ETV Bharat / bharat

'రాబోయే కొన్నేళ్లలో 1000 అమృత్‌ భారత్‌ రైళ్లు- ప్రతివారం పట్టాలపైకి ఒక ట్రైన్'

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 9:33 PM IST

Amrit Bharat Trains In India : రైల్వే ప్రాజెక్టుల గురించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కొన్నేళ్లలో దాదాపు 1000 అమృత్‌ భారత్‌ రైళ్లను తయారుచేయనున్నట్లు పేర్కొన్నారు.

1000 Amrit Bharat Trains
1000 Amrit Bharat Trains

Amrit Bharat Trains In India : రానున్న కొన్నేళ్లలో భారతీయ రైల్వే దాదాపు 1000 అధునాతన అమృత్‌ భారత్‌ రైళ్లను తయారుచేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. అలాగే గంటకు గరిష్ఠంగా 250 కి.మీ. వేగంతో నడిచే రైళ్లను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు వెల్లడించారు. బంగాల్‌ రాజధాని కోల్‌కతా-హావ్‌డా నగరాలను కలుపుతూ దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో నిర్మించిన మెట్రో మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ మార్చి 6న ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు మీడియాతో రైల్వే ప్రాజెక్టులు గురించి పలు విషయాలు పంచుకున్నారు.

'భారతీయ రైల్వే ఏటా 700 కోట్ల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రయాణాల విషయంలో ఒకరికి రూ.100 ఖర్చవుతుండగా రూ.45 మాత్రమే వసూలు చేస్తున్నాం. అమృత్‌ భారత్‌ రైళ్లు కేవలం రూ.454 ఖర్చుతో 1,000 కి.మీల ప్రయాణాన్ని అందిస్తాయి' అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో వందే భారత్‌ రైళ్ల ఎగుమతి ప్రారంభమవుతుందన్నారు. 'యువతలో వందే భారత్‌ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రతీవారం ఓ రైలు పట్టాలెక్కుతోంది. రాబోయే కొన్నేళ్లలో 400 నుంచి 500 వరకు ఈ రైళ్లను తయారుచేస్తాం' అని వెల్లడించారు.

నదీగర్భంలో మెట్రో మార్గమిది
కోల్‌కతా ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌ (మెట్రో లైన్‌-2)లో భాగంగా హుగ్లీ నదికి తూర్పు తీరంలో మహాకరణ్‌, పశ్చిమతీరంలో హావ్‌డా మెట్రోస్టేషన్‌లు నిర్మించారు. ఈ రెండింటిని కలుపుతూ నదీ మట్టానికి 32 మీటర్ల లోతులో, 520 మీటర్ల పొడవునా మెట్రో మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం ప్రారంభంతో కోల్‌కతాలోని టెగోరియా స్టేషన్‌ నుంచి హుగ్లీ నదికి అవతలి హావ్‌డా మైదాన్‌ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. భూఉపరితలానికి 33 మీటర్ల దిగువనున్న హావ్‌డా మెట్రో స్టేషన్‌ దేశంలోనే అతిలోతైన భూగర్భ మెట్రో స్టేషన్‌గా గుర్తింపు పొందింది.

దేశంలో అతిపెద్ద రైలు టన్నెల్​
Longest Railway Tunnel In India : దేశంలో అతిపెద్ద రైలు టన్నెల్ T-50 ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో U.S.B.R.L ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బనిహాల్- ఖడీ- సుంబడ్‌- సంగల్‌దాన్‌ సెక్షన్‌ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రారంభించారు. ఈ మార్గంలోనే ఖడీ- సుంబడ్‌ల మధ్య T-50 సొరంగం ఉంటుంది. దీని పొడవు 12.77 కిలోమీటర్లు. ఈ రైలు టన్నెల్​ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చెయ్యండి.

బీజేపీ లోక్​సభ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్​- వారణాసి నుంచి మోదీ పోటీ

పొగాకు వ్యాపారి ఇంట్లో రూ.60 కోట్లు విలువైన కార్లు- రూ.2.5 కోట్ల వాచీలు, గోల్డ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.