ETV Bharat / bharat

సిట్ అదుపులో హెచ్​డీ రేవణ్ణ- ముందస్తు బెయిల్​ పిటిషిన్​ కొట్టేసిన కోర్టు - hasan sex scandal

author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 7:24 PM IST

Updated : May 4, 2024, 7:51 PM IST

Hasan Sex Scandal
Hasan Sex Scandal(Etv Bharat)

Hasan Sex Scandal : మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్​డీ రేవణ్ణను సిట్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కిడ్నాపింగ్ కేసును నమోదు చేశారు. ఇంతకు ముందు ఆయన ముందస్తు బెయిల్​కు అప్లై చేయగా, దానిని బెంగళూరు కోర్ట్ తిరస్కరించింది.

Hasan Sex Scandal : హసన్​ సెక్స్​ కుంభకోణంలో ప్రధాన నిందితునిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్​ ఎమ్మెల్యే హెచ్​డీ రేవణ్ణను (ప్రత్యేక దర్యాప్తు బృందం) సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళను అపహరణ చేసినట్లు ఆయనపై కిడ్నాపింగ్ కేసు నమోదు చేశారు. ఇంతకు ముందు ఆయన ముందస్తు బెయిల్​ కోసం బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిని బెంగళూరు సెషన్​ కోర్టు తిరస్కరించింది.

కిడ్నాపింగ్​ ఫిర్యాదుతో కేసు నమోదు
తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని, రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీనితో బెంగళూరులోని కేఆర్​ నగర్‌ పోలీస్​స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ముందుస్తు బెయిల్ కోసం శుక్రవారం బెంగళూరు సెషన్‌ కోర్టులో రేవణ్ణ పిటిషన్‌ దాఖలు చేశారు. ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో, తాజాగా హెచ్​డీ రేవణ్ణను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. తన కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణల కేసుకు సంబంధించి కూడా సిట్‌ అధికారులు రేవణ్ణను విచారించనున్నట్లు సమాచారం.

లుక్​అవుట్ నోటీస్​
హెచ్​డీ రేవణ్ణ విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇటీవలే హెచ్​ డీ రేవణ్ణ, ప్రజ్వల్​ ఇద్దరినీ విచారణకు పిలిచింది. అయితే, తనకు కొంత సమయం కావాలని ప్రజ్వల్‌ రేవణ్ణ కోరారు. ఇందుకు తిరస్కరించిన అధికారులు ఆయనపై లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేశారు. దీనితో ఆయన ప్రజ్వల్‌ దేశం విడిచి జర్మనీకి వెళ్లిపోయారు.

బ్లూకార్నర్ నోటీస్​
దేశం విడిచి వెళ్లిపోయిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్​ రేవణ్ణను పట్టుకునేందుకు 'బ్లూకార్నర్ నోటిస్' జారీ చేసే అవకాశం ఉంది. సెక్స్​ కుంభకోణంలో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఆయనను భారత్​కు తిరిగి రప్పించేందుకు బ్లూకార్నర్ నోటీస్ జారీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

'మహిళను కట్టేసి అత్యాచారం'- ప్రజ్వల్​ రేవణ్ణ సెక్స్​ రాకెట్​లో మరో ఫిర్యాదు - Prajwal Revanna Sex Scandal

గోద్రా అల్లర్లపై మోదీ కీలక వ్యాఖ్యలు- మూడో విడత వేళ ప్రతిపక్షాలపై ఫుల్​ ఫైర్​! - lok sabha election 2024

Last Updated :May 4, 2024, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.