తెలంగాణ

telangana

పెళ్లి వేడుకలో విషాదం.. ఒక్కసారిగా కూలిన బాల్కనీ.. బంధువులంతా!

By

Published : Jun 15, 2022, 11:44 AM IST

Balcony Collapsed In Marriage: అప్పటివరకు అంగరంగ వైభవంగా జరుగుతున్న వివాహ వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. వధూవరులు పూలదండలు మార్చుకుంటున్న ఘట్టాన్ని పెళ్లికి వచ్చిన అతిథులంతా చప్పట్లు కొడుతూ తిలకిస్తున్నారు. ఇంతలోనే అకస్మాత్తుగా భవన బాల్కనీ కూలిపోయింది. దీంతో బాల్కనీలో నిల్చున్న అతిథులంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన జూన్​ 13న బిహార్​లోని ఔరంగాబాద్ జిల్లా హరిబరి గ్రామం​లో జరిగింది. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన వైద్యం కోసం మగధ వైద్య కళాశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details