ETV Bharat / bharat

అయోధ్యకు పొటెత్తిన భక్తులు- దర్శనం కోసం భారీ క్యూ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 9:56 AM IST

Updated : Jan 23, 2024, 10:42 AM IST

Ayodhya Ram Temple Crowd : మంగళవారం నుంచి సామాన్య భక్తులకు కూడా దర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులు ఉదయం నుంచే భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Ayodhya Ram Temple Crowd
Ayodhya Ram Temple Crowd

Ayodhya Ram Temple Crowd : అయోధ్యలో మంగళవారం నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 7 నుంచి ఆలయంలోకి అనుమతించించారు. అయోధ్య బాలరాముడిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే వేలమంది భక్తులు బారులు తీరారు. దీంతో దర్శన వేళలు పొడిగించే యోచనలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఉన్నట్లు సమాచారం. అయోధ్య ఆలయ పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేేశారు.

  • #WATCH | Uttar Pradesh: Devotees in long queues to visit Ayodhya's Hanuman Garhi Temple today.

    The Pran Pratishtha ceremony was done yesterday at Shri Ram Janmabhoomi Temple. pic.twitter.com/mSZIyjN53Z

    — ANI (@ANI) January 23, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంగళవారం ఉదయం ఏడు గంటల ముందే రాముడికి హారతి ఇచ్చారు. అనంతరం భక్తులు దర్శించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఉదయం హారతి కార్యక్రమానికి పరిమితంగా ఉచిత పాస్​లు అందించారు. మరోవైపు, ఆలయానికి వెళ్లే వారు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.

దర్శన, హారతి వేళలు
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దర్శనం, హారతి వేళల వివరాలను వెబ్​సైట్​లో వెల్లడించింది. ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. హారతి వేళలను ఉదయం 6:30 గంటలకు అని పేర్కొన్నారు. అయితే ఈ దర్శనం కోసం ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సంధ్యా హారతి రాత్రి 7:30 గంటలకు ఉంటుంది.

దర్శనం/హారతి పాస్​లకు అన్​లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?
మొదట శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్​సైట్​కు వెళ్లి రిజిస్ట్రేష్టన్​ చేసుకోవాలి. అందుకోసం మీ మొబైల్​ నంబరుతో సైన్​ ఇన్​ అయి ఓటీపీ ఎంటర్​ చేస్తే చాలు రిజిస్ట్రేష్టన్​ పూర్తవుతుంది. తరువాత లాగిన్​ అయి మై ప్రొఫైల్ సెక్షన్​లోకి వెళ్లి మీ గుర్తింపు వివరాలు, చిరునామా వంటి నమోదు చేయాలి. ఆ తర్వాత హారతి లేదా దర్శనం టైమ్​ స్లాట్లను ఎంచుకుని పాస్​ కోసం బుక్​ చేసుకోవాలి. ఆలయంలోకి వెళ్లిన తర్వాత కౌంటర్​లో మీ పాస్​లు తీసుకుని దర్శనానికి వెళ్లొచ్చు.

Last Updated :Jan 23, 2024, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.