ETV Bharat / bharat

20ఏళ్లుగా ఎన్నికల్లో 'గ్యాస్​ డెలివరీ' బాయ్ పోటీ- పేదల కోసమే మరోసారి బరిలోకి! - Gas Vendor Contesting Elections

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 10:15 AM IST

Gas Vendor Contesting Elections For 20 Years
Gas Vendor Contesting Elections For 20 Years

Gas Delivery Boy Contesting Elections For 20 Years : సాటి మనిషికి సహాయ పడాలనే ఆలోచన, అలుపెరుగని పట్టుదల, ఓడినా వెనకడుగు వేయని ఆత్మస్థైర్యం, ఇవన్నీ ఓ సాధారణ గ్యాస్​ డెలివరీ బాయ్​ 20 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణమయ్యాయి. ఒక్కసారి కూడా గెలవకపోయినా కష్టపడి మళ్లీ మళ్లీ బరిలోకి దిగేలా చేశాయి. పేదల కన్నీళ్లు తుడవడమే తన ధ్యేయం అంటున్న ఆ గ్యాస్​ డెలివరీ బాయ్​ ఎవరు? ఆయన కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Gas Delivery Boy Contesting Elections For 20 Years : గ్యాస్​ డెలివరీ చేసే ఓ వ్యక్తి గత 20 ఏళ్లుగా లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఓడిపోయినా గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నారు. కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీనికి ఆయన భార్య పశు పోషణ చేస్తూ మద్దతు ఇస్తోంది. 2004వ సంవత్సరంలో తొలిసారిగా పోటీ చేసిన ఆ వ్యక్తి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలో లోక్​సభ జరగనున్న సందర్భంగా, పేద కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ గ్యాస్​ డెలివరీ బాయ్​ ఇన్నిసార్లు పోటీ చేయడం వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Gas Delivery Boy Contesting Elections For 20 Years
రిక్షాపై ఛోటేలాల్

23 ఏళ్లకే
బిహార్​లోని కిషన్​గంజ్​కు చెందిన ​ఛోటేలాల్ మహతో గ్యాస్​ డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నారు. ఆయన గ్యాస్​ డెలివరీ చేస్తూనే, నిస్సహాయులకు సహాయం చేసేవాడు. ఛోటేలాల్​లోని సేవా గుణాన్ని గమనించిన స్థానికులు ఎన్నికల్లో పోటీ చేయాలని సలహా ఇచ్చారు. దీంతో 2000వ సంవత్సరంలో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఛోటేలాల్​కు 23 ఏళ్ల వయసే. అయితే వయసు తక్కువగా ఉండటం వల్ల నామినేషన్​ రద్దు చేశారు.

Gas Delivery Boy Contesting Elections For 20 Years
ఛోటేలాల్ ఇల్లు

ఆ తర్వాత 2004లో మొదటిసారిగా లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేశారు ఛోటేలాల్. ఈ ఎన్నికల్లో 11,479 ఓట్లతో ఆరో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2009లో 5,563 ఓట్లతో తొమ్మిదో స్థానంలో, 2014లో 11,392 ఓట్లతో తొమ్మిదో స్థానంలో, 2019లో 8,700 ఓట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా కిషన్​గంజ్​ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు ఛోటేలాల్.

మహామహులపై పోటీ!
2004 నుంచి 2019 మధ్య ప్రముఖ రాజకీయ నాయకులకు ప్రత్యర్థిగా బరిలోగి దిగారు. అందులో కేంద్ర మాజీ మంత్రి సయ్యద్​ షానవాజ్​ హుస్సేన్, తస్లీముద్దీన్‌లతో సహా పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు గెలవకపోయినా పట్టు వదల్లేదు ఛోటేలాల్.

Gas Delivery Boy Contesting Elections For 20 Years
గ్యాస్​ సిలిండర్​ మోస్తున్న ఛోటేలాల్

"2004 నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. గెలవకపోయినా ఎప్పటికీ ప్రయత్నాన్ని వదల్లేదు. ఈసారి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. ప్రజలు చాలా సహాయం చేస్తున్నారు. విరాళాలు ఇస్తున్నారు. నాలాంటి నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారు. ఈసారి తప్పకుండా విజయం సాధిస్తాను. ప్రజలు తమ ఓట్లతో విజయాన్ని చేకూరుస్తారు."

-ఛోటేలాల్ మహతో, స్వతంత్ర అభ్యర్థి కిషన్‌గంజ్ లోక్‌సభ

కష్టపడి కూడబెట్టిన డబ్బునే ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తానని ఛోటేలాల్​ చెప్పారు. ప్రజలు విరాళాలు ఇస్తారని, తన భార్య కూడా మేకలు, కోళ్ల పెంపకం ద్వారా వచ్చిన డబ్బుతో మద్దతిస్తుందని తెలిపారు. అయితే కష్ట సమయంలో ప్రజలు తమకు అండగా ఉంటారని ఛోటేలాల్​ కుటుంబం భావిస్తోంది. ఒకసారి తనకు తప్పకుండా ప్రజలు అవకాశం ఇస్తారని ఛోటేలాల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మానవసేవే తన ప్రాధాన్యమని చెప్పిన ఛోటేలాల్​, గెలిచిన తర్వాత పేదల కన్నీళ్లు తుడవడం సహా అభివృద్ధి, పేదలకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానని చెబుతున్నారు.

Gas Delivery Boy Contesting Elections For 20 Years
గ్యాస్​ సిలిండర్​ మోస్తున్న ఛోటేలాల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.