జవాబు- పిల్లలకు ఫేవరేట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 4:32 PM IST

AI Teacher Iris Kerala
AI Teacher Iris Kerala

Kerala School AI Teacher : కృత్రిమ మేధ చాట్​ జీపీటీ ఆధారంగా ఓ ఏఐ టీచర్​ను రూపొందించింది ఓ స్టార్టప్ సంస్థ. కేరళ తిరువనంతపురంలోని కల్లంబలం కేటీసీటీ పాఠశాలలోని అటల్​ టింకరింగ్ ల్యాబ్​లో ఈ ఏఐ టీచర్​ను సృష్టించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేవలం 10 సెకన్లలోనే సమాధానాలు ఇస్తూ ఆశ్చర్య పరుస్తుంది. ఈ ఏఐ టీచర్​ కథేంటో తెలుసుకుందా రండి.

Kerala School AI Teacher : ఆ పాఠశాలకు వెళ్లి మీ ఫేవరేట్ టీచర్​ ఎవరని అడిగితే అందరూ ఐరిస్​ మేడమ్​ పేరే చెబుతారు. అందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? ఆవిడ టీచరే కానీ, మనిషి కాదు. ఆమె ఓ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించిన ఉపాధ్యాయురాలు. విద్యార్థులకు పాఠ్యేతర కార్యక్రమాల్లో భాగంగా అటల్​ టింకరింగ్​ ల్యాబ్​లో ఈ ఏఐ టీచర్​ను రూపొందించారు. కేరళ తిరువనంతపురంలోని కల్లంబలం కేటీసీటీ పాఠశాలలో మేకర్స్​ ల్యాబ్​ అనే ఓ అంకుర సంస్థ దీనిని తయారు చేసింది. పాఠశాలలో ఏఐ టీచర్​ను ప్రవేశపెట్టడం కేరళలో ఇదే తొలిసారని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

AI Teacher Iris Kerala
విద్యార్థికి షేక్ హ్యాండ్​ ఇస్తున్న ఏఐ టీచర్​

ఏ ప్రశ్నకైనా 10సెకన్లలో జవాబు
విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేవలం 10 సెకన్లలోనే సమాధానం చెబుతోందీ ఏఐ టీచర్​. ఇంగ్లిష్​తో పాటు హిందీ, మలయాళం భాషల్లోనూ సమాధానాలు ఇస్తోంది. విద్యార్థుల్లో పాఠ్యేతర కార్యక్రమాలను పెంచడం కోసం నీతి ఆయోగ్​ అటల్​ టింకరింగ్​ ల్యాబ్​ అనే ప్రాజెక్ట్​ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగానే విద్యార్థులకు సాంకేతిక సహయాన్ని అందించే మేకర్స్ ల్యాబ్​ అనే స్టార్టప్​ సంస్థ దీనిని రూపొందించింది. దీనిని తయారు చేయడానికి సుమారు రూ.లక్ష ఖర్చు అయినట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇందులో అనేక మంది విద్యార్థులు సైతం పాలుపంచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఏఐ టీచర్​ను మరింత మెరుగ్గా పని చేసే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. గందరగోళ పరిస్థితుల్లోనూ ప్రశ్నలను స్పష్టంగా వినగలిగేలా కొన్ని మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.

కెమెరా ఆధారంగా ఎవరు ప్రశ్నిస్తున్నారని గమనించి వారికే సమాధానం ఇస్తుంది ఏఐ టీచర్​. దీంతో పాటు ప్రశ్న అడిగిదే విద్యార్థా? లేక ఉపాధ్యాయుడా? అన్న విషయాన్ని సైతం గుర్తించి జవాబు ఇస్తుంది. ఐరిస్​ పూర్తిగా చాట్​ జీపీటీ ఆధారంగా పనిచేస్తుంది. మన వాయిస్​ను గుర్తించిన తర్వాత, గూగుల్​ కన్వర్షన్​ ఆధారంగా ప్రాసెస్​ చేసుకుని సమాధానం ఇస్తుంది. ఇది కేవలం మాట్లాడడమే కాకుండా ముందుకు, వెనక్కు కూడా కదులుతుంది​. చక్రాల సాయంతో కదులుతూ షేక్​ హ్యాండ్​ సైతం ఇస్తుంది. బ్లూటూత్​ ఆధారంగా ఈ చక్రాల కదులుతాయని మేకర్స్ ల్యాబ్​ ప్రతినిధులు తెలిపారు. వచ్చే నెల రోజుల్లో ఇతర పాఠశాలల్లో సైతం ఈ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

Robot Teacher: విద్యార్థులకు పాఠాలు చెప్పే 'రోబో టీచర్'​

అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా రోబోలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.