ETV Bharat / bharat

పొగాకు వ్యాపారి ఇంట్లో రూ.60 కోట్లు విలువైన కార్లు- రూ.2.5 కోట్ల వాచీలు, గోల్డ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 3:59 PM IST

IT Raid On Kanpur Tobacco Businessman
IT Raid On Kanpur Tobacco Businessman

IT Raid Kanpur : మూడు రోజులుగా ఓ పొగాకు వ్యాపారి ఇంట్లో సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు అతడి వద్ద నుంచి రూ.60 కోట్లు విలువైన కార్లు, రూ.2.5 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదునూ పట్టుకున్నారు. అంతేకాకుండా కోట్లలో పన్ను ఎగవేతకు కూడా పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటన యూపీలోని కాన్పుర్​ జిల్లాలో వెలుగు చూసింది.

IT Raid Kanpur : ఓ పొగాకు వ్యాపారి దగ్గర్నుంచి ఏకంగా రూ.60 కోట్లు విలువైన ఖరీదైన కార్లతో పాటు రూ.2.5 కోట్లు ఖరీదు చేసే బంగారు ఆభరణాలు, వాచీలను స్వాధీనం చేసుకున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. పెద్ద మొత్తంలో నగదును కూడా గుర్తించారు. గత మూడు రోజులుగా దిల్లీలోని అతడి నివాసంలో సోదాలు జరుపుతున్న ఐటీ శాఖ బృందాలు అతడి వద్ద పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలను కూడా గుర్తించాయి. ఈ దాడుల్లో అతడికి విదేశాల్లోనూ ప్రాపర్టీలు ఉన్నట్లు డాక్యుమెంట్లు లభించాయని చెప్పారు అధికారులు. అంతేకాకుండా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పన్నులను కూడా అతడు ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టినట్లు ఐటీ సోదాల్లో తేలింది. సంబంధిత దస్త్రాలన్నింటినీ తాము స్వాధీనం చేసుకున్నామని, ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించామని ఐటీ శాఖ అధికారి ఒకరు చెప్పారు.

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​ జిల్లాలోని నాయగంజ్​ ప్రాంతంలో మున్నా మిశ్రా అనే వ్యక్తి బన్షీధర్​ టొబాకో కంపెనీని నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం దిల్లీలోని ఇతడి ఇంటిపై సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఈ క్రమంలో దాడుల్లో భాగంగా మున్నా అక్రమంగా సంపాదించిన ఆస్తులను సీజ్​ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మున్నాకు విదేశాల్లోని కంపెనీలతోనూ పలు సంబంధాలు ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో మున్నా పొగాకు వ్యాపారం విదేశాలకూ విస్తరించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అయితే వీటన్నింటిపై నిందితుడు మున్నా మిశ్రా ఇప్పటివరకు అస్సలు నోరే విప్పలేదని అధికారులు చెబుతుండగా, అతడి ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం అతడు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడని మున్నా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అప్పట్లో పియూష్​- ఇప్పుడు మున్నా
కొన్నేళ్ల క్రితం కాన్పుర్​ నివాసి అయిన పియూష్​ జైన్​ అనే పెర్ఫ్యూమ్​ వ్యాపారి ఇళ్లు, కార్యాలయాల్లో కూడా డీజీజీఐ (డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ జీఎస్​టీ ఇంటిలిజెన్స్​) సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో కూడా అతడి వద్ద నుంచి కూడా ఇదే స్థాయిలో పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు, కార్లు, గడియారాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అప్పట్లో ఈ అంశం హాట్​ టాపిక్​గా మారింది. ఇక మున్నా కేసు కూడా అదే తరహాలో ఉండటం వల్ల ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పోలీసుల అదుపులో నలుగురు

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్​ దర్యాప్తు ముమ్మరం- అనుమానితుడి గుర్తింపు! 8 బృందాలతో గాలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.