ETV Bharat / bharat

20గంటల ఆపరేషన్​- ప్రతి క్షణం టెన్షన్​ టెన్షన్​​- బోరుబావిలోంచి సురక్షితంగా బయటకు బాలుడు - Boy Fell Into Borewell Rescued

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 3:24 PM IST

Updated : Apr 4, 2024, 4:05 PM IST

Boy Fell Into Borewell Rescued : ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల బాలుడ్ని సురక్షితంగా బయటకు తీశారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్​డీఆర్​, ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి దాదాపు 20గంటల పాటు శ్రమించి బాలుడ్ని రక్షించాయి.

Boy Fell Into Borewell Rescued
Boy Fell Into Borewell Rescued

Boy Fell Into Borewell Rescued : బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడ్ని సురక్షితంగా బయటకు తీశారు. 20గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించిన ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు బాలుడ్ని రక్షించాయి. బయటకు తీసిన వెంటనే బాలుడ్ని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కర్ణాటక విజయపుర జిల్లా లచయానా గ్రామానికి చెందిన సతీశ్ ముజగొండ​ అనే రైతు తన పొలంలో బోరుబావి తవ్వించాడు. బుధవారం సాయంత్రం అతడి కుమారుడు సాత్విక్​ ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సాయంత్రం 6 గంటల సమయంలో సహాయక చర్యలు ప్రారంభించారు. 20 అడుగుల లోతులో చిక్కుకుపోయిన బాలుడికి ఆక్సిజన్ సరఫరా చేశారు. ఘటన స్థలంలో మెడికల్​ బృందం, అంబులెన్స్​ను సిద్ధంగా ఉంచారు. మరోవైపు, సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని గ్రామంలోని సిద్దలింగ మహారాజు సన్నిధిలో స్థానికులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.

బయటకు తీసినా దక్కని ప్రాణం
ఇటీవల గుజరాత్​లోని దేవ్​భూమి ద్వారక జిల్లాలో 30 అడుగుల బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాయక బృందాలు అనేక గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించి చిన్నారిని బయటకు తీసినా లాభం లేకుండా పోయింది. చిన్నారిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగాయి. ఎల్​ ఆకారంలోని హుక్​తో బాలికను తాడుతో కట్టి 15 అడుగుల మేర పైకి తీసుకొచ్చారు. బోరుబావికి సమాతరంగా తవ్వకాలు కూడా జరిపారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే చికిత్స కోసం అంబులెన్స్​లో జామ్ ఖంభాలియా పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

300అగుడుల బోరుబావిలో పడిన చిన్నారి
గతేడాది మధ్యప్రదేశ్​ సీహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారి మరణించింది. ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఫ్ బృందాలు, పోలీసులు జేసీబీలతో దాదాపు 55 గంటలపాటు శ్రమించి సహాయక చర్యలు చేపట్టి చిన్నారిని బోరు బావి నుంచి బయటకు తీశారు. అలాగే రోబోటిక్ బృందం సాయం తీసుకున్నారు. హుటాహుటిన అంబులెన్స్​లో బాలికను సీహోర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

24అంగుళాల 'చాంతాడు మీసాలు'- పూలన్​ దేవితో కనెక్షన్- పోలీస్​ స్టేషన్​లో ఆ ఘటన తర్వాత! - Longest Mustache In India

ఒక్కరోజే లోక్​సభకు 'లాల్​ శ్యామ్'- వెంటనే పదవికి రాజీనామా - గిరిజనుల హక్కుల కోసమే! - One Day Loksabha Mp Lal Shyam Shah

Last Updated : Apr 4, 2024, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.