ETV Bharat / bharat

Robot teacher: విద్యార్థులకు పాఠాలు చెప్పే 'రోబో టీచర్'​

author img

By

Published : Dec 13, 2021, 12:58 PM IST

Updated : Dec 13, 2021, 2:34 PM IST

Robot Teacher: కరోనా కారణంగా పాఠశాలలు నిర్వహించడం కష్టమైపోయింది. ఈ క్రమంలో కేరళ కన్నూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో రోబో అన్నీ పనులను చక్కబెడుతోంది. ఇంతకీ.. ఏయే పనులను ఎలా చేస్తుందో ఓసారి చూసేద్దామా..?

robot teacher
రోబో టీచర్​

విద్యార్థులకు పాఠాలు చెప్పే 'రోబో టీచర్'​

Robot Teacher In Kerala: కొవిడ్ ఆంక్షల తర్వాత కేరళలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వెళ్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలుకుతున్నారు. అయితే.. కన్నూర్ జిల్లాలోని మంబరం కిళత్తూరు స్కూల్‌లో విద్యార్థులకు మాత్రం రోబో టీచర్​ స్వాగతం పలుకుతోంది. పిల్లలు రాగానే ఉష్ణోగ్రత పరీక్షించి వారి యోగక్షేమాలను చూసుకుంటోంది. కొవిడ్ ప్రొటోకాల్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది.

robot teacher
ఉష్టోగ్రత పరీక్షిస్తున్న రోబో

robot teacher news: రాగేష్ అనే ఉపాధ్యాయుడు.. విద్యార్థుల కోసం ఈ స్మార్ట్ టీచర్‌ను అభివృద్ధి చేశారు. స్కూల్​ విద్యార్థులకు స్వాగతంతో.. రోబో టీచర్​ పని ప్రారంభమవుతుంది. రోజూ ప్రతి విద్యార్థి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలను మాత్రమే తరగతి గదిలోకి అనుమతిస్తుంది. విద్యార్థుల హాజరును రికార్డ్ చేస్తుంది. ఈ రోబో టీచర్ క్లాసులు కూడా తీసుకుంటుంది.

robot teacher
రోబో

పిల్లలు శుభ్రంగా, క్రమశిక్షణగా ఉండేలా ఈ స్మార్ట్ టీచర్ పర్యవేక్షిస్తుంది. మద్యం సేవించి లోనికి ప్రవేశించినవారికి రెడ్ సిగ్నల్ ఇచ్చి బయటకు పంపిస్తుంది. దీంతో విద్యార్థులకు ఈ రోబో.. ఇష్టమైన టీచర్‌గా మారింది.

robot teacher
పాఠాలు చెబుతున్న రోబో

ఇదీ చదవండి: National helpline for SC ST: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధానికి 14566

'రక్తదానం చేసిన వారికి 2కిలోల చికెన్, అరకిలో పనీర్​'

Last Updated :Dec 13, 2021, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.