ETV Bharat / bharat

లోక్​సభ ఎన్నికల్లో మాజీ భార్యాభర్తల సవాల్- ఒకే​ స్థానం నుంచి పోటీ- గెలుపు ఎవరిదో?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 1:03 PM IST

Updated : Mar 11, 2024, 1:11 PM IST

Battle Of former Couple : లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బంగాల్​లోని ఒకే పార్లమెంట్ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ పడనున్నారు. దీంతో ఆ నియోజకవర్గం నుంచి ఎవరూ గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Battle Of former Couple
Battle Of former Couple

Battle Of former Couple In Bengal : 2024 లోక్​సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బంగాల్​లోని ఓ పార్లమెంట్ స్థానం ఆసక్తికరంగా మారింది. ఒకే లోక్​సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు బరిలోకి దిగనున్నారు. ఒకరు తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా, మరొకరు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనియాంశంగా మారింది.

​బంకురా జిల్లాలోని బిష్ణుపుర్ లోక్​సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే సౌమిత్ర ఖాన్​ను బిష్టుపుర్​ నుంచి రంగంలో దింపింది బీజేపీ. టీఎంసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఈ స్థానం నుంచి సౌమిత్ర ఖాన్ మాజీ భార్య సూజాత మండల్​​ పేరు ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుజాత మండల్​ టీఎంసీ లోక్​సభ బరిలో దింపింది.

కెమెరా ముందే విడాకులు
కాంగ్రెస్ నేత సౌమిత్ర ఖాన్, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న సుజాత మండల్​ను 2010లో పెళ్లి చేసుకున్నారు. మొదట టీఎంసీలో ఉన్న సౌమత్ర ఖాన్, 2019లో లోక్​సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అదే సమయంలో సౌమిత్ర తరఫున సుజాత ప్రచారం కూడా చేసింది. తర్వాత 2021లో సుజాత టీఎంసీ పార్టీలో చేరింది. దీంతో అసహనానికి గురైన సౌమిత్ర కెమెరా ముందే సుజాతతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇక ఇటీవల బీజేపీ, టీఎంసీ వీరిని ఒకే స్థానం నుంచి బరిలోకి దింపాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ మాజీ భార్యభర్తల పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

42 మంది అభ్యర్థులతో జాబితా
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీఎంసీ రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. వారిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, మాజీ ఎంపీ మహువా మొయిత్రా పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా, 16 మంది సిటింగ్​లకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. బహ్‌రమ్‌పుర్‌ నుంచి యూసుఫ్‌ పఠాన్‌, మహువా మొయిత్రా మరోసారి కృష్ణానగర్‌ నుంచి తలపడనున్నారు.

ఓవైపు రాజీ కోసం సంప్రదింపులు- మరోవైపు గొర్రెలంటూ ప్రకటనలు: హిమాచల్ రెబల్ ఎమ్మెల్యేలు

హెలికాప్టర్లకు ఫుల్ డిమాండ్‌- గంటకు రూ.5లక్షలు వసూల్- గతేడాది కన్నా 40% ఎక్కువగా!

Last Updated : Mar 11, 2024, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.