ETV Bharat / bharat

టికెట్ కన్ఫామ్ అయితేనే డబ్బులు కట్- IRCTC నయా ఫీచర్- బుకింగ్స్ మరింత ఈజీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 10:55 AM IST

IRCTC iPay Autopay
IRCTC iPay Autopay

IRCTC iPay Autopay : రైల్వే టికెట్​ బుకింగ్​లో ఇబ్బందా? టికెట్ కన్ఫామ్​ కాకముందే డబ్బులు కట్ అవుతున్నాయా? రిఫండ్ వెంటనే రావడం లేదా? అయితే మీ కథనం మీ కోసమే. డబ్బులు కట్​ కాకుండా వెయిట్​లిస్ట్​, తత్కాల్ టికెట్లను ఇట్టే బుక్​ చేయొచ్చు. ఒకవేళ మీ టికెట్ బుక్​ కాకముందే డబ్బులు కట్ అయితే ఈ ఫీచర్​తో వెంటనే డబ్బులు రిఫండ్ అవుతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC iPay Autopay : మన దేశంలో రైల్వే టికెట్​లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం సవాలుతో కూడుకున్న పని. కొన్నిసార్లు, రైలులో మనకు నచ్చిన సీట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. మరో సమయంలో బుకింగ్ విఫలం కావచ్చు. అప్పుడు టికెట్​ను పొందకుండానే మన డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. ఇక ఆ రుసుం తిరిగి వచ్చే విధానం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎక్కువ సమయం పడుతుంది.

అయితే ఈ సమస్యలన్నింటికీ సమాధానంగా ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌), 'ఐపే ఆటోపే'(IRCTC iPay Autopay) అనే కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఛార్జీ చెల్లించకుండానే మనం టికెట్ బుక్​ చేసుకోవచ్చు. బుకింగ్ కన్ఫామ్​ అయిన తర్వాత డబ్బులు చెల్లించొచ్చు. తద్వారా టికెట్​ బుక్​ కాని పరిస్థితుల్లో మనం డబ్బులు కోల్పోయే పరిస్థితి ఉండదు. మరి ఆ ఫీచర్ ఏంటి? దాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

'ఐపే ఆటోపే' అంటే ఏమిటి?
'ఐపే ఆటోపే' అనేది ఒక పేమెంట్ ఆప్షన్. ఇది ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​, యాప్​లో అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సీటీసీ సొంత పేమెంట్​ గేట్​వే అయిన ఈ iPay, యూపీఐ, క్రెడిట్/ డెబిట్ కార్డ్స్, ఐఆర్​సీటీసీ ముద్ర, నెట్​ బ్యాంకింగ్ వంటి వివిధ పేమెంట్​ విధానాలతో టికెట్ డబ్బులు చెల్లించే అవకాశం కల్పిస్తోంది.

iPay ఎలా పనిచేస్తుంది?
iPay పేమెంట్ గేట్​వేకు ఉన్న ప్రత్యేక ఫీచర్ ఆటోపే. దీని ద్వారా ఎక్కువ విలువ కలిగిన లేదా వెయిట్ లిస్ట్​లో ఉన్న టికెట్​లను బుక్​ చేయొచ్చు. మీరు టికెట్​లు బుక్​ చేసినప్పుడు ఈ 'ఆటోపే' ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. అయితే, టికెట్ బుక్ చేసినా మన ఖాతాలో నుంచి డబ్బులు బదిలీ అవ్వవు. మన బ్యాంక్ ఖాతాలో ఉన్న టికెట్​ ఛార్జీ మొత్తంపై లైయెన్ (lien- మీ అకౌంట్​లోని డబ్బు వేరే చోట ఖర్చు చేయకుండా నియంత్రణ) విధిస్తుంది. మన టికెట్ కన్ఫామ్​ కాకపోయినా, క్యాన్సిల్ అయినా మన డబ్బులపై ఉన్న నియంత్రణ తొలగిపోతుంది.

ఈ సందర్భాల్లో ఉపయోగపడుతుంది

  • వెయిట్​ లిస్ట్​ (IRCTC Waitlist) : మీరు వెయిట్​లిస్ట్​లో ఉన్న టికెట్ బుక్ చేసినప్పుడు, అది కన్ఫామ్ కాకపోతే మీ డబ్బులు కట్​ అవ్వవు. ఆటోపే నియంత్రణ తొలగిపోవడం వల్ల మీరు మీ డబ్బులను ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.
  • వెయిట్ లిస్ట్ తత్కాల్ (IRCTC Waitlist Tatkal) : తత్కాల్ కోటాలో వెయిల్​లిస్ట్​లో ఉన్న టికెట్​ బుక్​ చేసినప్పుడు, ఒకవేళ అది కన్ఫామ్ కాకపోతే, మీరు కేవలం క్యాన్సలేషన్ ఫీజు, ఐఆర్​సీటీసీ కన్వీనియెన్స్ ఫీజు, మాండేట్ ఛార్జీలు వంటివి కట్టాల్సి ఉంటుంది. మిగతా డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది.
  • ఇన్​స్టంట్ రిఫండ్ (IRCTC Instant refund) : వెయిట్​లిస్ట్​లో ఉన్న టికెట్ బుక్​ చేసినప్పుడు అవి కన్ఫామ్​ కాకపోతే మన డబ్బులు వెంటనే రిఫండ్ అవుతాయి. దీనికోసం మనం 3-4 రోజులు వేచిచూడాల్సిన అవసరం లేదు.

'ఆటోపే' ఇలా చేయండి

  • ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​లో లాగిన్​ అయ్యి, మీ ప్రయాణ వివరాలను నమోదు చేయాలి.
  • అందులో మీ రైలు, కోచ్​, ప్రయాణికుల వివరాలను నమోదు చేయాలి.
  • ఆ తర్వాత పేమెంట్ బటన్​పై క్లిక్​ చేసి iPayను పేమెంట్ గేట్​వేలా సెలెక్ట్​ చేసుకోవాలి.
  • అనంతరం Autopay, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఐఆర్​సీటీసీ ముద్ర, నెట్​బ్యాంకింగ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • Autopay ఆప్షన్​తో పాటు పేమెంట్ విధానం (యూపీఐ, డెబిట్/ క్రెడిట్ కార్డ్) ఎంపిక చేయాలి.
  • పేమెంట్ వివరాలు నమోదు చేస్తే మీ లావాదేవీ పూర్తవుతుంది. వెంటనే మీ బ్యాంకు, టికెట్ డబ్బులపై నియంత్రణ విధిస్తుంది. టికెట్ బుక్​ కాగానే మన ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి.

ట్రైన్​ జర్నీలో ఇబ్బందులా? ఈ టోల్​ ఫ్రీ నంబర్​కు ఒక్క కాల్​ చేస్తే వెంటనే పరిష్కారం!

టికెట్​ బుకింగ్​కు ఈమెయిల్​, ఫోన్ నంబర్ వెరిఫికేషన్ మస్ట్​!- IRCTC కొత్త అప్డేట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.