ETV Bharat / bharat

విదేశీయుడిని బెదిరించి క్యాబ్​ డ్రైవర్​ రూ.3.5 లక్షలు లూటీ- నెల రోజులుగా బిచ్చగాళ్లతోనే డచ్​ టూరిస్ట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 8:22 AM IST

Updated : Mar 2, 2024, 9:31 AM IST

Dutch Tourist Robbed By Cab Driver
Dutch Tourist Robbed By Cab Driver

Dutch Tourist Robbed By Cab Driver : భారత పర్యటనకు వచ్చిన విదేశీ వ్యక్తిపై ఓ ట్యాక్సీ డ్రైవర్ దాడి చేసి విలువైన వస్తువులను దోచుకెళ్లాడు. దీంతో స్వదేశానికి తిరిగి వెళ్లలేక బిచ్చగాళ్ల దగ్గర నెల రోజుల పాటు బస చేశాడు. మీడియా ద్వారా వెలుగులో వచ్చిన ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

Dutch Tourist Robbed By Cab Driver : భారత్​కు వచ్చిన నెదర్లాండ్స్ పర్యటకుడిపై ఓ ట్యాక్సీ డ్రైవర్​ దాడి చేసి నగదుతో పాటు విలువైన వస్తువులను దొచుకున్నాడు. దీంతో స్వదేశానికి తిరిగి వెళ్లడానికి డబ్బులు లేక నెల రోజుల నుంచి బిచ్చగాళ్ల షెల్టర్​ హోమ్​లో బస చేశాడు. ఈ విషయం మీడియా ద్వారా బయటకు రావటం వల్ల ప్రభుత్వం స్పందించింది. ఇప్పుడు అతడిని నెదర్లాండ్స్​కు పంపించే ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ జరిగింది
నెదర్లాండ్స్​కు చెందిన ఆంథోనీ వాన్​ ఆర్కెల్​(72) అనే వ్యక్తి జనవరిలో ఒడిశాలోని పూరీకి వచ్చాడు. జనవరి 9న క్యాబ్​లో భువనేశ్వర్​ వెళ్లి తన దగ్గర ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకుని భితార్కానికాకు బయలుదేరాడు. మార్గ మధ్యలో కారు డ్రైవర్​ తన దగ్గర ఉన్న సుమారు రూ. 3.5 లక్షలను నగదును దోచుకున్నాడని ఆంథోనీ తెలిపాడు. 'ఈ విషయంపై నేను డ్రైవర్​తో గొడవ పడ్డాను. దీంతో ఆ డ్రైవర్ నన్ను తీసుకెళ్లి తన ఇంట్లో మూడు రోజుల పాటు బంధించాడు. ఆ తర్వాత ధోలే పాండా అనే ప్రాంతంలో వదిపెట్టాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను కొంత మంది యువకులు రక్షించారు. వాళ్ల సాయంతోనే నేను పూరీకి తిరిగి వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల నేను జనవరి 25 నుంచి మార్చి1 వరకు బిచ్చగాళ్ల షెల్టర్​ హోమ్​లో ఉండాల్సి వచ్చింది.' అని ఆంథోనీ చెప్పాడు.

అతిథి గృహంలో బస
మీడియాలో ఈ విషయం రావటం వల్ల జిల్లా యంత్రాంగం స్పందించి రాష్ట్ర అతిధి గృహంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేసిందని ఆంథోనీ తెలిపారు. 'నాకు ఇండియా అంటే చాలా ఇష్టం, భారతదేశంలో నాకు ఇది ఆరో పర్యటన. నాకు ప్రకృతి, దేవాలయాలు అంటే ఇష్టం. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరగవచ్చు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మీడియా, రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. ఇప్పటికీ భారతదేశంపై ఉన్న ఇష్టం అలాగే ఉంది' అని ఆంథోనీ అంటున్నాడు.

పరారీలో ట్యాక్సీ డ్రైవర్
మరోవైపు ఆంథోనీని తిరిగి నెదర్లాండ్స్​కు పంపించేందుకు సన్నాహాలు ప్రారంభించింది ప్రభుత్వం. ఈ ఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పూరీ ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు. "నిందితుడిని గుర్తించాము. ప్రస్తుతానికి డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ట్యాక్సీని మాత్రం స్వాధీనం చేసుకున్నాం. త్వరలోనే నిందితుడి పట్టుకుంటాం. అయితే ఆంథోనీని స్వదేశీ పంపించేందుకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం నెదర్లాండ్స్​ ఎంబసీని సంప్రదించింది. ఆర్థిక సాయం అందిన వెంటనే ఆంథోనీ స్వదేశానికి పంపుతాం" అని పూరీ ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు.

కస్టమ్స్​ ఆఫీసర్​ పేరుతో 250మంది మహిళలకు గాలం- పెళ్లి పేరుతో మోసం- చివరకు చిక్కాడిలా!

ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం- కాలేజీ పరిశోధనకు పేటెంట్

Last Updated :Mar 2, 2024, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.